మీ దాహం తీరలేదా.. ఈ పండు తినేస్తే చాలట.. మీలో హుషారే !

భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిలలాడుతున్నారు. ఈ ఎండల ధాటికి కలిగే దాహం తీరనిదనే రీతిలో వేదిగాలులు ఉన్నాయని ప్రజలు తెలుపుతున్నారు. కొబ్బరి బొండాలు, జ్యూస్ లు, చల్లని మజ్జిగలు ఇలా ఏమి త్రాగినా దాహం తీరకపోవడంతో.. మరలా చల్లగా కూల్ డ్రింక్స్, చల్లటి నీరు ఇలా త్రాగుతూ ఉపశమనం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తమిళనాడులో అధికంగా సాగు చేసే ఈ ఒక్క ఫ్రూట్ తీసుకుంటే చాలట.. మీ దాహం క్షణాల్లో తీరాల్సిందేనట. అందుకే ఇక్కడి వ్యాపారులు ఆ ఫ్రూట్స్ ల కొనుగోళ్ల జోరుగా సాగిస్తున్నారు. ఇంతకు ఆ ఫ్రూట్ ఏంటనే విషయాన్ని తెలుసుకుందాం.. !

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలలో సహజసిద్ధమైన పంటలు అధికంగా సాగు చేస్తారు. ప్రధానంగా ఇక్కడ అనేక రకమైన పండ్లు, కాయలు రైతులు పండించి అమ్మకాలు చేస్తుంటారు. అయితే భానుడి ప్రతాపం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సీజనల్ పంటలు సాగు చేసేందుకు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ఈ రైతుల్లో కొందరు తమిళనాడు లో సాగు చేసే పండ్లను ఇక్కడికి తీసుకు వచ్చి జోరుగా విక్రయాలు సాగిస్తున్నారు. అందులో ప్రధానంగా సమ్మర్ లో వాటర్ యాపిల్ కు ఎక్కువగా క్రేజ్ ఉంటుందని గ్రహించిన రైతులు .. తోపుడు బండ్ల పై అధికంగా ఈ ఫ్రూట్ నే అమ్మకాల జోరు పెంచారు. ఈ వాటర్ యాపిల్ ను ఇక్కడ గులాబీ జామ్ కాయ్ అని కూడా పిలుస్తున్నారు.

అయితే వాటర్ యాపిల్ ని టేస్ట్ చేస్తే చాలు దాహం తక్కువగా ఉంటుందని వ్యాపారులు తెలుపుతున్నారు. నిజానికి ఆంధ్రలో ఈ పంట సాగు తక్కువ కాగా.. తమిళనాడు నుంచి తీసుకొచ్చి వ్యాపారం సాగిస్తున్నట్లు లోకల్18 తో వ్యాపారులు తెలిపారు.

భక్షాల బండ్లని ఎప్పుడైనా చూశారా...!!

ముఖ్యంగా ఈ యాపిల్ బిపి, షుగర్ ఉన్నవారికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందట. వేసవికాలంలో మాత్రమే ఎక్కువగా మార్కెట్ లోకి వచ్చే ఈ యాపిల్ లో ఎక్కువ నీటి శాతం ఉండడం కారణంగా, ఈ పండు తింటే చాలు నీటిని త్రాగిన అనుభూతి ఉంటుందట. కాబట్టి ఖచ్చితంగా దాహాన్ని ఈ పండు తీరుస్తుందని, ఆరోగ్యానికి కూడా అన్ని విధాలా మేలు చేస్తుందని తెలిపారు వ్యాపారులు.

శత్రు, రోగ సమస్యలతో బాధ పడుతున్నారా... ఈ ఆలయం బాట పట్టండి...!!

నిజానికి తోటల్లో తక్కువ ధరకు వీటిని వ్యాపారులు కొనుగోలు చేసినప్పటికీ.. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడం, రవాణాలో కొన్ని పండ్లు పాడైపోవడం వంటి నష్టాలతో.. మార్కెట్ లో కేజీ రూ.100 కు అమ్మకాలు సాగిస్తున్నారు. ఏది ఏమైనా ప్రకృతి ఫలంగా పేరు గాంచిన ఈ వాటర్ యాపిల్ తో దాహం తీరడమే కాక, ఎన్నో ప్రయోజనాలు ఉండడంతో ప్రజలు సైతం వీటిని అధికంగా కొనుగోలు చేస్తున్నారు. అందుకే ఇక్కడ ఈ వాటర్ యాపిల్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

2024-04-26T08:51:02Z dg43tfdfdgfd