వంకాయలు ఎక్కువగా తింటున్నారా.. సమస్యే.. ఆయుర్వేద నిపుణుల హెచ్చరిక!

అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన వంకాయ భారతీయ వంటకాల్లో ముఖ్యమైనది. ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అంటూ వంకాయలపై పాటలు కూడా ఉన్నాయి. గుండె జబ్బులు, రక్తంలో చక్కెర (diabetes), అధిక బరువు, క్యాన్సర్‌ని కంట్రోల్ చెయ్యడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి వంకాయలు.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, వంకాయ వల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి. ఆయుర్వేద నిపుణుడు సిద్ధార్థ్ గుప్తా ఆహారంలో వంకాయ ఎక్కువగా వాడితే ఏం జరుగుతుందో హెచ్చరిస్తున్నారు.
శాస్త్రీయంగా, వంకాయను 'నైట్ షేడ్' కుటుంబ కూరగాయగా పిలుస్తారు, ఈ జాతి కూరగాయలతో అలెర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. వంకాయలో కాల్షియం అధిక మొత్తంలో ఉంటుంది. వంకాయ ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
వంకాయ తొక్కలలో నాసునిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది, ఇది కణాలు ఐరన్‌ను పొందనివ్వకుండా అడ్డుకుంటుంది. వంకాయలో సహజ టాక్సిన్ సోలనిన్ ఉంటుంది. అందువల్ల వంకాయలు అధికంగా తింటే వాంతులు, వికారం, మగత వస్తాయి.
జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు, అలెర్జీ సమస్యలు ఉన్నవారు, డిప్రెషన్, రక్తహీనత, పైల్స్, మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడేవారు వంకాయను ఆహారంలో చేర్చుకోకూడదు. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.)

2024-03-29T09:21:28Z dg43tfdfdgfd