భక్షాల బండ్లని ఎప్పుడైనా చూశారా...!!

హిందువుల సంప్రదాయ ప్రకారం స్వామి వారికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం కాకపోతే ఇక్కడ స్వామివారికి నైవేద్యం సమర్పించాలంటే భక్షాల బండి కట్టాల్సిందే. ఇంతకు ఆ గ్రామం ఎక్కడ ఉంది. ఆ సంప్రదాయం ఏంటో తెలుసుకుందాం పదండి. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో తత్తూరు గ్రామం అది. ఈ గ్రామంనందు వెలిసిన శ్రీ శ్రీ తత్తూరు రంగనాథ స్వామి వారికి నైవేద్యం సమర్పించాలంటే భక్షాల బండ్లను కట్టాల్సిందేనని గ్రామస్తులు లోకల్ 18 తో తెలిపారు. తమపూర్వం నుంచి ఒక ఆచార పద్ధతుల ప్రకారం ఇలాగే కొనసాగుతూ ఉందని చెబుతున్నారు. ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో జరిగే శ్రీ శ్రీ తత్తూరు రంగనాథ స్వామి తిరుణాల అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుందన్నారు.

ఈ తిరుణాలను తిలకించేందుకు ఉమ్మడి జిల్లాల నుంచి వేలాది సంఖ్యలో భక్తాదులు తరలి వస్తూ ఉంటారు. ఇలా వచ్చే తరుణంలో రైతన్నలు మొక్కుబడులు చెల్లించుకోవడానికి నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న రైతన్నలు ప్రతి ఒక్కరూ ఎద్దుల బండ్లతో తత్తూరు రంగనాథ స్వామి గుడికి చేరుకుంటారు. ఇలా ఎద్దుల బండ్లతో తత్తూరు చేరుకునే ముందు రైతన్నలు వారి గ్రామం నుంచి ఇంటింటి నుంచి భక్షాలను చేస్తారు.

శుభవార్త.. రైతుల అకౌంట్లలోకి మళ్లీ డబ్బులు..

ఎర్ర,తెల్లని రంగుతో, ఎద్దుల బండ్లను నీటుగాఅలంకరిస్తారు. ఎద్దులను నీటిగా ముస్తాబు చేసుకొని, వాటి కొమ్మునకు పూలుకుచ్చులు, చెండు తాళ్లు కట్టి రెడీ చేస్తారు. అనంతరం భక్షాలను ఎద్దులబండికి ఎత్తితత్తూరు రంగనాథ స్వామి గుడి దగ్గరికి చేరుకుంటారు. రైతన్నల కోరికలను నెరవేర్చే విధంగా స్వామివారికి వారి ఇంటి నుంచి తీసుకువచ్చిన నైవేద్యాన్ని రంగనాథ స్వామి గుడిలో సమర్పించి వారి కోరికలు నెరవేరాలని స్వామివారిని కోరుకుంటారు.

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అదిరే గుడ్ న్యూస్.. ఇక ఉచితంగానే..

ఆయు ఆరోగ్యాలు బాగుండాలని, వర్షాలు పుష్కలంగా కురవాలని, పాడి పంటలతో రైతన్నలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటామని గ్రామస్తులు చెప్పారు. ఇలా వారి కోరికలు నెరవేరితే ప్రతి సంవత్సరము తత్తూరు రంగనాథ స్వామికి భక్షాల బండ్లను కట్టుకొని వచ్చి యధావిధిగా వారి మొక్కలు నెరవేర్చుకుంటు ఉంటారని పూజారి పుల్లారెడ్డి తెలిపారు.

2024-04-25T12:32:35Z dg43tfdfdgfd