భూమిలో వెలిసిన భద్రకాళి అమ్మవారు.. దర్శిస్తే సకల శుభాలే..!!

ఆ ఉమ్మడి జిల్లాలో అతి చిన్న విగ్రహ రూపంలో స్వయంబుగా భూమిలో వెలిసింది ఆ అమ్మవారు. ఆ అమ్మవారిని తలిస్తే చాలు మన మనసులో కోరికలను అమ్మవారు తీరుస్తుందట. సకల సౌభాగ్యాలు అందించే ఆ అమ్మవారిని దర్శించేందుకు పెద్దఎత్తున భక్తులు ఆ ప్రాంతానికి చేరుకుంటారు. ముఖ్యంగా ఏడాదికి ఒకసారి నిర్వహించే అమ్మవారి జాతర కోలాహాలంగా ఆ ప్రాంతంలో జరుగుతుంది. ఇంతకీ ఎవరా అమ్మవారు. ఆవిశేషాలు ఏంటి ఒకసారి చూద్దాం..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడజిల్లా కొత్తపేట ప్రాంతంలో గల రాజా మైదానంలో స్వయంబుగా భూమిలో శ్రీ భద్రకాళి అమ్మవారు వెలసి ఉన్నారు. తొలుత ఒక చెట్టు కింద భూమిలో నుంచి బయటికి వచ్చి భక్తులకు శ్రీ భద్రకాళి అమ్మవారు దర్శనమిచ్చారు. క్రీడా మైదానం కావడంతో ఆడుకునే పిల్లలు ఇక్కడ చెట్టుకింద భూమిలో ఉన్న విగ్రహానికి దర్శనం చేసుకుని ముందుకు వెళ్లేవారు. రాను రాను ఈ అమ్మవారిని రాజులు ఇలవేల్పుగా అమ్మవారి చిన్నపాటి ఆలయం నిర్వహించారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో గతంలో ఒక సర్కస్ పెట్టడం సర్కస్లో జంతువులు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ అమ్మవారికి సర్కస్ యజమాని తన సమస్య తీర్చమని దండం పెట్టుకోవడం అనంతరం సమస్య తీర్చడంతో మొట్టమొదటిగా చిన్నపాటి ఆలయం సైతం సర్కస్ యజమాని నిర్వహించినట్లుగా స్థానికులు పేర్కొంటూ ఉంటారు.

10న ఫ్రీ మెడికల్ క్యాంప్.. రూ.5000 విలువైన స్కానింగ్ ఉచితం

ప్రస్తుతం కాకినాడ జిల్లాలో అతి శక్తివంతమైన ఆలయంగా కోరిన కోర్కెలు తీర్చే కల్పవలిగా శ్రీ భద్రకాళి అమ్మవారు విరాజిల్లుతున్నారు ముఖ్యంగా అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన శుక్రవారం పర్వదినాన్న విశేష పూజ కార్యక్రమాలు పూజలు అక్కడ అర్చకులు నిర్వహిస్తారు. మరి ముఖ్యంగా పౌర్ణమి సందర్భంగా అన్న ప్రసాద వితరన పెద్ద ఎత్తున నిర్వహించడమే కాక అమ్మవారి మూల విరాట్ కు లోకశాంతి కోసం పంచామృత అభిషేక కార్యక్రమాల సైతం ఘనంగా ఈ ఆలయంలో జరుగుతాయి.

రూ.4 లక్షలు సంపాదన.. అదరగొడుతున్న 79 ఏళ్ల రైతు

అటువంటి దివ్య భద్రకాళి సన్నిధిలో ఏడాదికి ఒకసారి వచ్చి జాతర మహోత్సవాలు కోలాహాలంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. గంధ అమావాస్య జాతర మహోత్సవంలో భాగంగా మూడు రోజులు పాటు అత్యంత ఘనంగా ఆధ్యాత్మిక ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు కళ్ళు మిర్మిట్లు కమ్మే విద్యుత్ కాంతులు నడుమ పుష్ప అలంకరణలో భద్రకాళి అమ్మవారు దేదీప్యమానంగా దర్శనమిస్తూ భక్తులను కటాక్షిస్తున్నారు.

మరోపక్క లోక శాంతికే ప్రత్యేక పూజ కార్యక్రమాలతో పాటు గరగల సంబరం ప్రత్యేక కోలాటాలు ఆధ్యాత్మిక ర్యాలీలు కుంకుమ పూజలు ఇలా ప్రత్యేక కార్యక్రమాలు ఈ మూడు రోజులు పాటు అత్యంత ఘనంగా ఆలయంలో జరుగుతాయి. ప్రధానంగా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ అర్చకులు ఇచ్చే ఒక నిమ్మకాయని మనం తీసుకువెళ్తే ఎటువంటి సమస్యలు మనకు తలెత్తవని ఎంతో విశ్వాసంతో భక్తులు చెబుతూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా ఇక్కడ అమ్మవారిని నిమ్మకాయలతో భక్తులు కొలుస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది సైతం దేవస్థానం చైర్మన్ అనిశెట్టి సూర్యచక్రరెడ్డి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి.

2024-05-08T09:52:25Z dg43tfdfdgfd