మెడిసిన్ ఎందుకు దండగ.. ఈ వెజిటబుల్ ఉండగా..! డబ్బు తక్కువ ఆరోగ్యం ఎక్కువ

తినదగిన అనేక కూరగాయలలో మనం కొన్నిటికి మాత్రమే ఎంతగానో ప్రాధాన్యత ఇస్తాం. అయితే, మిగతా కూరగాయల్లోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించేవి ఉన్నాయి. అలాంటి కూరగాయల్లో క్యాబేజీ (Cabbage) ఒకటి. క్యాబేజీ ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ వెజిటేబుల్‌లో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. వీటిని రోజూ తింటుంటే డైజెషన్ హెల్త్ మెరుగుపడుతుంది.

క్యాబేజీలో కేలరీలు తక్కువగా, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి బరువు తగ్గవచ్చు. క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని సైతం తగ్గించుకోవచ్చు. వారంలో ఒక్కసారైనా డిన్నర్ (Dinner) మీల్‌లో క్యాబేజీని యాడ్ చేసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అవి ఏవో తెలుసుకుందాం.

డయాబెటిస్‌కు చెక్

క్యాబేజీలో యాంటీహైపెర్గ్లైసెమిక్ లక్షణాలు ఉంటాయి, అవి డయాబెటిక్ నెఫ్రోపతీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. డయాబెటిక్ నెఫ్రోపతీ మూత్రపిండాలకు నష్టం కలిగిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఆ చక్కెర స్థాయిలను ఫిల్టర్ చేయలేక మూత్రపిండాల సామర్థ్యం దెబ్బతింటుంది. కాలక్రమేణా, ఇది మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. ఇలాంటి పెను ప్రమాదం రాకుండా ఉండాలంటే క్యాబేజీలను తప్పనిసరిగా డిన్నర్‌లో తినడం మంచిది. క్యాబేజీలు మధుమేహాన్ని కంట్రోల్‌లో ఉంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.

క్యాన్సర్‌ రాదు

క్యాబేజీలో గ్లూకోసినోలేట్స్ (Glucosinolates) అనే సల్ఫర్ గల సమ్మేళనాలు ఉంటాయి, ఇవి కాలీఫ్లవర్, బ్రకోలీ, ముల్లంగి వంటి ఇతర కూరగాయలలో కూడా కనిపిస్తాయి. ఈ సమ్మేళనాలలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి, ఇవి కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోగలవని అమెరికన్ కార్పొరేషన్ వెబ్‌ఎం‌డీ (WebMD) చెబుతోంది. గ్లూకోసినోలేట్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలకు అడ్డుకట్ట వేసి వాటిని చంపుతాయి కూడా.

గుండె ఆరోగ్యం

క్యాబేజీకి ఆంథోసైనిన్స్ వల్ల కొద్దిగా ఎరుపు రంగు వస్తుంది. ఆంథోసైనిన్స్ ధమనుల గట్టిదనాన్ని (Arterial stiffness), రక్తపోటును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల వీటిని తింటుంటే యువ, మధ్య వయస్సు మహిళల్లో గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఉండవు.

---- Polls module would be displayed here ----

డైజెషన్ హెల్త్

క్యాబేజీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి డైజెస్టివ్ హెల్త్‌కు సంబంధించి పలు ప్రయోజనాలు కలుగుతాయి. ఫైబర్ చెడు (LDL) కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, కడుపు, పేగులలోని శ్లేష్మ పొరను బలోపేతం చేస్తుంది. స్టమక్ అల్సర్స్‌ (stomach ulcers)ను నయం చేస్తుంది. ఫలితంగా, డైజెషన్ మెరుగుపడుతుంది, కేలరీల వినియోగం తగ్గుతుంది.

ఇన్‌ఫ్లమేషన్ దూరం

క్యాబేజీలో ఉండే రసాయనాలు సెల్స్‌ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి, ఫలితంగా క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, అల్జీమర్స్ వంటి వ్యాధుల రిస్కు తగ్గుతుంది.

మరిన్ని ప్రయోజనాలు

క్యాబేజీలోని పోషకాలు పాల ఉత్పత్తిని పెంచుతాయి, పాల నాణ్యతను మెరుగుపరుస్తాయి. అందుకే పాలిచ్చే తల్లులు వీటిని డాక్టర్ సలహా మేరకు తినవచ్చు. ఈ కూరగాయలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, ముడతలు రాకుండా చేస్తాయి. క్యాబేజీలోని పోషకాలు కంటి శుక్లాలు రాకుండా కాపాడతాయి, దృష్టిని మెరుగుపరుస్తాయి.

2024-04-19T05:35:06Z dg43tfdfdgfd