ముఖానికి ఈ జెల్ రాస్తే క్షణాల్లో మెరుస్తుంది..

సమ్మర్‌లో స్కిన్ కేర్ అనేది చాలా ముఖ్యం. ఇందుకోసం ఏ టిప్స్ ఫాలో అవ్వాలో తెలుసుకోండి.

ముఖాన్ని క్లీన్ చేయడం..

ఎండాకాలంలో చర్మ సంరక్షణలో ముఖ్యమైంది ముఖాన్ని క్లీన్ చేయడం. ముఖాన్ని చల్లని నీటితో కడిగాక చల్లని పాలలో దూది ముంచి ముఖానికి క్లీన్ చేయాలి. దీని వల్ల సూర్యుడి వల్ల వచ్చే ఎఫెక్ట్‌ని తతగ్గించుకోవచ్చు. అదే విధంగా SPF 30, అంతకంటే తక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ని ముఖానికి అప్లై చేయడం మంచిది.

చర్మాన్ని మెరిపించే స్క్రబ్..​ ​

ఎక్స్‌ఫోలియేషన్..

చర్మాన్ని ఎక్స్‌ఫోలియేషన్ చేయడం కూడా ముఖ్యం. వారానికి ఓసారైనా ఇలా చేయండి. దీనికోసం శనగపిండి, పాల మీగడ, పసుపు కలిపి ముఖానికి రాయండి. కావాలనుకుంటే అందులో ఓట్స్, పసుపు, కొద్దిగా నిమ్మరసం కలుపుకోవచ్చు. దీనిని కాసేపు మసాజ్ చేసి తర్వాత క్లీన్ చేసుకోవాలి. ​Also Read : ఇంట్లోనే తయారు చేసిన ఈ సీరమ్‌తో ముఖం మెరుస్తుంది..

అలోవెరా..

వేసవిలో అలోవెరా కూడా చాలా మంచిది. దీనిని ఐస్‌క్యూబ్‌లా చేసి ముకానికి రాసి మసాజ్ చేయాలి. ముఖ్యంగా బయటికి వెళ్ళినప్పుడు రాస్తే యాంటీ ఇన్‌‌ఫ్లమేటరీ లక్షణాలు అందుతాయి. చర్మానికి మంటను కలగకుండా ఎగ్జిమా వంటి చర్మ సమస్యలకి చాలా మంచిది. ​Also Read : చేతి గోర్లని ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా పెరుగుతుందట..

పుచ్చకాయ రసం..

పుచ్చకాయ రసం, దోసకాయ రసం కూడా చర్మాన్ని చల్లబరుస్తుంది. ఇవన్నీ కూడా ముఖానికి చర్మానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ ఎ, బి6, సిలు ఉంటాయి. ఇందులో లైకోపీన్, అమైనో యాసిడ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చర్మానికి చాలా మంచిది.

గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Beauty News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-29T12:49:31Z dg43tfdfdgfd