మీరు రోజూ కాచే టీనే కానీ... ఇన్ని తప్పులు చేస్తున్నారా..?

ఇన్ని సంవత్సరాలుగా రోజూ టీ పెడుతున్న మాకు.. సరిగా టీ పెట్టడం రాదా..? మేం తప్పులు చేస్తున్నామా అని మీరు అనుకోవచ్చు. కానీ.. నిజంగానే ఎక్కువ మంది పాలతో టీ చేసే సమయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారు. ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఉదయం లేవగానే  దాదాపు అందరు ఇంట్లో మొదట చేసే పని టీ పెట్టడమే.  కొందరు కాఫీ తాగినా.. ఎక్కువ మంది టీ తాగుతూ ఉంటారు. అయితే.. ఈ టీ తయారు చేసే క్రమంలో మీరు తప్పు చేస్తున్నారనే నమ్ముతారా..? ఏంటి..? ఇన్ని సంవత్సరాలుగా రోజూ టీ పెడుతున్న మాకు.. సరిగా టీ పెట్టడం రాదా..? మేం తప్పులు చేస్తున్నామా అని మీరు అనుకోవచ్చు. కానీ.. నిజంగానే ఎక్కువ మంది పాలతో టీ చేసే సమయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారు. ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

1.మనం టీ చేస్తున్నాం అంటే.. దానికి ఎక్కువ రుచి పాలల్లో ఉంటుంది అనుకుంటూ ఉంటారు. కానీ... మనం ఎంచుకునే టీ పొడిలో ఉంటుంది అంటే నమ్ముతారా..? చాలా మంది తక్కువ ధరకు వస్తున్నాయని చీప్ టీ పొడులు ఎంచుకుంటారు. వాటితో మంచి సువాసన రాదు.. అదేవిధంగా రుచి కూడా రాదు.  కాబట్టి... క్వాలిటీగా ఉండే టీ పొడిని ఎంచుకోవడం చాలా ముఖ్యం.

2.ఇక ఎక్కువ మంది టీ పెట్టమనగానే.. గిన్నెలో వాటర్ పోసేసి.. కనీసం ఆ నీళ్లు వేడిగా కూడా మారకముందే టీ పొడి వేస్తూ ఉంటారు. దాని వల్ల టీ పొడిలోని మంచి రంగు, దాని ఫ్లేవర్స్ బయటకు రావు. అలా కాకుండా.. నీరు మంచిగా మరిగిన తర్వాత టీ పొడి వేసి చూడండి.. అప్పుడు దాని అసలైన రంగు బయటకు వస్తుంది. దాని ఫ్లేవర్స్ కూడా బయటకు వస్తాయి. టీకి మంచి రుచి కూడా పెరుగుతుంది.

 

3.ఇక చాలా మందికి  టీ చేసే సమయంలో ఎన్ని పాలు పోయాలి అనే విషయం తెలీదు. పాలు ఎక్కువ పోస్తే టీ కి రుచి దానంతట అదే వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ.. అది కరెక్ట్ కాదు.. పాలు ఎక్కువగా పోయడం వల్ల దాని రుచి వస్తుంది. అసలైన టీ టేస్ట్ తెలీదు. అందుకే మరీ పాలు ఎక్కువగా పోయకూడదు. ఎంత వరకు పోయాలో అంత వరకే పోయాలి. రేషియోలో తేడాలు రాకుండా చూసుకోవాలి.

 

4.ఇక కొందరు ఉంటారు.. టీలో స్పూన్లకు స్పూన్ల పంచదార వేసేస్తారు. అప్పుడు అది తియ్యగా పానకంలా ఉంటుంది కానీ.. టీ రుచి ఎక్కడ తెలుస్తుంది..?నిజంగా అసలైన టీ రుచి తెలియాలి అంటే... పంచదార తక్కువ వేయాలి. మరీ తియ్యగా ఉండేలా చేయకూడదు.  పంచదార వద్దు అనుకునేవాళ్లు.. తేనె  కలుపుకోవచ్చు.

2024-04-18T06:00:08Z dg43tfdfdgfd