మీ బెడ్రూమ్ లో ఇది ఉంటే.. ప్రశాంతమైన నిద్ర మీ సొంతం..!

పడకగదిలోకి వెళ్లి నిద్రకు ఉపక్రమించినా.. నిద్ర అనేది పట్టక ఇబ్బందులు పడుతున్నారు. ఈ జాబితాలో మీరు కూడా ఉన్నారా..? అయితే..  మీ బెడ్రూమ్ లో ఈ మొక్కలను పెట్టి చూడండి.. మీకు ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది.

 

ఎవరు ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా.. కడుపు నిండా భోజనం.. కంటికి సుఖ నిద్ర మాత్రమే కోరుకుంటారు. కానీ.. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మందికి మంచి నిద్ర కరువైపోతుంది. పడకగదిలోకి వెళ్లి నిద్రకు ఉపక్రమించినా.. నిద్ర అనేది పట్టక ఇబ్బందులు పడుతున్నారు. ఈ జాబితాలో మీరు కూడా ఉన్నారా..? అయితే..  మీ బెడ్రూమ్ లో ఈ మొక్కలను పెట్టి చూడండి.. మీకు ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది.

1.అలోవెరా..

సౌందర్య సాధనంగా మనం అలోవెరా ను వాడుతూ ఉంటాం. ఈ అలోవెరా మొక్క కనుక బెడ్రూమ్ లో ఉంటే.. మీకు మంచి నిద్ర లభిస్తుంది.   ఈ మొక్క రాత్రిపూట ఆక్సీజన్ విడుదల చేస్తుంది. దాని వల్ల..  ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ మొక్కను పెంచడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు.ఈజీగా ఎక్కడైనా దొరికేస్తుంది. 

2.స్నేక్ ప్లాంట్..

బెస్ట్ ఇండోర్ ప్లాంట్ గా ఈ స్నేక్ ప్లాంట్ ని చెప్పొచ్చు. ఇది కూడా మన చుట్టూ ఉన్న గాలిని ప్యూరిఫై చేయడంలో సహాయం చేస్తుంది. మనకు మంచి నిద్ర పట్టడానికి కూడా సహాయపడుతుంది. గాలిలోని టాక్సిన్స్ తొలగించడంలోనూ కీలకంగా పని చేస్తుంది. మనకు మంచి నిద్ర పట్టడానికి బెస్ట్ ప్లాంట్ అని చెప్పొచ్చు.

3.జాస్మిన్..

మల్లె సువాసన ఎవరినైనా మంత్ర ముగ్ధులను చేస్తుంది. ఆ వాసనకు మంచిగా నిద్రకూడా పడుతుంది, అయితే.. ఇది ఇండోర్ ప్లాంట్ కాదు కదా  అనే సందేహం కలగొచ్చు, అయితే.. ఎండ తగిలితే ఇంటి బాల్కనీలో పెంచుకోవచ్చు. బాల్కనీ నుంచి సువాసన గదిలోకి వచ్చేలా చేసినా పర్లేదు.. లేదంటే... రాత్రిపూట వరకు బెడ్రూమ్ లో ఉంచినా పర్లేదు. మీకు మాత్రం మంచి నిద్రను అందిస్తుంది.

 

4.పీస్ లిల్లీ..

బెస్ట్ ఇండోర్ ప్లాంట్ లో పీస్ లిల్లీ కూడా ఒకటి. ఇది కూడా మీరు మీ బెడ్రూమ్ లో పెట్టుకోవచ్చు. ఈ మొక్కకు కూడా పెద్దగా మెయింటైన్స్ అవసరం లేదు. రాత్రిపూట పడక గదిలో పెట్టుకుంటే,..మీకు మంచి నిద్రను అందించడంలో సహాయం చేస్తుంది. మంచి రిలాక్సేషన్ కూడా అందిస్తుంది.

 

5.స్పైడర్ మొక్క..

ఈ స్పైడర్ ప్లాంట్ కూడా పెంచడం చాలా ఈజీ. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ మొక్క కూడా గాలిలోని టాక్సిన్స్  తొలగించడంలోనూ సహాయపడతాయి.

2024-03-29T08:46:01Z dg43tfdfdgfd