మహావిష్ణువు ఉగ్రనరసింహ అవతార క్షేత్రం.. దర్శిస్తే కొంగు బంగారం!

ఉమ్మడి కర్నూలు జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం ప్రముఖ క్షేత్రాలలో ఒకటి అహోబిలం. పురాణా ఇతిహాసాలా ప్రకారం ఈ అహోబిలం క్షేత్రానికి ఎంతో ప్రత్యేకతలు ఉన్నాయి. మహావిష్ణువు రాక్షసుల రాజైన హిరణ్యకశికుడ్ని సంహరించేందుకు సగం మనిషిగానూ, సగం సింహ రూపంలోనూ అవతరించడంతో ఇది మహిమ గల పుణ్యక్షేత్రమైయిందని భక్తుల నమ్మకం.. అందుకే నిత్యం భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టనానికి సుమారు 30 కిలోమీటర్లు దూరంలో దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతంలో వెలసిన దివ్యమైన క్షేత్రం. చుట్టూ పచ్చదనం ఏతైనా కొండల నడుమ వర్షాకాలంలో జాలువారే జలపాతం అందాలు చూస్తే అక్కడే ఉండిపోవాలనేపించే ప్రకృతి సోయగం.

ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రంగా మరోవైపు పర్యాటక కేంద్రంగా దేదివ్యామమైన అహోబిలంలో సాక్ష్యత్తు శ్రీ మహావిష్ణువు ఉగ్రనరసింహ అవతారంలో వెలసిన క్షేత్రంగా ఇక్కడ స్థల పురాణాలు తెలుపుతున్నాయి. శరణు కోరి వచ్చిన భక్తుల కష్టాలు తీర్చి కోరిన కోర్కెలు తీర్చు భగవంతుడని భక్తుల నమ్మకం. భారతదేశంలో కొలువై ఉన్న నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటైన అహోబిల నరసింహ స్వామి దేవాలయంలో ప్రస్తుతం స్వామి వారికీ వసంతోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి.

10న ఫ్రీ మెడికల్ క్యాంప్.. రూ.5000 విలువైన స్కానింగ్ ఉచితం

సుమారు 5 రోజులపాటు జరిగే ఈ వసంతోత్సవాలలో స్వామివారికి ప్రత్యేకించి తులసి దళాలతో అలంకరించి వేదమంత్రాలు చరణాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే నిన్న స్వామి వారికీ ప్రదోషాకాల సేవ, స్వాతి సుదర్శన హోమము నిర్వహించారు. అంతే కాకుండా వరాహ జయంతి సందర్బంగా అహోబిలం క్షేత్రంలోని వరాహ సన్నిధిలో స్వామి వారికీ సుదర్శన హోమం,తిరుమంజనం కార్యక్రమాలు సంప్రదాయా పరంగా నిర్వహించారు.ఈ ఉత్సవాలను తిలకించెందుకు భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు.

వెంకటేశ్వర స్వామి 12 ఏళ్లు తపస్సు చేశారని మీకు తెలుసా.. ఎందుకంటే..

భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుండటంతో అహోబిలం క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. అహోబిలం క్షేత్రానికి కర్నూలు కేంద్రం నుంచి రోడ్డుమర్గంలో నంద్యాల జిల్లా మీదుగా ఆళ్లగడ్డ పట్టనానికి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. ఈ దూరం 110 కిలోమీటర్లు ఉంటుంది. మళ్ళీ ఆళ్లగడ్డ పట్టణం నుంచి 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న అహోబిలం క్షేత్రానికి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

2024-05-08T08:22:11Z dg43tfdfdgfd