మీ టీషర్ట్‌పై మీ బొమ్మ కావాలా? ఇక్కడ రెండు నిమిషాల్లో ప్రింట్ చేసిస్తారు

బర్త్ డే , అలాగే మ్యారేజస్, పుట్టినరోజు వేడుకలకు మంచి బహుమతి ఇవ్వాలనుకుంటారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా మంచి గిఫ్ట్స్ వినూత్న రీతిలో డిజైన్చేసి ఇస్తున్నారు. ఫ్యామిలీ ఫొటో ఆల్బమ్ డిజైన్చేయడం నుండి మనం టీ, కాఫీ తాగే కప్ పై ఫొటోస్ వేయడం టీ షర్ట్స్ పైన ఫొటోస్ వేయడం కీ చైన్స్ పైన మనకు నచ్చిన ఫొటోస్ ఇవ్వడం ఇలా ఏ వస్తువు అయితే ఆ వస్తువు పైన ఫొటోస్ వేయడం ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది.

యువతీ, యువకులు కూడా ఇలాంటివి గిఫ్ట్‌గా ఇవ్వడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. దీనికి అనుగుణంగా గిఫ్ట్ ఆర్టికల్స్ షాప్ కూడా అలానే వెలిశాయి. ఇందులో భాగంగా కరీంనగర్‌కు చెందిన శివ అనే వ్యక్తి బహుమతి గిఫ్ట్ గ్యాలరీ షాప్‌తో అనేక విధాలుగా ఫొటోస్ ప్రేమ్స్ మనకు నచ్చిన స్టైల్లో డిజైన్వేసి కరీంనగర్ ప్రజలకు తక్కువ ధరలోనే అందిస్తున్నారు.

కట్నం డబ్బుల కోసం ట్యాంక్ బండ్ దగ్గర పెళ్లికూతురి భిక్షాటన... అసలేం జరిగింది?

వీరి దగ్గర టీ కప్పు ప్రింటింగ్, టీ షర్ట్, ప్రింటింగ్ స్వయంగా సొంత మిషనరీ పైన వేసి పదే పది నిమిషాల్లో కస్టమర్‌కు అందిస్తున్నారు. వీరి దగ్గర రూపాయలు 100 నుండి మొదలుకొని 3000 రూపాయల వరకు అతి తక్కువ ఖర్చుతో కరీంనగర్ లో ఎవరు ఇవ్వని ధరలకు వీటిని ఇస్తున్నారు.

కస్టమ్మర్స్ అభిరుచులకు తగ్గట్టు వివిధ డిజైన్లలో ఫోటో పెయింటింగ్ చేసి తక్కువ సమయంలోనే వారికి అందిస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాల నుండి ఈ బహుమతి గిఫ్ట్ ఆర్టికల్ నడుపుతున్నామని కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల వారికి తక్కువ ధరలకే ఈ సౌకర్యాలు అందించాలని, మేము స్వయంగా అన్ని మిషనరీలు తెచ్చుకొని మేమే ప్రింట్ చేసి తక్కువ సమయంలో ఇస్తున్నామని బహుమతి గిఫ్ట్ ఆర్టికల్ నిర్వాహకులు శివ లోకల్ 18 కు తెలిపారు.

లేతకొబ్బరితో ఐస్‌క్రీమ్ కాంబినేషన్... సమ్మర్‌లో తింటే ఆ మజాయే వేరు... ఇక్కడికి వెళ్లండి మరి

కాలేజీ ఈవెంట్స్, అలాగే పండగలకు మ్యారేజెస్‌కు స్పెషల్ అట్రాక్షన్ కోసం వీరి దగ్గర టీ షర్ట్స్‌పై ఎక్కువగా ఫోటో ప్రింట్ వేసి ఇస్తున్నారు. ఆన్లైన్‌లో దొరికే ప్రతి ఫోటో గ్యాలరీ కావచ్చు, అలాగే మగ్ ప్రింటింగ్ కావచ్చు ఏదయినా ఇక్కడ తక్కువ ధరలోనే ఉంటాయట. మీరు మీకు నచ్చిన ఫొటోస్ టీ షర్ట్స్‌పై వేసుకోవాలనుకుంటున్నారా ఐతే వీరిని సంప్రదించండి.. ఇంకెందుకు లేటు మీకు నచ్చినగర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫెండ్స్, వైఫ్, పిల్లలకు, మంచి గిఫ్ట్ బహుమతి ఇవ్వాలనుకుంటే వీరిని సంప్రదించండి వీళ్ళ అడ్రస్స్ వచ్చేసి బస్టాండ్ టూ గీతబావన్ రోడ్.జోయాలూకాస్షాప్ పక్కన కరీంనగర్.

2024-04-19T08:05:11Z dg43tfdfdgfd