మహిళలు, మగవారు, స్టూడెంట్స్‌‌కు డబ్బే డబ్బు.. ఇలా చేస్తే రూ.లక్షల్లో సంపాదన!

ఈ వేసవి కాలం సెలవుల్లో విద్యార్థిని, విద్యార్థులు తమ మేదశక్తిని మెరుగుపరచుకోవడానికి ఆటపాటలను నేర్చుకుంటూంటారు. ఈ సెలవుల్లో కొంతమంది విద్యార్థులు అందరికంటే భిన్నంగా ఆర్ట్స్ నేర్చుకుంటూ ఉంటారు. కొంతమంది విద్యార్థులు చదువుతోపాటు ఆర్ట్స్ లో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేర్చుకొని చిన్న వయసులోనే ఆర్టిస్ట్ గా మారుతున్నారు.

ప్రస్తుతం ఉన్న కాలంలో ఫాబ్రిక్ పెయింటింగ్ ‌ట్రెండింగ్ లో ఉంది. భారతదేశంలోని విద్యార్థినీ విద్యార్థులే కాకుండా మహిళలు, గృహిణులు ఈ ఫాబ్రిక్ పెయింటింగ్ పై దృష్టి పెడుతున్నారు. ఈ ఫాబ్రిక్ పెయింటింగ్ ద్వారా మేదశక్తితో పాటు క్రియేటివిటీ కూడా చాలా పెరుగుతుంది.

మహిళలకు బంపర్ న్యూస్.. ఉచితంగా రూ.2 లక్షలు బెనిఫిట్!

ఇలాంటి అందరికీ ఉపయోగపడే ఫాబ్రిక్ పెయింటింగ్ చిన్న వయసులోనే నేర్చుకుంటే చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఆర్ట్ గ్యాలరీలో బాల కళా వికాస్ ఆర్ట్స్ అండ్ వర్క్ షాప్ పేరుతో మూడు సంవత్సరాల వయసు గల చిన్నపిల్లల నుంచి 18 సంవత్సరాల వయసుగల విద్యార్థులకు ఫాబ్రిక్ పెయింటింగ్ పై అవగాహన వచ్చేలా భారతదేశంలోని గుర్తింపు పొందిన నిర్మల్ పెయింటింగ్ ఆర్టిస్ట్ కేబి ఇందిరా తో ఫాబ్రిక్ పెయింటింగ్ లో ఉన్న ముఖ్యమైన అంశాలు నేర్పించారు. హాజరైన విద్యార్థిని విద్యార్థులు వారికి నచ్చిన ప్రకృతి ఆకారాలు వేసి వాటిపై పెయింటింగ్ వేశారు. అంతేకాకుండా ఫాబ్రిక్ పెయింటింగ్ లో కావాల్సిన టెక్నికులు, అవగాహన కేబి ఇందిరాని అడిగి తెలుసుకున్నారు. ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేయాలంటే ముఖ్యంగా నీరుని ఎలా వాడాలో తెలిసి ఉండాలి. దానితో పాటు ఏ రంగులను కలిపి మరొక రంగును సృష్టించే టెక్నిక్ తెలిసి ఉండాలి.

రైతు బంధు రాని వారి అకౌంట్లలోకి డబ్బులు.. అదిరే శుభవార్త!

ఈ మధ్యకాలంలో ఫాబ్రిక్ పెయింటింగ్ చాలా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఫాబ్రిక్ పెయింటింగ్ ఎక్కువగా మహిళల చీరలపై చూస్తూ ఉంటాం. అన్ని చీరలకంటే ఈ హ్యాండ్ పెయింటింగ్ చీరలు చాలా ఎక్కువ ధరలో ఉంటాయి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మహిళలు హ్యాండ్ పెయింటింగ్ చీరలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా తస్సర్ సిల్క్, కాటన్ లాంటి ఫాబ్రిక్లపై పెయింటింగ్స్ చూస్తూంటాం.

ఎవరైతేపెయింటింగ్స్ వేస్తారో వారు పెయింటింగ్స్ లోని అన్ని టెక్నిక్ లు ఉపయోగించి ఇంటీరియర్ పెయింటింగ్, హోమ్ డెక్కర్, వాల్ పెయింటింగ్, బళ్లారి పెయింటింగ్ లాంటి ఎన్నో పెయింటింగ్ లు నేర్చుకోవచ్చని అంతేకాకుండా హాబీగా పెయింటింగ్స్ వేసి ధనవంతులైన వారు ఎందరో ఉన్నారు. నాకు తెలిసిన ఆర్టిస్టులు వేసిన ఒక్క పెయింటింగ్ ధర రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు ఉంటుందని ప్రత్యక్షంగా లోకల్ 18 ప్రతినిధితో కేవీ ఇందిరా తెలిపారు.

2024-05-02T02:44:00Z dg43tfdfdgfd