భద్రాచలం మాదిరి ఏకశిలపై సీతారాములు ఉన్న రామగిరి ఆలయం ఇదే...!!

భద్రాచలం దివ్య క్షేత్రంలో ఏకశిలపై సీతారాముల విగ్రహాలు ఏ విధంగా దర్శనమిస్తాయో మరలా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతంలో మాత్రమే ఏకశిలపై సీతారాముల విగ్రహాల దర్శనమిస్తాయి. కొన్నివందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంలో దాదాపు నెల రోజుల ముందే ఆ రాములవారి కల్యాణోత్సవాలు ప్రారంభిస్తారు. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుంది..? నెల రోజుల ముందు నిర్వహించే ఆఉత్సవాలు ప్రత్యేకత ఏమిటి ఒకసారి చూద్దాం.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి రౌతులపూడి మండలం ములగపూడి గ్రామమది. గ్రామంలో రామగిరి కొండపై కొన్ని వందల సంవత్సరాల కిందట సీతారాముల విగ్రహాలు స్వయంభుగా ఏకశిలపై ఈ ప్రాంతంలో వెలిసాయి.దీంతో ఈ ప్రాంతాన్ని రామగిరి ప్రాంతంగా భక్తులు పిలుస్తూ ఉంటారు.నిజానికి భద్రాచలంలో ఏకశిలపై సీతారాములు ఏవిధంగా దర్శనమిస్తారో మరలా అదే విధంగా దర్శనమిచ్చే ఆలయం ఏదైనా ఉందా అంటే ఈ ములగపూడి రామగిరి కొండపై ఉన్న రామాలయం అని చెప్పుకోవచ్చు.

ఈ మహిళ ఐడియా 6 మంది మహిళలకు ఉపాధి ఇచ్చింది.. సూపర్ కదా!

ఎత్తయిన కొండపై ఆనాటి ఎన్నో ఆన్నవాళ్ళ మధ్య పురాతన చిన్న కట్టడంలో మాత్రం స్వామి అమ్మవార్లు ఏకశిలపై ఈ దివ్య ఆలయంలో దర్శనమిస్తూ ఉంటారు. నిజానికి గ్రామమంతా ఒకటై ప్రతిఏడాది రాములవారి కళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ దివ్యక్షేత్రంలో ఎటుచూసినా ఆనాటి ఆనవాళ్లు ఎక్కువగా అక్కడక్కడ కొండపై కనిపిస్తూ ఉంటాయి. రాములోరి పండగకు నెలరోజుల ముందే ఈ చుట్టూ పక్కల 40 గ్రామాలు సిద్ధమవుతాయి. నిజానికి సీతారాములు కళ్యాణం అంటేనే తలంబ్రాలు ప్రతి ఒక్కరు కూడా సీతారాముల తలంబ్రాలు అన్న ఎన్నో నివాసాలకు తీసుకువెళ్లి వివాహం కాని వారికి ఈ రాములవారి కళ్యాణ తలంబ్రాలు వేస్తే శుభం జరుగుతుంది అని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ఆ గ్రామంలో ఇప్పటి నుంచి ప్రారంభించారు.

ఇక్కడ రూ.100కే నాలుగు చికెన్ లాలీపాప్స్...సూపర్ టేస్ట్!

రౌతులపూడి మండలంతో పాటు చుట్టుపక్కల 40 గ్రామాల ప్రజలు వడ్లను తలంబ్రాలుగా తయారు చేసే కార్యక్రమాన్ని ఇప్పటినుంచి ప్రారంభించారు. ప్రతిరోజు మధ్యాహ్నం శ్రీరామ నామ జపం చేస్తూ మహిళలు భక్తిశ్రద్ధలతో ఈ వడ్లను తలంబ్రాలుగా తయారు చేసే ప్రక్రియను ప్రారంభించారు. తలంబ్రాలుగా తయారు చేసిన అనంతరం దేవాలయానికి పంపిస్తారు. శుభ ముహూర్తాన సీతారాములు కళ్యాణంలో ఈ ఒడ్లతో తయారుచేసిన తలంబ్రాలు సీతారాములు తలపై వేస్తారు. అనంతరం అవి భక్తులకు పంచిపెట్టడమే కాక అన్నప్రసాద వితరనలో సైతం అవే తలంబ్రాలు బియ్యం ఉపయోగించడం ఆనవాయితీగా వస్తుంది. ఏది ఏమైనా రాములోరి కళ్యాణానికి ఏకశిలా రామాలయం సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు.

2024-03-29T12:01:20Z dg43tfdfdgfd