వరి గడ్డి చుట్టే యంత్రాన్ని ఎప్పుడైనా చూశారా..?ఇక్కడ చూసేయండి..

ఒకప్పుడు వరి కోత దశకు వస్తే చాలు.. కోత కొయ్యాలి అంటే పెద్ద సంఖ్యలో కూలీలు కావాల్సిందే, పగలు కొయ్యాలి అంటే వాతావరణం అనుకూలించేది కాదు. కాబట్టి విద్యుత్ దీపాలు పెట్టుకొని మరీ కోత కోసేవారు. కోసిన వరిని కట్టలు కట్టి రాతి బండ ఉండే చోటకు మోసేవారు లేదంటే బండి లేదా ట్రాక్టర్ సాయంతో పల్లపు ప్రాంతంకు చేర్చే వారు. దాన్ని వొబ్బిడి చెయ్యాలి అంటే వారాలు పట్టేది. ధ్యానం ఇల్లు చేరే వరకు ఇబ్బందులు పడే వారు. కానీ వీటిని చెక్ పెట్టడానికి వరిని, కోత కోసి, వోబ్బిడి చేసే యంత్రాలు అందుబాటులోకి రావడంతో రైతన్న ఊపిరిపీల్చుకుంటున్నారు.

వారాలు పట్టె కోతలు రోజులలో పూర్తి అవుతున్నాయి..ఇది ఒక తంతు అయితే వేరు చేసిన వరి గడ్డిని కట్టలు రూపంలో కట్టే యంత్రం కూడ అందుబాటులోకి రావడంతో రైతన్నకు మరీ మేలు జరిగింది. కట్టకు 40 నుండి 55 రూపాయిలు తీసుకొని పొలం వద్దే కట్టలు చుట్టడానికి యంత్రం వస్తున్నది. గతంలో వరి కట్టలను చేతుల ద్వారా రైతన్నలే కొట్టి,వాటిని అవులతో తొక్కించి అందులో ఉన్న ఓడ్లును వేరు చేసి వరి గడ్డిని ఎండ బెట్టి ఆ తరువాత పశువుల గాటికి తరలించే వారు.

కానీ ఇప్పుడు అలాంటి కష్టాలకు చెక్ పెట్టె విధంగా వరి గడ్డి కట్టలు కట్టె యంత్రం వచ్చింది. ఎకరా వరి గడ్డిని రెండు గంటల వ్యవదిలోనే కట్టలు చుట్టేస్తున్నది. ఈ యంత్రం రావడంతో రైతన్నలకు చాలా సులువు, కూలీలు తక్కువ, ఖర్చు తక్కువ కాబట్టి రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువుగా వరి సాగు చేస్తున్నారు. వొబ్బిడి సమయానికి యంత్రాలే పొలాల వద్దకు వచ్చి రైతన్నలకు సులువు చేస్తున్నారు.

ఉదయం ఆకుపచ్చగా, మధ్యాహ్నం నలుపుగా, సాయంత్రం నీలంగా.. రాత్రి తెల్లగా కనిపించే వస్తువు ఏంటి

ఇదే క్రమంలోనే తమిళనాడు రాష్ట్రం, అరుణాచలంకు చెందిన భాస్కర్ అనే వరి చుట్టే యంత్రం యజమాని బైరెడ్డిపల్లి మండలంలోని కోత కోసి పొలాల వద్ద ఆరేసిన వరి వద్దకు వెళ్లి బేరం కుదుర్చికొని పనులు ముమ్మరం చేసి రైతన్నలకు సులువు చేస్తున్నారు. కట్టలు చుట్టుకోవడానికి ఎవరికైనా యంత్రం అవసరమయితే 99658 93151 ను సంప్రదించాలన్నారు. వరి గడ్డి మిషన్ అనేక రకాలుగా ఉపయోగపడుతున్నది.  బిజినెస్ గా కూడ ఉపయోగపడుతున్నది. ఈ యంత్రం వల్ల ఖర్చులు పోను రోజుకు 15 వేలు లభిస్తుందని చెప్పారు. వరి గడ్డి పొలంలో కొద్దీ కూడ వెస్ట్ కాకుండా యంత్రం పని చేస్తుంది. ఒక గడ్డి పోచి కూడ పొలంలో ఉండకుండా పూర్తిగా కట్టలాగ చుట్టేస్తున్నది.

2024-05-04T10:53:03Z dg43tfdfdgfd