రూ. 5 లకే దోశ... ఫ్యామిలీ ఫ్యామిలీ క్యూ కడుతున్నారు.. ఎక్కడంటే..

ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్ లో భోజనం దొరికినట్టు మనకు ఐదు రూపాయలకే దోశలు అమ్ముతున్నారు. ఈహోటల్ యజమాని తక్కువ ధరలోనే దోశ, పొంగనాలు విక్రయిస్తున్నారు. చాలా తక్కువ ధరకే లభిచటంతో ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చి కొనుగోలు చేస్తున్నారు.అది ఎక్కడో చూడండి.

నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రోడ్డు మార్గాన ఓ హోటల్ ఉంది. ఇదిగత 16 సంవత్సరాల నుంచి రన్ చేయడం జరుగుతుంది.. తక్కువ ధరలకే టిఫిన్ అందించే విధంగా నిర్వాహుకుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిన్న ప్రతి ఒక్కరూ ఆహా ఏమి రుచి అంటూ వెళ్లక తప్పదంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రోడ్డు మార్గాన ఈ హోటల్ ఉండడంతో అధిక జనసాంద్రతతో ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది.

Gas Subsidy: ఖాతాలో గ్యాస్ సబ్సిడీ పడలేదా.. ఇలా చేస్తే క్షణాల్లో డబ్బులు మీ ఖాతాల్లో జమ..

ఈ హోటల్ ప్రత్యేకత ఏంటంటే.. ఐదు రూపాయలకే దోశను విక్రయించటం, పది రూపాయలకు 10 పొంగనాలు ఇవ్వటం జరుగుతుంది. ఇలా ఈ హోటల్ లో అమ్మే టిఫిన్ ప్రత్యేకతను చూసి జనాలు అధిక సంఖ్యలో వచ్చి టిఫిన్ తినేసి వెళ్తుంటారని నిర్వాహుకులు తెలిపారు. ఈ హోటల్ ఉదయం 6 గంటల నుంచి 12 గంటల దాకా పూర్తి రద్దీతో ఉంటుంది. ఐదు రూపాయలకే టిఫిన్ సెంటర్ పెట్టిన మంచి బిజినెస్ గా కొనసాగుతూ ఉంటుందన్నారుహోటల్ యజమాని వీరభద్రప్ప.

పెద్ద పెద్ద హోటల్స్ లో తినే దోశ, 40 రూపాయల నుంచి 60 రూపాయలు వసూలు చేసినా అక్కడ లేని రుచి ఐదు రూపాయల దోశలో ఉందని స్థానికులు తెలిపారు. ఈ హోటల్ కి ఎక్కువగా ప్రతిరోజు కూలీ పనులకువెళ్లే ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి టిఫిన్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ మరల వారి ఇంటికి దాదాపుగా రెండు ప్లేట్ల టిఫిన్ తీసుకెళ్తూ ఉంటారన్నారు.

అధిక రుచితో ఉన్నందు వలన తక్కువ డబ్బులతో టిఫిన్ సెంటర్ రన్ చేయటంతో ప్రజలు ఇష్టపడుతూ ఉంటారు. తక్కువ ఖర్చుతో ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ ఇష్టపడుతూ ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసిన తర్వాత వారి ఆనందాన్ని వ్యక్తపరచుకోవడం జరుగుతూ ఉంది. ఇలా 16 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ ఈ హోటల్ కి ఇష్టపడుతూ వస్తూ ఉంటారని హోటల్ యజమాని వీరభద్రప్ప తెలిపారు.

2024-04-30T12:37:40Z dg43tfdfdgfd