రోజుకి ఎన్ని మామిడి పండ్లు తినాలి..?

ఎండాకాలం పోయిన తర్వాత,.. మళ్లీ కావాలన్నా మామిడి పండ్లు మనకు దొరకవు. అందుకే దొరికినప్పుడే తినేయాలి అని అనుకుంటూ ఉంటారు.

ఎండాకాలం రాగానే మన అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మామిడి పండ్లే. మామిడిని మనం పండ్లకే రారాజుగా పిలుస్తాం. అసలు మామిడి పండ్లను ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. ఎండలు ఎంత ఇబ్బంది పెడుతున్నా...  ఈ కాలంలో అందరికీ నచ్చేది ఈ మామిడి పండు మాత్రమే.ఎందుకంటే.. ఈ పండు రుచి మాత్రమే కాదు... చాలా పోషకాలతో నిండి ఉంటుంది. దీని తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

 

ఎండాకాలం పోయిన తర్వాత,.. మళ్లీ కావాలన్నా మామిడి పండ్లు మనకు దొరకవు. అందుకే దొరికినప్పుడే తినేయాలి అని అనుకుంటూ ఉంటారు.దాని కోసం.. రోజుకు నాలుగు, ఐదు పండ్లు లాగించేస్తూ ఉంటారు.  కానీ.. అలా ఎక్కువగా తినడం వల్ల.. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 మామిడి పండు ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అల్సర్ మరియు అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన ఫైటోన్యూట్రియెంట్లు మామిడిలో పుష్కలంగా ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మామిడిని సరిగ్గా శుభ్రం చేయకుండా తింటే, దానిలోని హానికరమైన పదార్థాలు కడుపు సమస్యలను కలిగిస్తాయి. దీని కారణంగా, శరీరంలో విషపూరిత పదార్థాల పరిమాణం పెరుగుతుంది. అంతే కాకుండా మామిడి పండ్లను ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ షుగర్, డయేరియా వంటి సమస్యలు వస్తాయి.

 

రోజుకు ఎన్ని మామిడి పండ్లు తినాలి?

మామిడి పండ్లను ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మామిడిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, నొప్పి, ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మామిడి పండ్లను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. రోజుకు గరిష్టంగా 3 మామిడి పండ్లు తినండి. ఒక రోజులో ఎక్కువ మామిడి పండ్లు తినకూడదు.

మామిడికాయ తినే ముందు ఇలా చేయండి

చాలా మంది వ్యాపారులు మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ రసాయనం నీటిలో కలిసినపుడు ఎసిటిలీన్ అనే వాయువు విడుదలై పండ్లను వేగంగా పక్వానికి గురి చేస్తుంది. ఇలా పండిన పండ్లు శరీరానికి విషపూరితం. ఇది తీవ్రమైన సమస్యలను కూడా కలిగిస్తుంది. కాబట్టి మార్కెట్ నుండి మామిడి పండ్లను తెస్తే వాటిని కనీసం 3 గంటల పాటు నీళ్లలో నానబెట్టి బాగా తినాలి. నానపెట్టిన తర్వాత తింటే పెద్దగా ప్రమాదం ఉండదు.

2024-05-07T11:44:47Z dg43tfdfdgfd