వామ్మో..ఈ పాలు.. లీటరు వెయ్యి

వామ్మో..ఈ పాలు.. లీటరు వెయ్యి

బర్రెపాలు, ఆవు పాల గురించి తెలుసుకానీ.. గాడిద పాల గురించి ఎప్పుడైనా విన్నారా? వింటే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. లీటరు గాడిద పాలు వెయ్యి రూపాయలంట. అంత ఖరీదు ఎందుకు అనుకుంటున్నారా?  అయితే ఈ స్టోరీని చదవండి.  

ఈజిప్ట్ మహారాణి క్లియోపాత్రా కూడా గాడిద పాలతో స్నానం చేసేవారట.గాడిద పాలతో చర్మం మృదుత్వాన్ని సంతరించుకుని మీ అందం రెట్టింపవుతుందట. ఇటీవల ఓ పరిశోధనలో గాడిద పాలు చర్మసౌందర్యానికి చాలా మంచివని తేలింది. అందుకే ఆవుపాలు, మేకపాల కంటే గాడిద పాలకే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ పాలల్లో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.  ఈ విషయం తెలుసుకొని దీన్ని క్యాష్ చేసుకునే దిశగా ఢిల్లీలోని ఓ స్టార్టప్ కంపెనీ గాడిద పాలతో సబ్బులు తయారు చేసి విక్రయిస్తోంది.

గాడిద పాలు తరచుగా తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవని చెబుతున్నారు. ఇక ఈ పాలతో తయారు చేసిన సబ్బులకి కూడా డిమాండ్ ఎక్కువే. గాడిద పాలలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గించడంలో, చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయట. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో సబ్బులతో పాటు అక్కడ గాడిద పాలు తాగే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉందట. అందుకే గాడిద పాలను లీటర్ వెయ్యి రూపాయలు పెట్టి కొనడానికైనా వెనుకాడటం లేదు. అంతే కాకుండా మోకాళ్ల నొప్పులకు,  ఆస్తమా, షుగర్ వంటి వ్యాధులకు కూడా గాడిదపాలు చక్కని ఔషధం అని అంటున్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-02T14:16:26Z dg43tfdfdgfd