పేలు ఎక్కువగా ఉన్నాయా.. వీటిని రాయండి..

తలలో పేను ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది. భరించలేనంతగా దురద ఉంటుంది. వీటిని దూరం చేసే కొన్ని ఇంటి చిట్కాల గురించి తెలుసుకోండి.

పేలు.. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకూ తలలోకి చేరి ఇబ్బందిపడతాయి. మరీ ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది. ఇది స్కూల్‌కి వెళ్ళినప్పుడు ఒకరి తల నుంచి మరొకరికి వస్తాయి. తలలో రక్తం తాగుతాయి. దీంతో దురద వంటి సమస్యలొస్తాయి. వీటిని వదిలించుకోవడానికి సహజ పరిష్కారాలు ఏంటో తెలుసుకోండి. వెల్లుల్లి..

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న వెల్లుల్లిని వాడి తల పేలని కూడా వదిలించుకోవచ్చు. ఇందుకోసం వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా చేసి నిమ్మరసంలో కలిపి జుట్టుకి అప్లై చేయండి. అరగంటపాటు అలానే ఉంచి షాంపూతో జుట్టుని క్లీన్ చేసుకోండి. ఇందులో యాంటీ మైక్రోబయల్, అల్లిసిన్, సల్ఫర్ లక్షణాలు ఉంటాయి. దీని వల్ల అదనపు నూనె, సెబమ్ పేరుకుపోకుండా తగ్గుతుంది. దీనిని వాడితే పొడవైన, బలమైన జుట్టు ఉంటుంది. పీహెచ్ బ్యాలెన్స్ మెంటెయిన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది.

టీట్రీ ఆయిల్..

టీట్రీ ఆయిల్‌లో మైక్రోబయల్ గుణాలు ఉంటాయి. దీని వల్ల పేలు తగ్గుతాయి. దీని కోసం టీట్రీ ఆయిల్‌ని కొద్దిగా నూనెలో వేసి కలపండి. గంట తర్వాత తలని క్లీన్ చేయండి. టీట్రీ ఆయిల్‌లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. దీనిని కొబ్బరినూనెలో వేసి రాయడం వల్ల దురద, డ్రైనెస్‌ని తగ్గించి తేమని అందిస్తాయి. ​Also Read : కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి..

బేకింగ్ సోడా..

బేకింగ్ సోడాతో కూడా పేలని దూరం చేసుకోవచ్చు. దీనికోసం బేకింగ్ సోడాలో కండీషనర్‌ని కలిపి తలకి అప్లై చేయండి. ముప్పై నిమిషాల తర్వాత పేలని క్లీన్ చేయండి. తర్వాత షాంపూ, కండీషనర్‌తో జుట్టుని క్లీన్ చేసుకోవాలి.

బేబి ఆయిల్..

పేలని దూరం చేసే గుణాలు బేబి ఆయిల్‌లో పుష్కలంగా ఉన్నాయి. దీనిని ఎలా వాడాలంటే తలకి రాసి రాత్రంతా అలానే ఉంచండి. జుట్టుని బాగా దువ్వండి. గంట, రెండు గంటల తర్వాత టీట్రీ ఆయిల్, వేప ఆధారిత షాంపూలతో తలని క్లీన్ చేసుకోండి. దీని వల్ల పేలు దూరమవుతాయి. ​Also Read : మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ఆముదాన్ని ఇలా తీసుకోండి..

వేప నూనె..

పేలని వదిలించడంలో వేప నూనె బాగా పనిచేస్తుంది. దీనిని కాస్తా వేడి చేసి తలకి రాయాలి. కనీసం ఓ గంట పాటు ఉండనివ్వండి. దువ్వెనతో దువ్వండి. తర్వాత హెర్బల్ షాంపూతో మీ జుట్టుని క్లీన్ చేయండి. రెగ్యులర్‌గా చేస్తే సమస్య తగ్గుతుంది. ​​Read More : Home remedies News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-27T06:52:53Z dg43tfdfdgfd