రూపాయి ఖర్చుతో.. దుస్తులపై మరకలను చిటికెలో వదిలించవచ్చు..!

ఎలాంటి మరకలు అయినా వదలడానికి  చాలా కష్టంగా ఉంటుంది. దుస్తుల అందం మొత్తం చిన్న మరకే పొగొట్టేస్తూ ఉంటుంది. ఖరీదైన డిటర్జెంటులు కూడా వదిలించలేని మరకలను.. ఒక చిన్న నిమ్మకాయ వదిలిస్తుందని మీకు తెలుసా?

దుస్తులపై మరకలు పడ్డాయి అంటే.. వాటిని వదిలించడం అంత ఈజీ ఏమీ కాదు. పిల్లలు అయితే.. స్కూల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా.. ఏదో మరకలు పూస్తూనే ఉంటారు. ఆ మొండి మరకలు వదిలించలేక తల్లులకు అన్నీ, ఇన్నీ తిప్పలు కావు. అందులోనూ తెలుపు డ్రెస్ పై మరక పడింది అంటే.. ఇక ఆ డ్రెస్ వేస్ట్ అయిపోయినట్లే.. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారా..? అయితే... కేవలం ఒక్క రూపాయి ఖర్చుతో.. ఓ చిన్న చిట్కా ఫాలో అయితే.. మీరు మీ డ్రెస్ పై పడిన ఎలాంటి మరక అయినా ఈజీగా పొగొట్టేయవచ్చు.  అదేంటో ఇప్పుడు చూద్దాం..

 

నిజానికి మొండి మరకలు అంత తొందరగా వదలవు. అవే.. తెల్ల రంగు దుస్తులు అయితే.. ఎలాంటి మరకలు అయినా వదలడానికి  చాలా కష్టంగా ఉంటుంది. దుస్తుల అందం మొత్తం చిన్న మరకే పొగొట్టేస్తూ ఉంటుంది. ఖరీదైన డిటర్జెంటులు కూడా వదిలించలేని మరకలను.. ఒక చిన్న నిమ్మకాయ వదిలిస్తుందని మీకు తెలుసా?

తెల్లని దుస్తులపై ఉన్న మొండి మరకలను వదిలించుకోవడం అంత సులభం కాదు. మీరు దానిని శుభ్రం చేయడానికి నిమ్మకాయను ఉపయోగించవచ్చు. ఇది సహజమైన బ్లీచ్, ఇది తెల్లని దుస్తుల నుండి మరకలను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

మరి ఈ నిమ్మకాయను ఎలా వాడితే.. ఆ మరకలు వదులుతాయో ఓసారి చూద్దాం...

1.నిమ్మరసం..

తెల్లని దుస్తులపై మరక పడిన ప్రదేశాన్ని ముందుగా నీటితో తడపాలి. ఇప్పుడు ఆ  ప్రదేశంలో తాజా నిమ్మరసం పిండండి.

దీని తరువాత, ఆ డ్రెస్ ని 15-20 నిమిషాలు ఎండలో ఆరనివ్వండి.

ఇప్పుడు, సాధారణ నీటితో వస్త్రాన్ని ఉతకాలి. అంతే... ఆ డ్రెస్ పై మరకలు తొలగిపోయినట్లు మీరు చూస్తారు.

2.నిమ్మరసం, బేకింగ్ సోడా

ఉట్టి నిమ్మరసంతో మరక వదల్లేదు అని మీకు అనిపిస్తే... దానికి బేకింగ్ సోడాని కూడా కలపండి. అప్పుడు ఫలితం కనపడుతుంది,

ముందుగా డ్రెస్ పై మరకలను సులభంగా తొలగించడానికి, ముందుగా నిమ్మరసం పిండి వేయండి.

తరువాత, మరక ఉన్న ప్రదేశంలో కొంచెం బేకింగ్ సోడాను చల్లుకోండి.

ఆ తర్వాత, ఆ డ్రెస్ ని 15 నుండి 20 నిమిషాలు ఎండలో ఆరనివ్వండి.

ఇప్పుడు ఎప్పటిలాగానే డ్రెస్ ని ఉతికితే సరిపోతుంది.

3.నిమ్మ రసం , నీరు

మీరు తెల్లని బట్టల నుండి మరకలను తొలగించడానికి నిమ్మకాయ మరియు నీటిని కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం మీరు ఒక కప్పు నీటిలో ఒక చెంచా నిమ్మరసం కలపాలి.

ఈ మిశ్రమంలో దుస్తులను 15-20 నిమిషాలు నానబెట్టండి.

దీని తరువాత, తడిసిన ప్రాంతాన్ని సున్నితంగా రుద్దండి.

అప్పుడు సాధారణ నీటితో మళ్లీ డ్రెస్ ని ఉతికితే సరిపోతుంది..

నిమ్మకాయతో దుస్తులు ఉతకడం వల్ల కలిగే ప్రయోజనాలు

నిమ్మకాయను ఉపయోగించడం ద్వారా మీరు తెల్లని దుస్తుల  నుండి అనేక రకాల మరకలను తొలగించవచ్చు. టీ-కాఫీ మరకలు, ఆహారపు మరకలు, మట్టి మరకలు, చెమట మరకలు మొదలైన వాటిని వదిలించుకోవడానికి నిమ్మకాయ ఉత్తమ ఎంపిక. అయితే.. అన్ని రకాల క్లాత్ లపై నిమ్మకాయను ఉపయోగించకూడదు. మనం స్కిన్ కి ఏలాగైతే ప్యాచ్ టెస్ట్ చేసుకుంటామో.. డ్రెస్ కి కూడా ఒక చివర కొంచెం నిమ్మరసం రాసి చూడాలి. ఏమీ కాలేదు అనుకున్నప్పుడే.. దానిని ఉపయోగించి.. మరకలను శుభ్రం చేయాలి.

2024-03-28T06:43:27Z dg43tfdfdgfd