మామిడి పండ్లు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదా..? ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి?

చాలా మంది ఒకేసారి మామిడి పండ్లు ఎక్కువగా కొనుక్కోని.. ఆ తర్వాత వాటిని తెచ్చి ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తూ ఉంటారు.

 

మండే ఎండల్లో మనకు ఊరటనిచ్చేది ఏదైనా ఉంది అంటే అది మామిడి పండు మాత్రమే.  ఈ మామిడి పండును ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. మార్కెట్లోకి  మామిడి పండ్లు రాగానే... వాటిని కొనేసి ఇష్టంగా తినేస్తూ ఉంటాం. చాలా మంది ఒకేసారి మామిడి పండ్లు ఎక్కువగా కొనుక్కోని.. ఆ తర్వాత వాటిని తెచ్చి ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తూ ఉంటారు.

 

కానీ మామిడి పండ్లను ఫ్రిడ్జ్ లో నిల్వ చేయవచ్చా..? ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది. కానీ.. నిపుణులు కూడా  మామిడి పండ్లను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదని చెబుతున్నారు. అలా ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ....మామిడి పండులోని పోషకాలు తగ్గిపోతాయట.  పోషకాలు పోయిన తర్వాత.. ఆ పండ్లను తినడం వల్ల  మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి... ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఉండటమే మంచిది.

మరి ఫ్రిడ్జ్ లో పెట్టకపోతే పండ్లు తొందరగా పాడైపోతాయి కదా అనే సందేహం మీకు కలుగుతుందా..? ఫ్రిడ్జ్ లో పెట్టకున్నా..మామిడి పండ్లను ఎక్కువ రోజులు పాడవ్వకుండా కాపాడుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

కొందరు ముందుగానే పచ్చి మామిడి పండ్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. తర్వాత... వాటిని ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటారు. కానీ... అలా ఫ్రిజ్ లో ఉంచితే మామిడి పండు సరిగా పండక దాని రుచి దెబ్బతింటుంది. మామిడి పండ్లు పక్వానికి రావడానికి ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. ఇది మామిడిని తీపిగా ,లేతగా ఉంచుతుంది. మీరు మామిడి పండ్లను ముందుగానే పండించాలనుకుంటే, వాటిని గది ఉష్ణోగ్రత వద్ద కాగితపు సంచిలో నిల్వ చేయండి. ఫలితంగా మామిడికాయలు త్వరగా పండుతాయి.

మామిడి పండ్లను పూర్తిగా పండిన తర్వాత, కాసేపు చల్లబరచడానికి వాటిని ఫ్రిజ్‌లో ఉంచి తినండి. మీరు పండిన మామిడిని 5 రోజుల వరకు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయవచ్చు. అలా కాదు.. అంతకంటే ఎక్కువ రోజులు మామిడి పండ్లు నిల్వ ఉండాలి అంటే... పండు తొక్క  తీసి.. వాటిని సీలు చేసిన ఏదైనా కంటైనర్ లో నిల్వ చేయవచ్చు. ఇలా అయితే... ఆరు నెలల వరకు ఫ్రీజర్ లో ఉంచవచ్చు.

 

పండిన మామిడి పండ్లను త్వరగా చెడిపోకుండా ఉండేందుకు నీటిలో నిల్వ ఉంచాలి. దీని కోసం, ఒక పాత్రలో నీటిని నింపి, అందులో మామిడికాయలను వేసి, రిఫ్రిజిరేటర్లో ఉంచండి. ఇలా చేయడం వల్ల మామిడి కాయలు కుళ్లిపోకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. నార్మల్ గా మామిడి పండ్లు ఫ్రిడ్జ్ లో పెట్టేకంటే... ఈ టెక్నిక్స్ ని ఫాలో అయితే.. ఎక్కువ కాలం వాటిని నిల్వ ఉంచొచ్చు.. కమ్మగా ఆస్వాదించవచ్చు.

2024-05-08T04:32:26Z dg43tfdfdgfd