ముఖంపై నల్ల మచ్చలు పోవాలంటే ఏం చేయాలి?

ఆడవారికి ఈ చర్మ సమస్య ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ముఖంపై ఉన్న నల్ల మచ్చలను పోగొట్టేందుకు ఎన్నో రకాల క్రీములను వాడుతుంటారు. అయినా అవి అస్సలు తగ్గవు. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ముఖంపై ఒక్క నల్ల మచ్చ కూడా లేకుండా చేయొచ్చు. అదెలాగంటే?

 

ఆడవారు అందం విషయంలో అస్సలు తగ్గరు. అందంగా కనిపించేందుకు, ముఖం నీట్ గా కనిపించేందుకు మార్కెట్ లో దొరికే రకరకాల క్రీములను వాడుతుంటారు.  ముఖ్యంగా ముఖంపై ఉండే తెల్ల, నల్ల మచ్చలను పోగొట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నో క్రీమ్స్ ను వాడుతుంటారు. కానీ మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ లో ఎన్నో రకాల కెమికల్స్ ఉంటాయి. ఇవి ముఖ చర్మాన్ని దెబ్బతీస్తాయి. అయితే కొన్ని టమాటా ఫేస్ ప్యాక్ లతో కూడా మీరు మీ ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. ముఖంపై ఉన్న నల్ల మచ్చలను కూడా పోగొట్టొచ్చు. మరి ఈ ఫేస్ ప్యాక్ లను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

టమాటా, టీ ట్రీ ఆయిల్ మాస్క్

టమాటా, టీ ట్రీ ఆయిల్ కలయిక మన చర్మ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేయడానికి టమాటా గుజ్జులో కొద్దిగా టీ ట్రీ ఆయిల్ ను వేసి ముఖానికి అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల డార్క్ స్పాట్స్ తగ్గి క్లియర్ స్కిన్ వస్తుంది. టీ ట్రీ ఆయిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మం  స్థితిస్థాపకతను పెంచుతాయి. అలాగే చర్మం రంగును పెంచుతాయి. ఈ మాస్క్ తయారు చేయడానికి ఒక టేబుల్ స్పూన్ టీ ట్రీ ఆయిల్, ఒక టీస్పూన్ జోజోబా ఆయిల్, టమాటాలను తీసుకొని వాటిని కలిపి పేస్ట్ లా తయారు చేయండి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి 15 నిముషాల తర్వాత చల్ల నీటితో కడిగేయండి. 

 

టామాటా తేనె మాస్క్

ఈ ఫేస్ మాస్క్ ను తయారీకి ఒక టేబుల్ స్పూన్ తేనె, టామాటో ప్యూరీని తీసుకోండి. ఈ పదార్థాలన్నింటిని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 10-15 నిముషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోండి. 

టామాటా ఓట్ మీల్ మాస్క్

ఈ ఫేస్ మాస్క్ ను తయారుచేయడానికి ఒక టీస్పూన్ ఓట్స్ ను తీసుకుని, ఒక టీస్పూన్ పెరుగు, టామాటా ప్యూరీ మిక్స్ చేసి ఈ ఫేస్ మాస్క్ ను తయారు చేయండి. పేస్ట్ ను తయారుచేసి కొద్దిగా వేడి చేసి ముఖానికి సమానంగా అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేయండి. 

 

కలబంద టమాటా ఫేస్ మాస్క్

టమాటాల్లోని బ్లీచింగ్ గుణాలు, కలబందలోని శీతలీకరణ గుణాలు చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అలసట,ఉబ్బిన కళ్లను చికిత్స చేయడంలో ఈ మాస్క్ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ మాస్క్ ను తయారుచేయడానికి ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జును తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ టమాటా రసం వేసి బాగా కలపండి. దీన్ని కళ్ల కింద అప్లై చేసి 10 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత బాగా కడగండి. 

2024-05-01T11:21:58Z dg43tfdfdgfd