రాత్రిళ్లు భర్త చేసే ఆ పనికి.. భార్యకు అస్సలు నిద్రలేదు..పెళ్లైన 6 రోజులకే..!

ప్రతి మనిషి జీవితంలోనూ పెళ్లి అనేది చాలా మధురమైన బంధం. వివాహం అనంతరం.. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలి. మంచి చెడులన్నీ కలిసి ఎదుర్కోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకొని.. సర్దుబాటు చేసుకొని..హాయిగా జీవించాలి. సరైన జీవిత భాగస్వామి దొరికితే జీవితం అద్భుతంగా ఉంటుంది. కానీ మిమ్మల్ని అర్థం చేసుకోని జీవిత భాగస్వామి దొరికితే మాత్రం జీవితం నరకప్రాయంగా మారుతుంది. ఆ బాధ తట్టుకోలేక ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. బలవన్మరణానికి పాల్పడుతున్నారు. బీహార్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. భర్త వేధింపులు తట్టుకోలేక.. ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది.

---- Polls module would be displayed here ----

కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన సోనమ్‌కు మనోజ్ అనే వ్యక్తితో నెల రోజుల క్రితం వివాహం జరిగింది. పెళ్లి తర్వాత మనోజ్ సోనమ్‌తో కలిసి బీహార్ వెళ్లాడు. సోనమ్ నర్సింగ్ చదువుతుండగా.. మనోజ్ ఓ ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు. ఐతే పెళ్లయి వారం రోజులు కూడా కాకుండానే.. వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగాయి. మనోజ్ ఆమెను వేధించడం ప్రారంభించాడని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో పెళ్లయిన నెల రోజులకే సోనమ్ రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

సోనమ్ చనిపోయిన తర్వాత ఆమె మృతదేహాన్ని బీహార్ నుంచి అల్వార్‌కు తీసుకొచ్చారు. పెళ్లయిన ఆరు రోజులకు అంతా బాగానే ఉందని.. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. ఆ తర్వాతి నుంచి సోనమ్‌తో సరిగా నడుచుకునే వాడు కాదని ఫిర్యాదు చేశారు. రాత్రి కాగానే ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయేవాడని.. సోనమ్ రాత్రంతా మేల్కొని అతని కోసం ఎదురుచూసేదని తెలిపారు. కానీ రాత్రి ఎంత ఎదురుచూసినా రాకపోయేవాడు. మళ్లీ మరుసటి రోజు ఉదయమే ఇంటికి వచ్చేవాడు. అతడి గురించి ఆరా తీయగా.. వేరొక అమ్మాయితో ఎఫైర్ ఉందని తేలింది. ఈ విషయం గురించి సోనమ్ ప్రశ్నించగా మనోజ్ ఆమెను చితకబాదేవాడు. చిత్రహింసలకు గురిచేసేవాడు.

సోనమ్ గతంలో పలు మార్లు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మనోజ్ గురించి చెప్పింది. వేరొక అమ్మాయితో సంబంధం పెట్టుకొని..తనను వేధిస్తున్నాడని ఏడ్చేది. చాలా విషయాలు తనతో దాచిపెట్టాడని.. మొబైల్ ఫోన్ కూడా ముట్టుకోనివ్వడని విలపించింది. ఓసారి ఇలాగే మనోజ్ ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా.. ఆమెను తీవ్రంగా కొట్టాడు. భర్త వేధింపులు భరించలేక సోనమ్ రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకుంది. ట్రాక్ పై సోనమ్ పర్సులో లభించిన డాక్యుమెంట్ల ఆధారంగా మృతదేహాన్ని గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మనోజ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

2024-04-24T09:13:14Z dg43tfdfdgfd