మహిళల ఆరోగ్యానికి ఇవి రక్షణ కవచం.. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు

Women Health: మనకు లభించే వివిధ రకాల మూలికలు, దినుసులు, సుగంధ ద్రవ్యాలతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ వీటి గురించి చాలా మందికి తెలియదు. ముఖ్యంగా అతి పురాతన మూలికగా పేరున్న మెంతులతో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని ఆయుర్వేదం(Ayurveda) చెబుతోంది. ఐరన్(Iron), మెగ్నీషియం(Magnesium), మాంగనీస్‌(Manganese), ఫైబర్(Fiber), విటమిన్లకు ఇవి నిలయం. వీటితో మహిళల పీరియడ్ ప్రాబ్లమ్స్ దూరమై, మెన్‌స్ట్రువల్ హెల్త్ మెరుగుపడుతుంది. PCOS వంటి అనారోగ్యాలకు సైతం మెంతుల్లోని సమ్మేళనాలు చెక్ పెడతాయి. వీటితో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి.

* పీరియడ్స్ పెయిన్స్‌కు చెక్

మహిళలు పీరియడ్స్ సమయంలో శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పొత్తికడుపులో నొప్పి, వికారం, జననాంగాల్లో తిమ్మిరిగా అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. రాత్రిపూట మెంతిగింజలను నానబెట్టి పరగడుపున తాగితే, పీరియడ్స్ సమయంలో ఉండే ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మెంతుల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి.

Arthritis: మహిళలకు కీళ్ల వాతం రిస్క్ ఎక్కువ.. ఎందుకో తెలుసా?

* తల్లిపాలు

బాలింతలు ఆహారంలో మెంతులను చేర్చుకుంటే పాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. దీంతో శిశువులకు సరిపడా పాలు అందుతాయి. ఫలితంగా పిల్లలు బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. మెంతులను డైట్‌లో చేర్చుకుంటే రెండు రెట్లు ఎక్కువ పాల ఉత్పత్తి జరుగుతుంది.

* PCOS

ఇటీవల చాలా మంది మహిళలు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(PCOS) బారిన పడుతున్నారు. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. ఇది క్రమరహిత పీరియడ్స్, బరువు పెరగడం, వంధ్యత్వం వంటి సమస్యలకు దారితీయవచ్చు. NIH రిపోర్ట్ ప్రకారం.. మెంతి క్యాప్సూల్స్ వాడితే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మెంతుల్లోని సమ్మేళనాలు అండాశయం, రుతుక్రమం సమస్యలకు చెక్ పెడతాయి.

* జుట్టు ఆరోగ్యం

ప్రస్తుత బీజీ లైఫ్‌లో మహిళలను జుట్టు సమస్యలు వేధిస్తున్నాయి. జుట్టు రాలటం, కుదుర్లు చిట్లడం, చుండ్రు వంటి సమస్యలు కామన్‌గా వస్తున్నాయి. అయితే పోషకాలు పుష్కలంగా ఉండే మెంతి గింజలు, ఆకులు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. మెంతి ఆకులను పేస్ట్‌గా చేసి తలకు అప్లై చేస్తే, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. వెంట్రుకలు తెల్లబడటం నెమ్మదిస్తుంది.

* మొటిమలు దూరం

రాత్రి పూట మెంతి ఆకుల పేస్ట్‌ను మొటిమలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. మరుసటి రోజు ఉదయం చల్లటి నీటితో కడగాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే మొటిమలు తగ్గుతాయి, కొత్తవి ఏర్పడవు.

* చర్మ ఆరోగ్యం

మెంతుల్లో ఒకరకమైన ఆయిల్ ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్‌గా, మృదువుగా ఉంచుతుంది. మెంతులను పెట్రోలియం ఆధారిత లోషన్స్‌కు సురక్షితమైన, సహజమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. మెంతుల్లో పొటాషియం, కెరోటిన్, విటమిన్ సి వంటి పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మం సహజత్వాన్ని మరింత మెరుగుపరుస్తాయి.

* ఇతర ప్రయోజనాలు

మెంతులు రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రిస్తాయి. షుగర్ పేషెంట్లు ఇవి తింటే ప్రయోజనం ఉంటుంది. మెంతుల్లో ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్‌ను పెంచుతుంది. పరగడుపున మెంతి నీరు తాగితే అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటిలోని ఫైబర్ కంటెంట్ పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

2024-05-03T13:34:28Z dg43tfdfdgfd