మండే ఎండల్లోనూ మెరిసే అందాన్ని ఇచ్చే పండ్లు ఇవి..!

పండ్లలో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. చర్మాన్ని హైడ్రెటెడ్ గా ఉంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. దాని వల్ల.. పండ్లను తిన్నప్పుడు మన చర్మం  రేడియంట్ గా, ఆరోగ్యంగా తయారౌతుంది. 

సాధారణంగా ఎండల్లో కూరగాయాలు ఆకుకూరలు ఎలా అయితే వడపడిపోతాయో.. మనం కూడా అంతే... కాసేపు మనకు ఎండ తగిలినా వడపడిపోతాం. చర్మం కమిలిపోతుంది. ఫేస్ మీద ర్యాషెస్, స్కిన్ ట్యాన్ అయిపోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.  కానీ... మనం ఈ మండే ఎండల్లో కొన్ని పండ్లు కనుక మన డైట్ లో భాగం చేసుకుంటే... మెరిసే చర్మం మన సొంతం అవుతుంది. మరి.. ఈ సమ్మర్ లో ఎలాంటి పండ్లు తినాలి.. వేటిని తింటే మన అందం రెట్టింపు అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

 

పండ్లలో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. చర్మాన్ని హైడ్రెటెడ్ గా ఉంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. దాని వల్ల.. పండ్లను తిన్నప్పుడు మన చర్మం  రేడియంట్ గా, ఆరోగ్యంగా తయారౌతుంది. 

 

1.పుచ్చకాయ..

పుచ్చకాయలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని తినడం వల్ల చర్మం హైడ్రేటెడ్ గా మారుతుంది. ఈ పుచ్చకాయలో విటమిన్ ఏ, సీ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలాజిన్ ప్రొడక్షన్ లో సహాయం చేస్తాయి. మనం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.

2.బొప్పాయి..

ఎండకాలం బొప్పాయి ఏం తింటాం అనుకుంటారు. కానీ,.. ఎండాకాలంలో బొప్పాయి తినడం వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి. దీనిలో విటమిన్ ఏ, సీ, ఈ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన చర్మంలోని డెడ్ సెల్స్ ని ఎక్స్ఫోలియేట్ చేస్తాయి,  చర్మం యవ్వనంగా కనిపించడంలో సహాయం చేస్తాయి,

3.బెర్రీస్..

బెర్రీస్ లోనూ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.  ఇవి కూడా అంతే...డెడ్ సెల్స్ ని రిపేర్ చేయడంలో.. సెల్ రీజెనరేట్ చేయడంలో సహాయం చేస్తాయి. వీటిని తినడం వల్ల,.. మన చర్మం ఆరోగ్యకరంగా.. యవ్వనంగా కనపడేలా చేస్తాయి.

 

4.నారింజ పండ్లు..

నారింజ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా.. మన చర్మంలో కొలాజిన్ ప్రొడక్షన్ ని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. సూర్య రశ్మి వల్ల కలిగిన డ్యామేజ్ ని తగ్గించడంలోనూ... చర్మం మెరుస్తూ కనిపించేలా  చేస్తుంది. మనం యవ్వనంగా కనిపించాలంటే విటమిన్ సి చాలా అవసరం.. అది ఆరెంజెస్ లో పుష్కలంగా ఉంటుంది.

 

5.కివీ పండ్లు..

మనకు మార్కెట్లో కివి పండ్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఈ కివి పండ్లలో విటమిన్ సీ, ఈ పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా స్కిన్ డ్యామేజ్ ని రిపేర్ చేయడంలో సహాయం చేస్తాయి.  చర్మం సాగినట్లుగా అవ్వకుండా.. చర్మంపై ముడతలు రాకుండా నివారించడంలో కివి కీలక పాత్ర పోషిస్తుంది.

6.పైనాపిల్...

పైనాఫిల్ కూడా మన అందాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించడానికీ, చర్మాన్ని ఎక్కువ కాలం మెరిసేలా చేయడంలో పైనాపిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

7.మామిడి పండు..

సమ్మర్ కి రారాజు అయిన మామిడి పండు కూడా ఈ సీజన్ లో మన అందాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే.. మామిడి పండ్లలోనూ విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలాజిన్ ప్రొడక్షన్  ని పెంచడానికీ,, చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి, వయసు పెరగడాన్ని ఆపడంలోనూ యవ్వనంగా కనిపించేలా చేయడంలోనూ సహాయం చేస్తుంది.

2024-04-19T03:15:36Z dg43tfdfdgfd