Trending:


ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఇన్ని సమస్యలు వస్తాయా..? బీ అలర్ట్

Fresh Fruit Juice: ఈ మండుటెండల్లో ఫ్రూట్ జ్యూస్ తాగితే మంచిదని అందరూ భావిస్తారు. మీరు కూడా అలాగే ఆలోచిస్తే ఒక్కసారి మీ ఆలోచన మార్చుకోండి. ఎందుకంటే వేసవి తీవ్రత తట్టుకోలేక ఫ్రెష్ జ్యూస్ తాగాలని ఫీలయితే మీకే నష్టం. ఎందుకంటే హెల్త్ డ్రింక్ అని మీరు అనుకుంటున్న జ్యూస్ ఈ వేసవిలో మీకు హాని కలిగించవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ తెలుసుకోండి. ఫైబర్ ఉండదు : ఇంట్లో మీరు తాజాగా తయారుచేసిన జ్యూస్‌లో స్టోర్‌లో కొన్న జ్యూస్‌లో ఉన్నంత చక్కెర ఉంటుంది. మొత్తం పండ్లలో అందించే అవసరమైన ఫైబర్ మాత్రం ఉండదు. ఫైబర్ చక్కెరను నెమ్మదిగా శోషించడాన్ని నిర్ధారిస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుందని గుర్తుంచుకోండి. రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణం కావచ్చు: మీరు పండ్ల రసాలను తాగినప్పుడు మీ రక్తంలో షుగర్ లెవెల్స్ వెంటనే పెరుగుతాయి. ఇది మీరు సోడా తాగిన దానికి సమానం. ఇది మీ కేలరీల సంఖ్యను పెంచుతుంది. అంతే కాకుండా మొత్తం పండ్లను తిన్న తర్వాత మీరు పొందే సంపూర్ణత్వ అనుభూతిని ఇది ఇవ్వదు. బరువు పెరగడం: ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల తరచుగా అతిగా తినడం వల్ల బరువు పెరుగుతారు. కాబట్టి రసాల కంటే మొత్తం పండ్లను ఎంచుకోవడం ఎల్లప్పుడూ తెలివైన ఆలోచన. మొత్తం పండ్లలో ఫైబర్ అధికంగా ఉన్నందున ఇది మీకు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పోషకాలు కోల్పోవడం: ఫ్రూట్ జ్యూస్ చేయడం వల్ల విలువైన పోషకాలు పోతాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇక జ్యూస్ పిండుకున్న వెంటనే తాగకపోతే మరిన్ని పోషకాలు నశిస్తాయి. పండ్ల రసాలు ఆమ్లంగా ఉంటాయి: దంతాలు, చిగుళ్ళకు హాని కలిగిస్తాయి. సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీరు పండ్ల రసాలను తరచుగా లేదా ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే అది మీ నోటి ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. సాధారణంగా పండ్లు పోషకాలు: ఫ్రూట్స్ సాధారణ పోషకాలు కానీ వాటిని సరిగ్గా తింటేనే వాటిలో ఉండే పోషకాలు మనకు అందుతాయి. పండ్లను పూర్తిగా కోసిన వెంటనే తినాలి. పండ్లలో వివిధ విటమిన్లు,ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. మనం రోజూ తీసుకునే ఆహారంలో పండ్లను చేర్చుకోవడం ద్వారా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. వేసవి కాలానికి తగ్గట్టుగా ఆహారాన్ని మార్చుకోవడం అవసరం.


Weekly Horoscope : వీరికి మనసులోని కోరికలు నెరవేరుతాయి

Horoscope Today: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. మరి నేడు మే 12 ఆదివారం నుండి మే18 శనివారం వరకు మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేషం (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1)వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలను నిరూపించుకోవడం మీద దృష్టికేంద్రీకరిస్తారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి కార్యకలాపాలుపెరిగిపోతాయి. ఉద్యోగంలో కాస్తంత పని భారం ఉంటుంది. అధికారులను మీపనితీరుతో ఆకట్టుకుంటారు. ఆస్తి వివాదం పరిష్కార దిశగా కొన సాగుతుంది.బంధువుల వల్ల మాట పడాల్సి వస్తుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను, పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, విలాసాల మీద ఖర్చులు పెరిగే అవకాశంఉంది. ఆరోగ్యం నిల కడగా సాగుతుంది. బంధుమిత్రుల వ్యక్తిగత వ్యవహారాల్లోతలదూర్చకపోవడం మంచిది. నిరు ద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. దూరప్రాంతంలో మంచి ఉద్యోగంలో చేరడం జరుగుతుంది. వృషభం(Taurus):(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. వ్యాపారాలుపరవాలేదనిపిస్తాయి. ఆర్థిక వ్యవహా రాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థికలావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రాదనుకున్న డబ్బు చేతికి అందిముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్ర త్తగా ఉండాలి.ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారంలో తొందరపాటు నిర్ణ యాలుతీసుకోవద్దు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి.పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచిశుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలులభిస్తాయి. ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగాసాగిపోతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మిథునం (Gemini): (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలుఅనుకూలంగా మార తాయి. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. ఉద్యోగులకుసమయం చాలా అనుకూలంగా ఉంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారు బాగాబిజీ అయిపోతారు. వ్యాపారాలు నల్లేరు మీది బండిలా సాగిపోతాయి. సొంతనిర్ణయాల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ధనపరంగా కొద్దిగా మోసపోయేసూచనలున్నాయి. ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తే పెండింగు పనులు, వ్యవహారాలుసకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి.బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రయాణాలో వీలైనంతగాజాగ్రత్తగా ఉండడం మంచిది.. కర్కాటకం (Cancer):(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)వారమంతా అనుకూలంగా సాగిపోతుంది. చిన్నా చితకా సమస్యలున్నా అధిగమిస్తారు.ఉద్యో గంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లోనష్టాల నుంచి బయట పడతారు. ముఖ్యమైన కార్యకలాపాలన్నీ నిదానంగాపూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో శుభ వార్త వింటారు. కుటుంబ వ్యవహారాలకుసంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మంచి వ్యక్తులతో పరిచయాలుఏర్పడతాయి. కుటుంబపరంగా ఒత్తిడి నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది.ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. పిల్లలకు సంబంధించి మంచి పరిణామాలు చోటుచేసు కుంటాయి. ప్రస్తుతానికి పెళ్లి ప్రయత్నాలను వాయిదా వేసుకోవడంమంచిది. ప్రయా ణాలు లాభి స్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది.మిత్రుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందు తుంది. సింహం(Leo):(మఖ, పుబ్బ, ఉత్తర 1)ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగంలో స్థిరత్వంలభిస్తుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి ప్రోత్సహిస్తారు.ఆస్తి సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. దైవ కార్యాల్లోపాల్గొంటారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అనుకున్నపనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. స్తోమతకు మించి మిత్రులకు ఆర్థికసహాయం చేస్తారు. అనారోగ్యం సమస్యలు, ఆర్థిక సమస్యలు అదుపులో ఉంటాయి.కుటుంబ వ్యవహారాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికివృత్తి, ఉద్యోగాల్లో గుర్తింపు వస్తుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు.ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు సఫలం అవు తాయి. వ్యక్తిగత వ్యవహారాలలోకార్యసిద్ధి ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కన్య (Virgo):(ఉత్తర 2,3,4. హస్త, చిత్త 1,2)చిన్నా చితకా సమస్యలుండవచ్చు. స్వల్ప అనారోగ్యం కూడా ఉండే అవకాశముంది.అయితే, ఇతర పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి. ఎంత సానుకూల దృక్పథంతోవ్యవహరిస్తే అంత మంచిది. కొన్ని ప్రయత్నాలు ఆలస్యం అయ్యే అవకాశముంది.ఆర్థిక ప్రయత్నాలలో తప్పకుండా విజయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలోసంపాదన పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు గడి స్తారు. దైవ కార్యాల్లోపాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ముఖ్యమైన వ్యవ హారాలునిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగంలభిస్తుంది. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది.తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కాస్తంత ఇబ్బంది కలిగిస్తుంది. ప్రయాణాలులాభిస్తాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. తుల (Libra):(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. కొద్దిపాటి ఆస్తి కలిసి వచ్చేఅవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగులకుఅనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటి వ్యవహారం ఒకటి సానుకూలంగా పరిష్కారంఅవుతుంది. పిల్లలకు చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం విషయంలో శుభ వార్తలుఅందుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ప్రముఖులతో పరిచ యాలుపెరుగుతాయి. కొన్ని వ్యవహారాలు ఆశాజనకంగా పూర్తవుతాయి. శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ప్రస్తుత సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది.ప్రయాణా ల్లోనూ, ఆరోగ్యం విషయంలోనూ వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది.ఆదాయానికి లోటుండదు.. వృశ్చికం(Scorpio):(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)కుటుంబ పరిస్థితులు బాగా సానుకూలంగా ఉంటాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యతపెరుగు తుంది. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ధనపరంగాఆశించిన పురోగతి ఉంటుంది. కొన్ని అనవసర ఖర్చులకు కళ్లెం వేయగలుగుతారు.ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వృత్తి, వ్యాపారాల్లో లాభదాయకమైన వాతా బవరణం ఉంటుంది. ఉద్యోగంలో సహచరులనుంచి సమస్యలు ఎదురవుతాయి. అయితే, అధికారుల మద్దతు ఉంటుంది. అనుకోనిప్రయాణాలకు అవకాశం ఉంది. సొంత నిర్ణయాల వల్ల ఉపయోగం ఉంటుంది. ఆస్తివిషయంలో కొద్దిగా మోసపోయే సూచనలున్నాయి. రాదనుకున్న డబ్బు చేతికిఅందుతుంది. కొద్ది ప్రయత్నంతో మొండి బాకీలు, బకాయిలు వసూలు అవుతాయి. ధనుస్సు(Sagittarius): (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాలలో పెట్టుబడులకు తగ్గప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. దైవ కార్యాలలోపాల్గొంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి నిపుణు లకు ఆదరణపెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక సమస్యల నుంచికూడా చాలా వరకు బయటపడతారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. కొత్తప్రయత్నాలకు, కొత్త నిర్ణయాలకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యో గులకుఉద్యోగపరంగా ముఖ్యమైన సమాచారం అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశంఉంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలువెల్లి విరుస్తాయి. మకరం (Capricorn):(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) వృత్తి, ఉద్యోగాలలో ఒత్తిడి, పనిభారం తగ్గి సామరస్య వాతావరణంనెలకొంటుంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచుతారు. మిత్రులతో అకారణ వివాదాలుతలెత్తే సూచనలున్నాయి. నిరుద్యోగులు శుభ వార్త వింటారు. వివాహ ప్రయత్నాలుఅనుకూలంగా సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి.మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాల్లో కుటుంబసభ్యుల సహాయం అందుతుంది. కొందరు బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది.ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండడం గానీ, వాగ్దానాలు చేయడం కానీచేయకపోవడం శ్రేయస్కరం. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడంఅవసరం. ఒక ముఖ్యమైన వ్యక్తిగత వ్యవహారం ఒకటి అనుకోకుండా అనుకూలంఅవుతుంది. ఆదాయం బాగా పెరుగు తుంది. కుంభం (Aquarius):(ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఆదాయం, ఆరోగ్యం సంతృప్తికరంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుపూర్తవు తాయి. వారమంతా ప్రశాంతంగా, ఆనందంగా గడిచిపోతుంది. ఉద్యోగజీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. సామాజికంగా గౌరవమర్యాదలు పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి జీవితాలవారికిడిమాండ్ పెరుగుతుంది. బంధువుల రాకపోకలుంటాయి. చిన్ననాటి మిత్రులతో విందుకార్యక్రమంలో పాల్గొంటారు. విహార యాత్రకు వెళ్లే సూచనలు న్నాయి. దూరప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వినే అవకాశం ఉంది.ప్రస్తుతానికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వాహన ప్రమాదాల విషయంలోకూడా అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.. మీనం(Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు, చికాకులు తగ్గిపోయి మనశ్శాంతి ఏర్పడుతుంది.కార్యసిద్ధికి, వ్యవహార జయానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్తలుఅందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రముఖులతోపరిచయాలు ఏర్పడతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలకుసమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువుల్లో కొందరుఅపనిందలు వేయడం గానీ, దుష్ప్రచారం చేయడం గానీ జరు గుతుంది. మితిమీరినఔదార్యంతో మిత్రులకు సహాయం చేయడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకుపరవాలేదనిపిస్తుంది. వృథా ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. తండ్రి వైపుబంధు వుల నుంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఆశించినఫలితాలను పొందుతారు. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)


6 Fiber rich foods: మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ 6 ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఉంటే బరువు పెరిగే ఛాన్సే లేదు

6 Fiber rich foods: మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ 6 ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఉంటే బరువు పెరిగే ఛాన్సే లేదు


ఈ పుదీనా ఫేస్‌ప్యాక్స్‌తో మొటిమలు, మచ్చలు దూరమై ముఖం మెరుస్తుంది..

ఎండలు పెరిగిపోయాయి. దీంతో ముఖం వాడిపోయినట్లుగా కనిపిస్తుంది. అలా కాకుండా చర్మం మెరవాలంటే పుదీనాతో ఇలా ఫేస్ ప్యాక్ వేయండి..


యోగాను ఈ వయస్సు వాళ్లు కూడా చేయవచ్చా..? ఇక్కడ ఫ్రీగానే..

యోగ చేయడానికి వయస్సుతో పనిలేదు. మూడేళ్ల వయసు నుంచి తనువు చాలించే వరకు యోగ చేయవచ్చు. యోగ ద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది. బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటివి కూడా తగ్గుతాయని, యోగా గురువు బుచ్చన్న అంటున్నారు. నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ ప్రాంతంలో ఉన్న శ్రీ రామకృష్ణ విద్యానికేతన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఐదవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థుల వరకు యోగాలో శిక్షణ ఇస్తున్నారు. పతాంజలి యోగ గురువు, కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ పదవి విరమణ పొందిన బుచ్చన్న ఫ్రీగా విద్యార్థులకు యోగాలో శిక్షణ ఇస్తున్నారు. 2007 నుంచి యోగ గురువుగా శిక్షణ తీసుకున్నారు. ఆ నాటి నుంచి ఉచితంగానే యోగలో శిక్షణ ఇస్తున్నారు. అయితే యోగ చేయాలంటే మూడేళ్ల వయస్సు నుంచి పండు ముసలి వరకు ఎవరైనా యోగ చేయవచ్చు. యోగ చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది. పిల్లల్లో మరింత జ్ఞాపకశక్తిని పెంచుతుంది. వారిలో క్రమశిక్షణ పెరుగుతుంది. ఎవరితో ఎలా ఉండాలి, పెద్దలను ఎలా గౌరవించాలి. దేశభక్తిపై కూడా గౌరవం పెరుగుతుందని యోగ గురువు బుచ్చన్న చెబుతున్నారు. చిన్నపిల్లలు ఏది చెప్పినా తొందరగా నేర్చుకోగలరు. మొక్కై వంగనిది, మానై వంగుతుందా అన్నట్టుగా చిన్నపిల్లల విషయంలో ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించి.. పిల్లలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వారం రోజుల్లో ఎలాంటి వారైనా యోగ నేర్చుకోవచ్చు. 15 రోజులు శిక్షణ ఇస్తే వారే కంటిన్యూగా యోగ చేసుకోవచ్చు. ఎవరికైనా కంటిన్యూగా ఫ్రీగా శిక్షణ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నాము. ప్రాణయమం చేస్తే మన బాడిలోని అన్ని కణాలను ఆక్సిజన్ ఎక్కువ మొత్తంలో అందుతుంది. దీంతో ఆరోగ్యం కూడా మెరుగవుతుందన్నారు. తాము గత వారం పది రోజులుగా యోగా ఆసనాలు నేర్చుకుంటున్నాము చాలా బాగుందన్నారు. యోగతో మాకు ఏకాగ్రత పెరుగుతుంది. చదువుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ కలుగుతుందని విద్యార్థులు చెప్తున్నారు. కాపాల బాత్, ప్రాణయమం, యోగ ఆసనాలు వేస్తున్నామని తెలిపారు.


ఈరాశి వారికి ఉద్యోగంలో పనితీరుకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది

Horoscope Today: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. మరి నేడు మే 11న శనివారం నాడు, మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు దినఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేషం (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1)వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే అవకాశముంది. ఉద్యోగంలో మంచిగుర్తింపు లభిస్తుంది. కొత్త నైపుణ్యాలు ఉపయోగపడతాయి. ముఖ్యమైనవ్యవహారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకువిజయవంతం అవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. చేపట్టిన పనులుసకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒకటి రెండువ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. శుభ వార్తలు వింటారు.. వృషభం(Taurus):(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) కొన్ని వ్యవహారాలను ధైర్యంగా చక్కబెడతారు. ఆదాయం బాగా పెరిగే అవకాశంఉంది. ముఖ్య మైన పనులు, వ్యవహారాలు సునాయాసంగా పూర్తి అవుతాయి. వృత్తి,ఉద్యోగాల్లో అధికారుల అండదండలు లభిస్తాయి. వ్యాపారాల్లో సొంత నిర్ణయాలుఅమలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యో గావకాశాలు కలిసి వస్తాయి. పెళ్లిప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఉద్యోగం మార డానికి చేసేప్రయత్నాలు సఫలం అవుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. మిథునం (Gemini): (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) రోజంతా ప్రశాంతంగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంతోకలిసి ఇష్ట మైన ఆలయాలను సందర్శిస్తారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు.వ్యక్తిగత సమస్యల ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల సమస్యబాగా తగ్గుతుంది. ఆస్తి వివాదం పెద్దల జోక్యంతో పరిష్కారమవుతుంది.వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలుపాటించడం మంచిది. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. కర్కాటకం (Cancer):(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ముఖ్యంగా ఎవరితోనూవాదోపవాదా లకు దిగవద్దు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ఆదరణలభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. మిత్రులతోవిందులు, వినోదాల్లో పాల్గొంటారు. అను కున్న పనులు అనుకున్నట్టుపూర్తవుతాయి. చిన్న చిన్న సమస్యలకు ఆందోళన చెందక పోవడం మంచిది. ఇంటా బయటాకొద్దిగా ఒత్తిడి ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. సింహం(Leo):(మఖ, పుబ్బ, ఉత్తర 1)ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. బాగా ఇష్టమైన మిత్రులను, బంధువులనుకలుసుకుం టారు. ఒక శుభకార్య‍ంలో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి కలిగినవ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రతిభా పాటవాలకు ప్రత్యేకమైన గుర్తింపులభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారు లను, సహోద్యోగులను పని తీరుతోఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలుచేస్తారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానేఉంటుంది.. కన్య (Virgo):(ఉత్తర 2,3,4. హస్త, చిత్త 1,2)రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. కొందరుమిత్రులు అండగా నిలబడతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు.ఆరోగ్యం చాలావరకు కుదుట పడుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడతాయి.ఉద్యోగంలో మీ పనితీరుకు అధి కారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్తివివాదాల్లో పెద్దల నుంచి సహాయం లభిస్తుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడిఉండే అవకాశం ఉంది. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. తుల (Libra):(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)వృత్తి, ఉద్యోగాలలో మీ మాటకు, చేతకు తిరుగుండదు. వ్యాపారాలు ఆశాజనకంగా,ఉత్సాహంగా సాగిపోతాయి. కొన్ని పాత రుణాలు వసూలు అవుతాయి. బంధువుల నుంచిరావాల్సిన డబ్బు కూడా అందుతుంది. ఆర్థిక ప్రయత్నాల వల్ల మానసిక ఒత్తిడికిగురవుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. మంచి పరిచయాలుఏర్పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి. కుటుంబజీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. వృశ్చికం(Scorpio):(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అలవికాని లక్ష్యాలతో ఇబ్బందిపడతారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన అవసరాలుతీరిపోతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.బంధుమిత్రుల సహాయంతో ప్రధానమైన పనులు పూర్తవు తాయి. సొంత ఆలోచనలు కలిసివస్తాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందు తుంది. వృత్తి,వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.. ధనుస్సు(Sagittarius): (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాలతో పాటువ్యాపారాలు కూడా లాభసాటిగా, ప్రోత్సాహకరంగా పురోగతి చెందుతాయి. కొన్నిఆర్థిక వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని బాగా లాభపడతారు.వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన ప్రయత్నా లకు సానుకూలంగా ముందుకుసాగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అనుకున్న వ్యవహారాలుఅనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.. మకరం (Capricorn):(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. పొదుపు అలవాటు చేసుకోవడం మంచిది.మితిమీరిన ఔదార్యంతో మిత్రులకు సహాయం చేసే అవకాశం ఉంది. వృత్తి జీవితంలోబిజీ అయ్యే అవకాశం ఉంది. రాబడికి, లాభాలకు లోటుండదు. వ్యాపారాల్లో కొత్తఆలోచనలు అమలు చేసి, ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారుల నుంచిఆదరణ ఉంటుంది. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి శుభవార్తలువింటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.. కుంభం (Aquarius):(ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) స్తోమతకు మించి ఇతరులకు సహాయపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులుఎక్కువగా ఆధారపడతారు. అధికారులు మీ సలహాలతో ప్రయోజనాలు పొందుతారు.ముఖ్యమైన శుభ వార్తలు అందుతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది.విలువైన కానుకలు లభిస్తాయి. నిరు ద్యోగులకు ఆశించిన స్థాయిలోఉద్యోగావకాశాలు అందివస్తాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు.. మీనం(Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. పిల్లలకు సంబంధించిన సమాచారం ఒకటి ఆనందంకలి గిస్తుంది. చాలా పనులు సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితిబాగా అనుకూలంగా ఉంటుంది. ఒకరిద్దరు మిత్రులకు సహాయం చేస్తారు. దైవకార్యాల మీద ఖర్చు ఎక్కువవుతుంది. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి.పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో మీ మాటకు తిరుగుండదు.. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)


Groom:పెళ్లి కూతురుని చూసి ముచ్చటపడ్డ వరుడు.. చివరికి డాక్టర్ చెప్పింది విని షాక్

గతంలో ఆడ-మగ మధ్యే పెళ్లిళ్లు జరిగేవి. కాని ఈ జనరేషన్ లో మగ-ఆడతో పాటు ఆడ-ఆడ, మగ-మగ మధ్య వివాహాలు జరుగుతున్నాయి. దీనికి కొంతమంది లింగమార్పిడి తర్వాత పెళ్లి చేసుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇలాంటివి ఏకంగా కుటుంబ సభ్యుల సమక్షంలో బహిరంగంగానే ఇలాంటి వివాహాలు జరుగుతున్నాయి. (File Photo) పెళ్లి అనేది రెండు మనసుల కలయిక. పెళ్లి చేసుకునే జంటల మధ్య రహస్యాలు ఉండకూడదని అంటారు. అయినా కూడా కొంతమంది పెళ్లికి ముందు కొన్ని సీక్రెట్స్ దాచి పెడుతుంటారు. అయితే పెళ్లి తర్వాత అన్ని రహస్యాలు జీవిత భాగస్వామితో పంచుకోవాలి. (File Photo) 27 ఏళ్ల యువతితో యువకుడి వివాహం నిశ్చయమైంది. ఈ ఘటన చైనాలోని హుంబై ప్రావిన్స్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది. యువతి లి యువాన్ (పేరు మార్చాం) 27 ఏళ్ల నుంచి మహిళగా జీవించింది. అయితే పెళ్లి సమయంలో వైద్యపరీక్షలు చేయించుకోవడంతో యువతి షాక్ కు గురైంది. పెళ్లి పీటలు ఎక్కబోతున్న వరుడు కూడా షాక్ అయ్యాడు. (File Photo) లి యువాన్ ఆమె కాదని వైద్య పరీక్షల్లో తేలింది. లీ యువాన్‌లో వృషణాలు కనుగొనబడ్డాయి. వృషణాలు మగ హార్మోన్లు, స్పెర్మ్‌లను ఉత్పత్తి చేస్తాయి. వృషణాలు కనిపించడంతో వివాహం క్యాన్సిల్ చేసుకున్నారు. (File Photo) ఆడపిల్లగా పెరిగిన లీ యువాన్‌కు 18 ఏళ్లు వచ్చే వరకు రుతుక్రమం కాలేదు. రొమ్ముల పరిమాణం పెరగలేదు. ఆసుపత్రికి వెళ్లినప్పటికి ఆమె అసాధారణ హార్మోన్ స్థాయిలు, అండాశయ వైఫల్యంతో బాధపడుతున్నట్లు డాక్టర్ ఆమెకు చెప్పారని మరియు తదుపరి చికిత్సను సూచించినట్లుగా తెలిపింది. (File Photo) లీ తల్లిదండ్రులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఆ విధంగా లి యువాన్ 27 సంవత్సరాల వయస్సు వరకు స్త్రీగా పెరిగింది. వివాహానికి ముందు గైనకాలజిస్ట్ డువాన్.జి.ఎల్. చెక్ చేయడంతో ఆమె అమ్మాయి కాదు అబ్బాయి అని తెలిసింది. (File Photo) యువాన్ లీ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. వైద్య పరీక్షల తర్వాత నివేదిక కోసం మేము ఒక నెల వేచి ఉన్నాము. లీలో మగ సెక్స్ క్రోమోజోములు కనుగొనబడ్డాయి. గైనకాలజిస్ట్ డువాన్ మాట్లాడుతూ.. లీ స్త్రీలా కనిపిస్తోందని, అయితే ఆమె పురుషుడేనని చెప్పారు. 27 ఏళ్ల నుంచి మహిళగా పెరిగిన లీ.. ఆ నివేదికను చూడగానే ఆందోళన చెందింది. ఆ తర్వాత నిజాన్ని అంగీకరించాడని డాక్టర్‌ చెప్పారు. ప్రతి 50,000 మంది నవజాత శిశువులలో ఒకరు CAHతో బాధపడుతున్నారు. లీ తల్లిదండ్రులిద్దరికీ జన్యుపరమైన సమస్యలు ఉన్నాయి. లీకి కూడా అదే వ్యాధి ఉండే అవకాశం ఉంది. బోలు ఎముకల వ్యాధితో పాటు విటమిన్ డి లోపం నుండి పొత్తికడుపులోని వృషణాలను తొలగించాలని నిపుణులు సూచించారు. ఇది క్యాన్సర్‌గా మారుతుందేమోనన్న భయాన్ని డాక్టర్‌ వ్యక్తం చేశారు. డాక్టర్ సలహా మేరకు ఏప్రిల్ 11న లీకి శస్త్రచికిత్స ద్వారా రెండు వృషణాలను తొలగించారు.


మనసును ఉల్లాసంగా ఉంచే ఆహారాలు!

మనం నిత్యం అనందంగా ఉండేందుకు సహాయపడే ఆహారాల గురించి ఇక్కడ వివరించాం. ఈ ఫుడ్స్‌ తింటే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.


Astrology: మేషరాశిలోకి కుజుడు ప్రవేశం.. 38 ఏళ్ల తర్వాత వీరికి రాజయోగం..

జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం, గ్రహాల అధిపతి అయిన అంగారకుడు జూన్ 1న తన సొంత రాశి అయిన మేషరాశిలో సంచరించబోతున్నాడు. మధ్యాహ్నం 3:39 గంటలకు కుజుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. (ప్రతీకాత్మక చిత్రం) దీని తర్వాత జూలై 1 వరకు కుజుడు మేషరాశిలో ఉంటాడు. మేషరాశిలో ఉండడం వల్ల 4 రాశుల వారికి రాజయోగం కలుగుతుంది. వారికి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీనితో, ఈ రాశుల వారు విజయాన్ని.. చాలా డబ్బును సాధిస్తారు. ఈ పరిణామం దాదాపు 38 ఏళ్ల తర్వాత జరుగుతంది. (ప్రతీకాత్మక చిత్రం) మేష రాశి వారికి రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. వృత్తికి అనుకూలమైన సమయం, అభివృద్ధి కనిపిస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తి చేసి విజయం సాధిస్తారు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలు పొందవచ్చు. పెట్టుబడులు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక పరిస్థితిలో కూడా మెరుగుదల ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) కర్కాటక రాశి వారికి మార్స్ ట్రాన్సిట్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించవచ్చు. అదే సమయంలో.. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కొన్ని శుభవార్తలు అందుతాయి. (ప్రతీకాత్మక చిత్రం) ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. మీ డబ్బు ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే, మీరు దానిని కూడా తిరిగి పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం) మేషరాశిలో అంగారక సంచారం సింహ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. కెరీర్‌లో ఊపు ఉంటుంది. నిలిచిపోయిన అనేక పనులు పూర్తి కాగలవు. కార్యాలయంలో పురోగతికి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతితోపాటు జీతాలు పెరుగుతాయి. వ్యాపారుల వ్యాపారంలో విస్తరణ ఉండవచ్చు. డబ్బు సంపాదించడానికి కొత్త వనరులు కూడా సృష్టించబడతాయి. (ప్రతీకాత్మక చిత్రం) ధనుస్సు రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. కెరీర్ పరంగా చూస్తే సమయం బాగానే ఉంటుంది. కార్యాలయంలో మీ పని ప్రశంసించబడవచ్చు. మీరు సీనియర్ల నుండి పూర్తి మద్దతు పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం) ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కుటుంబ జీవితంలో మాధుర్యం ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారు భాగస్వామిని కనుగొనవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)


నేచర్ లవర్స్ తప్పక చూడాల్సిన ప్రదేశాలు!

ప్రకృతి అందాలను ఇష్టపడే వారికి ఇండియాలో కొన్ని డెస్టినేషన్స్ తప్పక నచ్చుతాయి. అవేంటో తెలుసుకుందాం.


Saturn Vakri: జూన్ 29న శని తిరోగమనం.. ఈ 3 రాశులవారికి ధనమే.. ధనం..

Saturn Vakri Horoscope In Telugu: జూన్ 29న శని కుంభరాశిలో తిరోగమనం చేయడం వల్ల కుంభ రాశితో పాటు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. అలాగే ఈ కింది రాశులవారు విపరీతమైన ధన లాభాలు కూడా పొందుతారు.


Hair Care Tips: వేసవిలో విపరీతంగా జుట్టు రాలుతోందా? నిపుణులు సూచించిన చిట్కాలు ఇవే

summer hair care tips: వేసవి కాలంలో వాతావరణ ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా చాలామందిలో చర్మ సమస్యలతో పాటు జుట్టు సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొందరి లోనైతే జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ఈ చిట్కాలు వినియోగించండి.


Combination Foods: కాఫీ తాగుతూ ఇవి అస్సలు తినకండి.. తింటే మీ ఆరోగ్యం మటాష్!

కాఫీ ఒక బెస్ట్ రీఫ్రెష్ డ్రింక్. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది, మెదడును చురుకుగా ఉంచుతుంది. కాఫీ తాగడం వల్ల మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. దీంట్లో ఉండే కెఫిన్, ఇతర సమ్మేళనాలు డిప్రెషన్‌కు చెక్ పెడతాయి. అందుకే చాలామంది రోజూ ఈ హాట్ డ్రింక్ తాగుతారు. అయితే కాఫీ తాగుతూ కాంబినేషన్‌గా బిస్కట్లు, బ్రెడ్, స్నాక్స్ వంటివి తినడం చాలామందికి అలవాటు. ఈ కాంబినేషన్ వెరైటీ టేస్ట్‌ ఇస్తుంది. అయితే కాఫీ తాగేటప్పుడు కొన్ని రకాల ఫుడ్స్‌ను కాంబినేషన్‌గా తినకూడదు. వీటివల్ల కాఫీ రుచి మారవచ్చు, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఆ పదార్థాలు ఏవో చూద్దాం. సిట్రస్‌ ఫ్రూట్స్నారింజ, ద్రాక్ష, బత్తాయి, జామ వంటి సిట్రస్ జాతి పండ్లలో సిట్రిక్ యాసిడ్ కంటెంట్ ఉంటుంది. కాఫీ తాగేటప్పుడు ఈ పండ్లను తినకూడదు. ఎందుకంటే వీటిలోని సిట్రిక్ యాసిడ్, కాఫీలోని కెఫిన్‌తో రియాక్షన్ జరుపుతుంది. ఫలితంగా వివిధ రకాల జీర్ణ సమస్యలు రావచ్చు. కొందరికి పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది. పనీర్చాలామంది కాఫీ తాగుతూ పనీర్‌తో చేసిన స్నాక్స్ తింటారు. అయితే ఇది కూడా సరైన కాంబినేషన్ కాదు. ఎందుకంటే పనీర్‌‌లో కాల్షియం ఉంటుంది. కాఫీలోని కెఫిన్, శరీరం కాల్షియంను గ్రహించే సామర్థ్యాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. అందుకే ఈ కాంబినేషన్ సెట్ కాదు, ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఫ్రైడ్ స్నాక్స్కరకరలాడే ఫ్రైడ్ స్నాక్స్‌ను కాఫీ తాగుతూ తింటే రుచి మారే అవకాశం ఉంది. పైగా వీటితో కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. సాధారణంగా చాలామంది కాఫీ తాగుతూ పకోడీలు, కారపూస వంటి పప్పు దినుసులతో చేసిన చిరుతిళ్లను తింటారు. ఇది సరైన కాంబినేషన్ కాదు. ఎందుకంటే కాఫీ, ఫ్రైడ్‌స్నాక్స్ కాంబినేషన్ జీర్ణ సమస్యల తీవ్రతను మరింత పెంచుతుంది. పోషకాల శోషణ తగ్గుతుంది. ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వల్ల శరీరంలోని హానికరమైన కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. కాఫీ తాగుతూ మిరపకాయ బజ్జీలు కూడా తినకూడదు. ఈ ఫుడ్ కాంబినేషన్‌ పొట్టలో ఎసిడిటీ, చిరాకు కలిగిస్తుంది. పాలు, పాల ఉత్పత్తులుకాఫీ, డెయిరీ ప్రొడక్ట్స్‌ను కాంబినేషన్‌గా అసలు తీసుకోకూడదు. ఎందుకంటే జున్ను, క్రీమ్, పాలు వంటి డెయిరీ ప్రొడక్ట్స్ తింటూ కాఫీ తాగినప్పుడు.. శరీరం ఐరన్‌ను శోషించే సామర్థ్యం తగ్గుతుంది. అందుకే ఈ కాంబినేషన్‌ మంచిది కాదు. అంతేకాకుండా కాఫీ తాగేటప్పుడు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే బీన్స్, పప్పు ధాన్యాలు, ఆకుకూరలతో చేసిన ఆహారాలు కూడా తినకూడదు. స్పైసీ ఫుడ్స్స్పైసీ ఫుడ్స్, స్నాక్స్ రుచికరంగా, ఘాటుగా ఉంటాయి. అందుకే వీటిని చాలా మంది ఆస్వాదిస్తారు. అయితే కాఫీ తాగుతూ కాంబినేషన్‌గా స్పైసీ ఫుడ్స్ తినకపోవడం మంచిది. ఎందుకంటే ఈ రెండిటి కాంబినేషన్ పొట్ట ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. డైజేషన్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. (Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)


మీరు పుట్టిన తేదీ ప్రకారం మీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా..?

న్యూమరాలజీ ప్రకారం... ఏ తేదీలో పుట్టిన వారికి ఎలాంటి అలవాట్లుు ఉంటే.... వారి జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటారో కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మనం ఎలా ఉన్నాం అనేది మనకు ఉన్న అలవాట్లే నిర్ణయిస్తాయి. మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నవారు.. ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటారు. అదే.. చెడు అలవాట్లు ఉన్నవారికి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. అదేవిధంగా న్యూమరాలజీ ప్రకారం... ఏ తేదీలో పుట్టిన వారికి ఎలాంటి అలవాట్లుు ఉంటే.... వారి జీవితంలో...


Curd: పెరుగుతో ఈ 5 పదార్థాలు పొరపాటున కూడా ఎప్పుడూ తినకండి.. !

వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చాలా మంది పెరుగు తినడానికి ఇష్టపడతారు. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పెరుగులో సోడియం, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ , విటమిన్ డి వంటి అనేక పోషకాలు ఉన్నాయి. వేసవిలో, ప్రజలు తరచుగా పెరుగును ఆహారంతో లేదా అల్పాహారంగా పరాటాతో తింటారు, కానీ మీరు కొన్ని వస్తువులతో పెరుగు తినకూడదు, లేకుంటే అది మీ ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది.వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చాలా మంది...


వీటిని తింటే మీ జుట్టు ఎంత పొడుగ్గా పెరుగుతుందో..!

జుట్టు పొడుగ్గా ఉండాలన్న కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ చాలా మందికి జుట్టు చిన్నగానే ఉంటుంది. జుట్టు పెరగడానికని ఎన్నో చిట్కాలను పాటిస్తుంటారు. అయితే కొన్ని ఫుడ్స్ ను తింటే జుట్టు మీరు కోరుకున్నట్టు చాలా పొడుగ్గా పెరుగుతుంది. అవేంటంటే? జుట్టు పెరుగుదలకు ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషకం. ఇది జుట్టును ఒత్తుగా, పొడుగ్గా చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, జుట్టు పొడుగ్గా ఉండటానికి ప్రోటీన్ బాగా సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడే కొన్ని...


బాదం పప్పును పొట్టుతో సహా తింటే ప్రమాదమా..ఏమవుతుందో తెలుసా?

బాదం పప్పును పొట్టుతో సహా తింటే ప్రమాదమా..ఏమవుతుందో తెలుసా? ఆరోగ్యంగా ఉండాలన్నా..రోజంతా యాక్టివ్ గా ఉండాలన్నా..పిల్లలు,పెద్దలు రోజువారీ ఆహారంలో బాదంపప్పులు, డ్రై ఫ్రూట్స్ తినాలని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే  డాకర్లు సూచించారు కదా అని ఎలా పడితే అలా వీటిని వినియోగిస్తే కొన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశం కూడా ఉందంటున్నారు. బాదంపప్పును ఎలా తినాలి.. బ...


బలమైన ఎముకల కోసం సింపుల్ చిట్కాలు!

బలమైన ఎముకల కోసం సింపుల్ చిట్కాలు!


Vankaya Pachadi: వంకాయ పచ్చడి రెసిపీ ఇదిగో, ఒక్కసారి తిన్నారంటే మరిచిపోలేరు

Vankaya Pachadi: తెలుగువారికి పచ్చళ్ళపై ప్రీతి ఎక్కువ. ఎప్పుడూ ఒకేలాంటి పచ్చళ్ళు కాకుండా కొత్త కాంబినేషన్లు ప్రయత్నించండి. వంకాయ నువ్వుల పచ్చడి రెసిపీ ఇక్కడ ఇచ్చాము.


సమ్మర్‌లో కాఫీ మానేసి ఈ సూపర్ డ్రింక్స్ తాగండి.. మీ శరీరంలో జరిగే అద్భుత మార్పులివే!

ఉదయం నిద్ర లేవగానే చాలామంది వేడివేడి టీ, కాఫీ తాగుతారు. ఈ హాట్ డ్రింక్స్‌ బాడీ, మైండ్‌ను రీఫ్రెష్ చేస్తాయి. అయితే వీటిలో ఉండే కెఫిన్ కంటెంట్ ఆరోగ్యానికి మంచిది కాదు. కాఫీలో ఇది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. నిజానికి ఈ డ్రింక్స్ పరిమితంగా తాగితే, కెఫిన్ కారణంగా మెదడు చురుగ్గా ఉంటుంది. అయితే ఎక్కువ సార్లు తాగితే మాత్రం ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. వేసవిలో కాఫీ ఎక్కువగా తాగితే వేడి చేస్తుంది. ఇందులో ఉండే కెఫిన్ జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. ఒత్తిడి, ఆందోళనను పెంచి నరాల పటుత్వాన్ని తగ్గిస్తుంది. అందుకే ఈ సీజన్‌లో కాఫీకి బదులుగా కొన్ని హెల్తీ డ్రింక్స్ తాగడం మంచిది. అవేంటో తెలుసుకోండి. గ్రీన్ టీఇటీవల కాలంలో గ్రీన్ టీ హెల్తీ డ్రింక్‌గా పాపులర్ అయింది. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉండటమే అందుకు కారణం. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి. మొక్కల సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్స్‌ ఉండటం వల్ల దీనికి హెల్తీ డ్రింక్‌‌గా గుర్తింపు వచ్చింది. వేసవిలో కాఫీకి బదులుగా గ్రీన్ టీ తాగితే సమ్మర్ హెల్త్ ప్రాబ్లమ్స్ రిస్క్ తగ్గుతుంది, శరీరానికి కావాల్సిన విటమిన్స్, పోషకాలు అందుతాయి. కొబ్బరి నీళ్లువేసవిలో బెస్ట్ ఎనర్జిటిక్, హైడ్రేటింగ్ డ్రింక్స్‌లో కొబ్బరి నీళ్లు ముఖ్యమైనవి. ఈ సీజన్‌లో కాఫీ బదులుగా ఇవి తాగడం మంచిది. కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వేసవి తాపానికి కోల్పోయిన పోషకాలు, శక్తిని భర్తీ చేస్తూ బాడీని రీఫ్రెష్‌ చేస్తాయి. కొబ్బరి నీళ్లలో కేలరీలు, కొవ్వులు, కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉంటాయి. దీంతో బరువు తగ్గే ప్రయోజనాలతో పాటు, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ డ్రింక్ వేసవిలో డీహైడ్రేషన్ ముప్పును తగ్గిస్తుంది. తేనె, దాల్చిన చెక్క నీరుతేనె, దాల్చిన‌ చెక్కలో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ రెండూ కలిపి చేసిన డ్రింక్‌ను కాఫీకి బదులుగా తీసుకోవచ్చు. దాల్చిన చెక్క పొడి, తేనె, నీరు కలిపి చేసే ఈ డ్రింక్‌తో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీంట్లో యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతూ, సీజనల్ వ్యాధుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీంతో మొత్తం శ్రేయస్సు మెరుగుపడుతుంది. బీట్‌రూట్ జ్యూస్బీట్‌రూట్‌లో విటమిన్ B9, ఫోలేట్, ఫైబర్, ఐరన్, యాంటీఆక్సిడెంట్స్ వంటి పోషకాలు లభిస్తాయి. శరీర కణాల అభివృద్ధి, పనితీరును ప్రోత్సహించడంలో ఫోలేట్ కీలకంగా పనిచేస్తుంది. అలాగే రక్తనాళాల క్షీణతను నిరోధిస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిలో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ తయారీకి సహాయం చేస్తాయి. అందుకే బోలెడు ప్రయోజనాలను అందించే బీట్‌రూట్ జ్యూస్‌ను కాఫీకి ప్రత్యామ్నాయంగా ఉదయం తాగవచ్చు. నిమ్మరసంవేసవిలో కాఫీకి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవాల్సిన మరో హెల్తీ డ్రింక్ నిమ్మరసం. ఇది బాడీ హీట్‌ను తగ్గించి, శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్‌ తగ్గిస్తుంది. షుగర్ పేషెంట్లు ఈ సీజన్‌లో రోజూ నిమ్మరసం తాగితే ప్రయోజనం ఉంటుంది. బరువును నియంత్రించడంలో కీలకంగా పనిచేసే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు దీంట్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తాయి. యాంటీఆక్సిడెంట్స్ శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. (Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)


ఈ కారణాలతో మాత్రం పిల్లలను కనకండి..!

మీరు కోరుకున్నప్పుడు కాకుండా.. ఇతరుల కోసం పిల్లలను కనడం మంచిది కాదు. వాళ్లు పెంచుతారని కాదు.. మీకు కావాలి అనిపించినప్పుడు పిల్లలను కనడమే మంచిది. పెళ్లి తర్వాత దాదాపు చాలా మంది దంపతులు... తల్లిదండ్రులు కావాలని అనుకుంటారు. కొందరు పెళ్లైన వెంటనే పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటారు. కొందరు.. కాస్త గ్యాప్ తీసుకుంటారు. అయితే... పిల్లలను ఎందుకు కనాలని అనుకుంటున్నారనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? చాలా మందికి పిల్లలు ఎందుకు అంటే.. చాలా కారణాలు ఉండి...


Gulab Jamun: నోరూరించే గులాబ్ జామున్ తయారీ విధానం..!

Gulab Jamun Recipe: గులాబ్ జామున్ ఒక ప్రసిద్ధ భారతీయ స్వీటు, ఇది పాల పొడి, మైదా పిండి కొన్నిసార్లు ఖోవాతో తయారవుతుంది. అయితే దీని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.


బంగారం కొన్న వారికి డబ్బుల వర్షం..

భారతదేశంలో అతి ముఖ్యమైన అక్షయ తృతీయ పండుగను 2024 మే 10న, అంటే ఈ రోజు జరుపుకుంటున్నారు. ఈ శుభదినం సందర్భంగా పెట్టుబడులు పెడితే మంచిదని, ముఖ్యంగా బంగారం కొంటే కలిసొస్తుందని చాలా మంది నమ్ముతారు. నిజానికి గత పదేళ్లలో అక్షయ తృతీయ నాడు కొన్న బంగారంపై 19 శాతం వార్షిక రాబడి అందినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఈ ఏడాది కూడా పండుగ నాడు కొన్న బంగారంపై మంచి ఆదాయం వస్తుందా, లేదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.ప్రస్తుతం 999 ప్యూరిటీ 10 గ్రాముల గోల్డ్‌ ధర...


మిమ్మల్ని మీరు ఆకర్షణీయంగా మార్చుకోండిలా!

ఎదుటి వ్యక్తిని సులభంగా అకర్షించేందుకు ఉపయోగపడే సింపుల్ టిప్స్‌ గురించి ఇక్కడ వివరిస్తున్నాం. ఈ టిప్స్‌ ఫాలో అయితే వ్యక్తితత్వం దృఢంగా మారుతుంది.


150 ఏళ్ల నాటి శనీశ్వరుని ఆలయం.. ఇక్కడ స్వామిని పూజిస్తే మనసులోని కోరిక తీరుతుంది..!

ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని తరంగ్ క్రాసింగ్‌లో 150 సంవత్సరాల పురాతన శనీశ్వరుని దేవాలయంఉంది.. బ్రిటీష్ కాలం నుంచి ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నిత్యం వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ శని భగవానుడి విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది. దూరం నుంచి స్వామిని చూసినప్పుడు సరళంగా కనిపిస్తుంది. కానీ స్వామిని దగ్గర నుంచి చూసినప్పుడు కోపంగా ఉన్నట్లు కనిపిస్తుంది. స్వామి కటాక్షం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. శనీశ్వరునికి తాను 20 సంవత్సరాలుగా నిత్యం పూజిస్తున్నానని స్థానికంగా ఉండే ఓ భక్తుడు తెలిపాడు. దీని కారణంగా తన కోరికలు నెరవేరాయిన తెలిపాడు. అనంతరం తన కుటుంబంతో సహా ఇక్కడికి రావడం ప్రారంభించినట్లు వివరించాడు. ఇది తన ఒక్కరి విషయంలోనే జరగలేదని ఇక్కడికి వచ్చే అందరు భక్తులు ఇదే చెపుతారని ఆయన తెలిపారు. నగరంలో ఇంత పురాతనమైన ఆలయం ఇదొక్కటేనని ఆలయాన్ని సందర్శించిన ఆర్పీ సింగ్ చెబుతున్నారు. అలాగే శనివారాల్లో ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తారని పేర్కొన్నారు. మిగిలిన రోజుల్లో కూడా, వారి కష్టాలు మరియు వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి ఇక్కడ పూజలు మరియు ఆచారాలు నిర్వహిస్తారన్నారు. స్వామిని దర్శించుకొని పూజలు చేసిన భక్తుల కోరికలు నెరవేరుతాయని.. ఆలయ సంరక్షకుడు మరియు అధిపతి ఆర్‌పి సింగ్ తెలిపారు. ఈ నమ్మకం తరతరాల నుంచి వస్తుంది. తమ తరువాతి తరాలకు కూడా పూర్వీకుల ద్వారా వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. అందుకే నిత్యం ఆలయానకి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారని ఆయన పేర్కొన్నారు.


ఇండియాలో బ్యాన్ చేసిన ఆహారాలు ఇవిగో!

కొన్ని కారణాల వల్ల ఇండియాలో కొన్ని ఆహారాలను బ్యాన్ చేశారు. అవేంటో తెలుసుకుందాం.


Saree Cancer: ‘చీర క్యాన్సర్’ గురించి విన్నారా? ఇది ఎవరికి వస్తుందో చెబుతున్న వైద్యులు

Saree Cancer: చీర క్యాన్సర్ వినడానికి వింతగా ఉండవచ్చు. కానీ దీని బారిన పడుతున్న వ్యక్తులు ఉన్నారు. దీన్నే ధోతీ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. చీర వల్ల క్యాన్సర్ ఎలా వస్తుందో తెలుసుకోండి.


జీన్స్ కు అంటిని మొండి మరకలను ఎలా పోగొట్టాలి?

అబ్బాయిలు, అమ్మాయిలు అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జీన్స్ ప్యాంట్ లను ఉపయోగిస్తున్నారు. కానీ జీన్స్ ప్యాంట్ లను మెయింటైన్ చేయడం కాస్త కష్టమైన పనే. ఎందుకంటే వీటికి ఏవైనా మరకలు అంటినప్పుడు అంత సులువుగా పోవు. కానీ కొన్ని చిట్కాలతో జీన్స్ ప్యాంట్ కు అంటుకున్న మరకలను చాలా ఈజీగా పోగొట్టొచ్చు. ఎలాగంటే? జీన్స్ వేసుకోవాలనే క్రేజ్ ఈ రోజుల్లో ప్రతి మహిళలో ఉంది. స్కూల్ నుంచి కాలేజీకి అమ్మాయిలు, ఆఫీసుకు వెళ్లి పనులు చేసే అన్ని వయసుల మహిళలు కూడా జీన్స్ ను...


అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!

అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..! అక్షయ తృతీయ రోజున ( మే 10)  బంగారాన్ని కొనడం చాలా శుభప్రదం. అయితే బంగారంతో పాటు మరికొన్ని శుభప్రదమైన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. అక్షయ తృతీయ రోజున కొనే ఇతర వస్తువులు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హిందూ సంప్రదాయంలో అతి ముఖ్యమైన పండుగల్లో అక్షయ తృతీయ ఒకటి. ఏటా వైశాఖ మా...


పళ్లు తోమేటప్పుడు వాంతులు ఎందుకు అవుతాయి?

మనం ప్రతిరోజూ పళ్లను తోముతాం. అయితే కొంతమందికి మాత్రం పళ్లు తోమేటప్పుడు వాంతులు అవుతుంటాయి. దీనికి కారణమేంటో తెలుసా? మన దినచర్యలో పళ్లను తోముకోవడం ఒక భాగం. పళ్లను తోముకోవడం వల్ల నోట్లో ఉండే చెడు బ్యాక్టీరియా అంతా బయటకు పోతుంది. దంతాలు, నోరు క్లీన్ అవుతాయి. అయితే కొంతమందికి ప్రతిరోజూ ఉదయం పళ్లు తోముతున్నప్పుడు వికారంగా అనిపించడం, వాంతులు అవడం వంటి సమస్యలు వస్తుంటాయి. అసలు ఇలా ఎందుకు అవుతుందో ఇప్పుడు చూసేద్దాం పదండి. పిత్తం సమస్య పళ్లో తోమేటప్పుడు...


ఇంట్లోని ఈ పదార్థాలతోనే రాగి పాత్రల్ని చక్కగా మెరిపించండి..

రాగి పాత్రలని ఇంట్లో వాడడం చాలా మంచిదని చెబుతున్నారు. మరి వీటిని ఎప్పుడు కొత్తవాటిలా మెరిచేలా చేయాలంటే ఎలా క్లీన్ చేయాలో తెలుసుకోండి.


How To Check Gold Purity : బంగారం కొంటున్నారా? ఈ 5 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి..

అక్షయ తృతీయ నాడు బంగారం కొనేందుకు చాలా మంది ఇష్టపడుతారు. ఈరోజు పసిడి కొనుగోలు చేస్తే కలిసొస్తుందని నమ్ముతారు. అందుకే బంగారం దుకాణాల్లో సందడి వాతావరణం ఉంటుంది. అయితే పసిడి కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి.


Zodiac Signs: ఈ రాశుల వారికి దేవుని అనుగ్రహం.. వీరు చాలా గొప్పవారు అవుతారు!

జ్యోతిష్యం జీవితంలో మనిషి వృద్ధి, మనోవికాసానికి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తుంది. రాశుల స్థితిగతులపై విలువైన సమాచారం అందిస్తుంది. జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాశుల వారికి దేవుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా వీరు చాలా గొప్పవారు అవుతారు. అందరి ఆశీర్వాదంతో ఓ శక్తిగా ఎదుగుతారు. సమాజంపై తమదైన ముద్ర వేస్తారు. నాయకత్వ లక్షణాలతో సమాజాన్ని ముందుండి నడిపిస్తారు. సవాళ్లను దీటుగా ఎదుర్కొంటారు. సృజనాత్మకతతో పరిష్కార మార్గాలను కనుగొంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్న రాశులు ఏవో చూద్దాం. మీనంమీనరాశి వారికి అంతర్ దృష్టి ప్రత్యేకతను తీసుకొస్తుంది. ఆధ్యాత్మిక పరంగా బలమైన బంధాన్ని ఇస్తుంది. ఈ రాశివారు దేవతల ఆశీర్వాదం పొందుతారు. అద్భుతమైన సృజనాత్మకతతో అందరినీ ఆకట్టుకుంటారు. వారిలో ప్రేరణ కలిగిస్తారు. వారు చేసే పనులు కళాత్మకంగా ఉంటాయి. ఇతరుల పట్ల సానుభూతి చూపుతారు. ఇతరుల కష్టాలను చూసి చలించిపోతారు. వారి బాగు కోసం తపిస్తారు. వృషభంఆనందం, అందం, ప్రేమ వంటి విషయాలకు ప్రసిద్ధి చెందిన శుక్రుడు వృషభరాశి అధిపతి. ఈ లక్షణాలు ఈ రాశివారిలో పుష్కలంగా ఉంటాయి. అందుకే జీవితంలో ప్రతి చిన్న ఆనందాన్ని బాగా ఆస్వాదిస్తారు. వీరు ఇతరుల ప్రశంసలను అందుకుంటారు. ఆర్థిక వృద్ధి, దృఢమైన, శాశ్వతమైన సంబంధాలు, శ్రేయస్సు కోసం కృషి చేస్తారు. దైవ బలంతో అందరి ఆశీర్వాదం పొందుతారు, ప్రేమానురాగాలు పంచుతారు. ఇతరుల ఆనందంగా జీవించడానికి మార్గనిర్దేశం చేస్తారు. ధనుస్సుసౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహమైన బృహస్పతి, ధనుస్సు రాశిని పాలిస్తుంది. దీని ఫలితంగా ఈ రాశివారికి విస్తృతంగా ఆలోచించడం, లోతైన అవగాహన, జీవితంపై అంతులేని ఆశ ఉంటుంది. వీరు స్వేచ్ఛగా, ఉత్సాహంతో ప్రతి విషయాన్ని నేర్చుకుంటారు. బృహస్పతి ఆశీర్వాదంతో మంచి మార్గంలో పయనిస్తారు. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక పరిపూర్ణత, జ్ఞానోదయం, వ్యక్తిగత అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తుంటారు. సింహంసింహరాశి అధిపతి సూర్యుడు. అందుకే ఈ రాశివారి జీవితం శక్తివంతంగా, ప్రేరణగా ఉంటుంది. బలమైన ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు వీరికి సహజంగా ఉంటాయి. అందుకే వారు ఎక్కడికి వెళ్లినా ప్రతిచోట గౌరవం, ఆదరణ లభిస్తుంది. వీరు దేవదూతలుగా గుర్తింపు పొంది, సమాజాన్ని మేల్కొలుపుతారు. అందుకు ప్రకృతి ఆశీర్వాదం కూడా లభిస్తుంది. శక్తివంతమైన, సృజనాత్మక సామర్థ్యాలతో ప్రపంచంలో తమ ఉనికి చాటుతారు. వారి జీవనమార్గం సమాజ శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది. సమాజంలో సంస్కరణలు తీసుకొస్తారు. మేషంమేష రాశికి అధిపతి అంగారకుడు. ఈ గ్రహం ప్రభావంతో వీరు ధైర్యం, సంకల్పం వంటి శక్తివంతమైన సంకేతాలతో గుర్తింపు పొందుతారు. అచంచలమైన శక్తి, జీవితం పట్ల సహజమైన ఉత్సాహం వీరికి లభిస్తుంది. ఎప్పుడూ లక్ష్యాలను సాధించాలనే కసితో ఉంటారు. అందుకే ఎలాంటి సవాళ్లనైనా సులభంగా అధిగమిస్తారు. మేషరాశివారు దైవబిడ్డగా దీవెనలను అందుకుంటారు. కృతజ్ఞత, అభిరుచి, నమ్మకం అనే సాధనాలతో నాయకులుగా కీర్తి ప్రతిష్టలు పొందుతారు. సమాజ అభివృద్ధికి కృషి చేస్తారు, అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. వారి ఆశయాలు, లక్ష్యాలు ఉన్నతంగా ఉంటాయి. నలుగురూ ఆచరించే విధంగా ఆదర్శ జీవనం సాగిస్తుంటారు. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


మందార పువ్వులను తింటే ఏమౌతుందో తెలుసా?

మందార పువ్వులు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. నిజానికి ఈ పువ్వులు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అవును ఈ పువ్వులను తినడం వల్ల మనం ఎన్నో అనారోగ్యసమస్యలకు దూరంగా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మందార పువ్వుల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజూ ఒక మందార పువ్వును తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో...


రాశిఫలాలు 12 మే 2024 ఈరోజు మేషంలో బుధాదిత్య రాజయోగంతో ఈ రాశుల వారికి గొప్ప ప్రయోజనాలు..!

horoscope today 12 May 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బుధాదిత్య రాజయోగం ఏర్పడటం వల్ల మిధునం, మీనంతో సహా ఈ 5 రాశులకు గొప్ప ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సందర్భంగా మిగిలిన రాశుల ఫలితాలెలా ఉన్నాయంటే...


Mothers day 2024 Wishes in Telugu: అమ్మ ప్రేమకు ఇవే మా నీరాజనాలు, మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పేందుకు అందమైన కోట్స్ ఇదిగో

Mothers day 2024 Wishes in Telugu: మాతృ దినోత్సవం రోజు తల్లి ప్రేమను అందించిన ప్రతి స్త్రీకి శుభాకాంక్షలు చెప్పవలసిన అవసరం ఉంది. అందుకోసం తెలుగులోనే కొన్ని శుభాకాంక్షలు ఇచ్చాము.


ఇంటి ముఖద్వారం తలుపు మీద దేవుడి ఫోటో ఉందా? ఈ విషయాలు తెలుసుకోవాలి

ఇల్లు, ఇంటి వాకిలిని రకరకాలుగా అలంకరించుంటూ ఉంటారు. ఆకర్శణీయంగా, మంగళకరంగా ఉండాలని ఆరాటపడుతుంటారు. అందుకే గడపకు అందమైన ముగ్గులు వేస్తారు. పువ్వులు, ఆకుల తోరణాలే కాదు, పూసలు, గంటలతో అలంకరించిన ద్వారబంధాలను కూడా కడుతుంటారు. కొందరైతే ఇంటి గడపను లక్ష్మీ స్వరూపంగా పూజిస్తుంటారు. ముఖద్వారపు తలుపుల మీద దేవుడి ఫోటోలు సైతం అలంకరణగా పెడుతుంటారు. అది మంచిదో కాదోీ తెలుసుకుందాం. కొంత మంది వాస్తు పండితులు దేవుడి చిత్రాన్ని ఇంటి మఖద్వారపు తలుపుల మీద...


పిల్లల విషయంలో తల్లులు అస్సలు చేయకూడని తప్పులు ఇవే...!

తమ పిల్లలను గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలిపెడుతున్నారు. కానీ... మీ పిల్లలను మీరే పెంచాలి. వారికి మీరు కచ్చితంగా క్వాలిటీ టైమ్ కేటాయించాలి. ప్రతి తల్లి తన బిడ్డపై అమితమైన ప్రేమ పెంచుకుంటుంది. అమ్మ ప్రేమ విషయంలో మనం ఎలాంటి లోపాలు ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు. కానీ... తెలిసీ తెలియక చాలా మంది తల్లులు.. పిల్లల పెంపకంలో తప్పులు చేస్తూ ఉంటారు. ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ రోజుల్లో పేరెంట్స్ కి పిల్లలపై ప్రేమ ఉంటే సరిపోదు....


Chapati Flour : చపాతీ పిండిలో ఐస్ క్యూబ్స్ వేస్తే జరిగే విషయం తెలిస్తే ఇకపై అదే పని చేస్తారు

Chapati Flour : చపాతీ పిండిని ఫ్రిజ్‌లో ఉంచితే పైన నల్లటి పొర కనిపిస్తుంది. ఇది జరగకుండా నిరోధించడానికి, పిండి త్వరగా చెడిపోకుండా ఉండేందుకు ఒక మార్గం ఉంది. అది ఏంటో తెలుసా?


కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

ఎండాకాలంలో పుదీనా, పచ్చి కొత్తిమీర, కరివేపాకును ఎన్నో విధాలుగా ఉపయోగిస్తుంటారు. నిజానికి ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంటాయి. అయితే ఈ మూడు చాలా తొందరగా వాడిపోవడం, పాడవడం జరుగుతుంది. కానీ కొన్ని చిట్కాలతో మీరు కరివేపాకు, పుదీనా, కొత్తిమీరలను ఎక్కువ రోజులు నిల్వ చేయొచ్చు. అదెలాగంటే? ఎండాకాలంలో పుదీనా, కొత్తిమీరను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మజ్జిగతో పాటుగా ఎన్నో పానీయాల్లో వీటిని ఉపయోగిస్తుంటారు. ఈ సీజన్ లో పుదీనా డ్రింక్ ను ఎక్కువగా...


Coconut oil in skincare: ఒక చుక్క కొబ్బరినూనె మీ ముఖానికి రాస్తే హిరోయిన్ వంటి అందమైన చర్మం మీదే..

Coconut oil in skincare: కొబ్బరి నూనె మన ముఖానికి రాసుకుంటే ఎన్నో స్కిన్ సమస్యలు వదిలిపోతాయికొబ్బరి నూనెను మనం హెయిర్ ఆయిల్ గా మాత్రమే ఉపయోగిస్తాము. మరికొంతమంది వంటల్లో కూడా వినియోగిస్తారు.


Besan Ladoo: బెసన్ లాడూ ఇప్పుడు సులభంగా తయారు చేసుకోండి ఇలా..!

Besan Ladoo Recipe: బెసన్ లాడూ అనేది భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందిన స్వీట్. ఇది శెనగపిండి, నెయ్యి, చక్కెర తో తయారు చేస్తారు. ఈ లడ్డులు చాలా రుచికరంగా ఉండటమే కాకుండా,


ఫిష్‌ ఆయిల్‌ వల్ల ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు ఇవే!

ఫిష్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలోని పోషకాలు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి.


Akshaya Tritiya: ఈ మూడు రాశుల్లో మీ రాశి ఉందా? అక్షయ తృతీయ రోజు పట్టిందల్లా బంగారమేనట

వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయను చాలా విశిష్టంగా జరుపుకుంటారు. ఈరోజున సూర్యోదయమునకు ముందే లేచి శుచిగా స్నానం చేసి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే సకల సంపదలు కలుగుతాయి. పురాణాలలో నారదుడు ఒకసారి విష్ణుమూర్తిని అడిగాడట ఓ నారద అక్షయ తృతీయ విశిష్టత ఏమిటని తెలియజేయమన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడట క్షయ కానిది అనగా తరిగిపోనిది అక్షయ తృతీయ అంటారు. ఈరోజు సిరి సంపదలను కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే సంపద తరగదని అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండి ఇతర వస్తువులు కొనుగోలు చేస్తారని కరీంనగర్ అభయాంజనేయ స్వామి అర్చకులు ప్రకాష్ బాబు లోకల్ 18కి తెలిపారు. అయితే ఈ అక్షయ తృతీయ రోజున వృశ్చిక రాశి, మేష రాశి, మీన రాశి వారికి పట్టినందంతా బంగారమేనట. తృతీయ రోజున ధన యోగం, గజకేసరి యోగం ఏర్పడుతున్నాయి. ఇవి 3 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతున్నాయి. మరోవైపు, ఈ రోజున సూర్యుడు, శుక్రుడు మేషరాశిలో సంచరిస్తున్నందున శుక్రాదిత్య యోగం ఏర్పడుతోంది. అలాగే ఈ రోజున మీనరాశిలో కుజుడు, బుధుడు కలవడం వల్ల ధన యోగం, శని మూల త్రికోణ రాశి కుంభరాశిలో ఉండడం వల్ల షష యోగం, ఉచ్ఛ రాశి మీనరాశిలో కుజుడు ఉండటం వల్ల ధనయోగం. మాలవ్య రాజ్యయోగం, వృషభరాశిలో చంద్రుడు, బృహస్పతి కలయిక ఏర్పడుతుంది. ఈ విధంగా, ఈసారి అక్షయ తృతీయ నాడు అనేక రాజయోగాలు ఏర్పడటం వలన 3 రాశుల వారు ధనవంతులు కావచ్చు. అలాగే అక్షయ తృతీయ రోజు ఈ రాశుల వాళ్లు బంగారం, లేదా వెండి, వస్తువులు కొంటే ఇంకా పట్టిందల్లా బంగారమే అవుతుందట ..అయితే మిగతా రాసుల వారికి ఈ రాసుల వారితో పోల్చితే కొంచెం గ్రహబలాలు అలాగే తక్కువ కలిసి వచ్చే అవకాశం ఉందని అర్చకులు ప్రకాష్ బాబు తెలిపారు. అయితే ఈ మిగతా రాశుల వాళ్లు అక్షయ తృతీయ రోజు హనుమాన్ ఆలయానికి వెళ్లి అక్కడ పూజలు చేస్తే మిగతా రాశుల వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.


అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి.. ఆరోజు ఏమేమి జరిగాయో తెలుసా

అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి.. ఆరోజు ఏమేమి జరిగాయో తెలుసా Akshaya Tritiya 2024 Date: ఈ ఏడాది  (2024) అక్షయ తృతీయ మే 10 శుక్రవారం వచ్చింది. ఈ రోజు బంగారం కొనుగోలు చేసి లక్ష్మీపూజ చేస్తే కలిసొస్తుందని అంతా అనుకుంటారు.. అసలు అక్షయ తృతీయ ఎందుకు జరుపుకుంటాము.. పురాణాల ప్రకారం ఆరోజుకున్న చరిత్ర.. విశిష్టత గురించి గురించి తెలుసుకుందాం. . . ప్రతి సంవత్సరం  వ...


Pink Salt Health benefits: హిమాలయన్ పింక్ సాల్ట్ తో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు..

Pink Salt Health benefits: ప్రతిరోజు మనం వంటలో ఉప్పును వినియోగిస్తామో మన ఏళ్ల నుంచి ఆచారం కొనసాగుతుంది. అయితే సోడియం తో కొన్ని నిష్ప్రభావాలు ఉన్నాయి. బ్లడ్ ప్రెషర్ గుండె సమస్యలకు దారితీస్తుంది


తక్కువ ధరలో మామిడి పళ్లు.. ఎగబడుతున్న జనాలు..

వేసవికాలం వచ్చిందంటే తీయటి మామిడి పళ్ళు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి. తియ్య తియ్యగా..పుల్ల పుల్లగా అమృతంలా ఉండే తీపి కలిగిన రసాలపండ్లు , మెత్తగా నోట్లోకి పోయే బంగినపల్లి రకం ఇలా పలు రకాలు మామిడి పళ్ళు విశాఖ రైతు బజార్ లో అందుబాటులో ఉన్నాయి. బయట మార్కెట్లో అధిక ధరలు ఉన్నప్పటికీ రైతు బజార్లు మాత్రం కేజీ 50 రూపాయలు వంద రూపాయలు మాత్రమే ఉన్నాయని రైతు బజార్ ఎస్టేట్ అధికారి కొండబాబు అంటున్నారు. ప్రస్తుతం రైతు బజార్లో బంగినపల్లి మామిడి పళ్ళు కేజీ 75 రూపాయలు ఉందని తెలిపారు. చెరుకు రసం మామిడిపండు , చిన్న రసాలు , పెద్ద రసాలు పళ్ళు కేజీ 75 రూపాయలు ఉన్నాయని అంటున్నారు. నూజివీడు రసాలు మామిడిపళ్ళు కేజీ 100 రూపాయలు ఉందని అంటున్నారు. కలెక్టర్ మామిడి పళ్ళు కేజీ 50 రూపాయలు దారిలో ఉన్నాయని తెలుపుతున్నారు. మామిడిపండు అంటే అందరికీ ఇష్టం. నోరూరించే పండును చూడగానే తినాలి అనిపిస్తుంది. ఫలాల్లో రాజు అయిన ఈ పండు వేసవిలోనే విరివిగా లభిస్తుంది. పుల్లటి కాయలను ఊరగాయలు పెట్టుకుంటారు. తియ్యటి పళ్లను పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మామిడి కాయలను కోసి వాటిమీద కారం, ఉప్పు చల్లుకుని తింటే ఆ మజానే వేరుగా వుంటుంది. పెరుగన్నంలో మామిడి పండు రసం కలుపుకుని తింటే ఆ మజా కూడా మరో రకం. మామిడికి నాలుగు వేల ఏళ్ల చరిత్ర వుంది. ఇది భారతదేశపు జాతీయఫలం. వీటిని తింటే శరీరానికి విటమిన్ సి, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి అని వైద్యులు కూడా చెబుతున్నారు. బయట మార్కెట్ కంటే రైతు బజార్లో తక్కువ ధరకే ఈ అమ్మకాలు చేస్తున్నారు. దీంతో అధిక శాతం నగరవాసులు రైతు బజారుకు వెళ్లి ఈ మామిడి పళ్ళు కొనుగోలు చేయడం జరుగుతుంది. బయట మార్కెట్లో మామిడి పళ్ళు అధిక ధరలు ఉంటే ఇబ్బంది పడకుండా , రైతు బజారుకు వచ్చి తక్కువ ధరలకే కొనుగోలు చేసుకోవాలని ఎస్టేట్ అధికారి తెలిపారు.


Panchangam Today: ఏ మంచి పని మొదలు పెట్టకండి

Panchangam Today:నేడు 2024 ఆదివారం, మే 11, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, వైశాఖ మాసం, శుక్ల పక్షం. ఇవాళ 5 గంటల 35 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 26 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి శుక్ల పంచమి రాత్రి :2గంటల 06నిమిషాల వరకు తదుపరి: షష్టి.వారం: భానువాసరె నక్షత్రం: ఆర్ధ్ర ఉదయం:10గంటల 29 నిమిషాల వరకు తదుపరి:పునర్వసు.యోగం: దృతి ఉదయం:08గంటల 34నిమిషాల వరకు కలదు. తదుపరి: శూలకరణం: బవ మధ్యాహ్నం:02గంటల 06నిమిషాల వరకు తదుపరి బాలవ రాత్రి:2గంటల 06నిమిషాల వరకు తదుపరి: కౌలవ అమృతకాలం ఈరోజు అమృత ఘడియలు లేవు. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు.కాబట్టి ఈరోజు ఏ మంచి మొదలుపెట్టడానికి కుదరదు. దుర్ముహూర్తం సాయంత్రం:04గంటల 54నిమిషాల నుండి 05గంటల 45నిమిషాల వరకు ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం సాయంత్రం 04గంటల 30నిమిషాల నుండి 6గంటల వరకు కలదు. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం మధ్యాహ్నం:12గంటల నుండి ఒంటి గంట 30నిమిషాల వరకు కలదు. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం రాత్రి:10గంటల 58నిమిషాల నుండి 12గంటల 38నిమిషాల వరకు ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


చెరకు రసం వాళ్లు మాత్రం తాగకూడదు.. ఎందుకో తెలుసా?

వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో ఇది ఎంతగానో సహకరిస్తుంది. మొత్తంమీద ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చెరకు రసం భారతదేశంలో చాలా ప్రసిద్ధ వేసవి పానీయం. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ధర కూడా చాలా తక్కువ. ఇందులో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం , పొటాషియం వంటి అనేక రకాల పోషకాలు ఉన్నాయి. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో ఇది ఎంతగానో సహకరిస్తుంది. మొత్తంమీద ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇది చాలా...


TSRTC Dress Code : ఇకపై టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లకు నో- టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ ఆదేశాలు

TSRTC Dress Code : టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల వస్త్రధారణ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగులు ఇకపై టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లు ధరించి విధులకు హాజరు కాకూడదని ఆదేశాలు జారీ చేసింది.