మీ అక్వేరియం ఫిష్ కి జ్వరం వచ్చిందా.. ఈ మెడిసిన్ కి గంతులేస్తాయట తెలుసా

ప్రస్తుతం మానసిక ఉల్లాసాన్ని కలిగించే వాటి స్థానంలో మనకు పెంపుడు జంతువులు వచ్చాయని చెప్పవచ్చు. ప్రతి గృహంలో మనకు పెంపుడు శునకాలు, పిల్లులు మనకు కనిపిస్తున్నాయి. అయితే మరికొందరు రంగురంగుల చేపలను అక్వేరియంలలో ఉంచి పోషిస్తున్నారు. ఈ అక్వేరియం ఇంట్లో ఉంటే చాలు.. చిన్నారులకు అక్వేరియంలోని చేపలు ఎక్కువగా ఆకర్షింపబడతాయి. అంతేకాదు అక్వేరియం ద్వారా చేప పిల్లల పెంపకం గృహాలలో కొనసాగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పలువురి విశ్వాసం. అందుకే ఇప్పుడు గృహాలలో అక్వేరియం కల్చర్ వచ్చిందని చెప్పవచ్చు. దీనితో మార్కెట్ లలో అక్వేరియం వ్యాపారం సైతం జోరుగా సాగుతుండగా, పలువురు వ్యాపారులు ఇదే ఉపాధిగా ఎంచుకున్నారు.

ఇలా హనుమకొండ జిల్లాలోని విజయ్ కుమార్ అనే వ్యక్తి గత 8 సంవత్సరాలుగా లష్కర్ బజార్ లోని పెట్రోల్ పంప్ ఎదురుగా ఉన్న గల్లీలో వాణి ఫిష్ వరల్డ్ అక్వేరియం షాపు ఏర్పాటు చేసి చిన్న, చిన్న, రంగురంగుల చేప పిల్లలను విక్రయిస్తున్నారు. ఇక్కడ రూ.50ల నుండి మొదలుకొని రూ.50వేల వరకు రకరకాల సైజుల్లో వివిధ ఆకృతులలో అక్వేరియంలను అందుబాటులోకి ఉంచారు. వ్యాపారం ప్రారంభించిన మొదట్లో కొన్ని రకాల చేపలను తెచ్చి విక్రయించేవారట. చిన్నారులు, పెద్దలు షాపును సందర్శించి చాలా రకాల పలు చేపలు తీసుకురావాలని కోరారట. దీనితో పలు దేశాలలో లభ్యమయ్యే దాదాపు 1000 రకాల రంగురంగుల చేప పిల్లలను తీసుకొచ్చి విక్రయించడం ప్రారంభించారు ఇక్కడ. ఈ చేపల ధర ఒక జతకి రూ.30 ల నుండి మొదలుకొని రూ.3000ల వరకు ఉన్నాయట.

ఈ పరికరాలు చేసే సాయం మీరు కూడా చేయలేరట..నిజమో..కాదో మీరే చెప్పండి

తన వ్యాపారం జోరుగా సాగడంపై లోకల్18 తో విజయ్ కుమార్ మాట్లాడుతూ .. మొదట్లో అక్వేరియం షాప్ తో ప్రారంభించడం జరిగిందని, కానీ కాలక్రమేణా అక్వేరియంతో పాటు అందులో పెంచడానికి చేప పిల్లలను అందుబాటులోకి తీసుకువచ్చానన్నారు. అక్వేరియంను అలంకరించడానికి రంగు రాళ్ళను, నీటిని శుద్ధి చేయడానికి మోటార్లను దానితో పాటు వెలుతురు కోసం లైట్లను కూడా విక్రయిస్తున్నామన్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకొని అన్ని రకాల చేప పిల్లలను అందిస్తుండడంతో కస్టమర్ల నుండి మంచి స్పందన వస్తుందన్నారు.

Swimming Pool: వామ్మో ఎండలు... స్విమ్మింగ్ పూల్స్‌కి క్యూకడుతున్న జనం

అంతేకాదు ఫిష్ ఫీడ్ కూడా విక్రయించడం జరుగుతుందని, ఏవైనా చేప పిల్లలు అనారోగ్యమైతే వాటికి వేయాల్సిన మెడిసిన్ కూడా తమ వద్ద అందుబాటులో ఉంటుందన్నారు. కొత్తగా అక్వేరియం ఏర్పాటు చేసుకునే వారికి ఎలా పెంచాలి, తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అని కూడా తమ వద్ద కొనుగోలు చేసినప్పుడే తెలియజేస్తామన్నారు.

మారిన కాలానికి అనుగుణంగా అక్వేరియం కల్చర్ ప్రస్తుతం అధికంగా ఆదరణ పొందుతోంది. మరి మీకు కూడా ఈ కల్చర్ పై ఆసక్తి ఉందా.. మీ అక్వేరియం లోని చేపలు అనారోగ్యంతో ఉన్నాయా.. ఈ అక్వేరియం షాపుపై ఓ లుక్కేయండి మరి!

2024-04-22T12:36:38Z dg43tfdfdgfd