వేసవిలో ఈ ఫుడ్ కాంబినేషన్స్‌ చాలా డేంజర్.. కలిపి తింటే అంతే సంగతులు..!

ఈ వేసవిలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటోంది. బయటకు వెళ్తే వేడిగాలులు, ఇంట్లో ఉక్కపోత అల్లాడిస్తున్నాయి. వేడిమి నుంచి ఉపశమనం కోసం చాలామంది వాటర్ కంటెంట్ ప్రూట్స్, చల్లని పానీయాలు తాగుతున్నారు. అయితే వేసవిలో కొన్ని రకాల ఆహారాలను కలిపి తినడం చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని ఫుడ్స్ కాంబినేషన్‌గా అస్సలు సెట్ కావు. వీటిని కలిపి తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు. అవేంటంటే..

* పుచ్చకాయ- పాల ఉత్పత్తులు

సమ్మర్ పండల్లో పుచ్చకాయ ప్రధానమైనది. ఇందులో 90 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇది వేసవి నుంచి ఉపశమనం కల్పిస్తుంది. పుచ్చకాయ ముక్కలను నేరుగా తినవచ్చు లేదా జ్యూస్ చేసుకొని తాగవచ్చు. అయితే వీటిని ఏదైనా పాల ఉత్పత్తితో కలిపి కాంబినేషన్‌గా తీసుకుంటే గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి పొట్ట సంబంధ సమస్యలు రావచ్చు.

* భోజనం- కూల్‌డ్రింక్స్

వేసవిలో దాహం తీర్చుకోవడానికి చాలామంది కూల్‌డ్రింక్స్ తాగుతారు. అయితే ఇవి హెల్త్‌కు మంచివి కాదు. ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు లేదా తిన్న తర్వాత వీటిని అస్సలు తాగకూడదు. ఒకవేళ ఇలా చేస్తే జీర్ణక్రియ మందగిస్తుంది. దీంతో తిన్న ఆహారం జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఇందుకు అదనపు శక్తి అవసరం. అందుకే కూల్‌డ్రింక్స్ బదులుగా ఇతర ఫ్రూట్ జ్యూస్‌లు తాగడం మంచిది.

* తీపి పండ్లు - సిట్రస్ ఫ్రూట్స్

అరటి వంటి తీపి పండ్లను నారింజ, పైనాపిల్ వంటి పులుపు పండ్లను కాంబినేషన్‌గా తినకూడదు. ఈ రెండు రకాల పండ్ల కలయిక కారణంగా అజీర్తి, పొట్ట ఉబ్బరం వంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకే సిట్రస్ పండ్లను మాత్రమే కాంబినేషన్‌గా తినాలి.

* పిండిపదార్థాలు- ప్రోటీన్ ఫుడ్స్

పాస్తా లేదా బ్రెడ్ వంటి పిండి పదార్ధాలను ప్రోటీన్-రిచ్ ఫుడ్స్‌తో కాంబినేషన్‌గా తింటే జీర్ణక్రియ రేటు తగ్గుతుంది. దీనివల్ల పొట్ట ఉబ్బరంగా మారి అసౌకర్యంగా అనిపిస్తుంది.

* పాలు- చేపలు

ఆరోగ్యానికి చేటు చేసే ఫుడ్ కాంబినేషన్‌లో పాలు- చేపలు ఒకటి. ఈ కాంబినేషన్ జీర్ణక్రియకు అవసరమైన వివిధ ఎంజైమ్స్‌పై ప్రతికూల ప్రభావం చూపి జీర్ణ సమస్యలకు కారణమవుతాయి.

* అరటిపండు- పాలు

అరటి పండు, పాలు మంచి పోషక పదార్థాలు. వీటితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ రెండిటినీ కలిపి కాంబినేషన్‌గా తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి జీర్ణక్రియకు అంతరాయం ఏర్పరుస్తాయి. దీనివల్ల శరీరంలో టాక్సిన్స్ ఉత్పత్తి కావచ్చు.

* ఉల్లిపాయ - పెరుగు

ఉల్లిపాయలు గ్యాస్ ఉత్పత్తి చేస్తాయి. ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉండే పెరుగుతో వీటిని కలిపి తింటే పొట్టలో అసౌకర్యం, అజీర్తి వంటివి రావచ్చు.

* పండ్లు, ప్రోటీన్ ఫుడ్ కాంబినేషన్

పెరుగు, జున్ను వంటి ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉండే ఆహార పదార్థాలతో పండ్లను మిక్స్ చేసి తినడం రుచికరంగా అనిపించవచ్చు. అయితే ఈ కాంబినేషన్ వేసవిలో ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు. పండ్లలో సహజ చక్కెర ఉంటుంది. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. అయితే ప్రోటీన్లు విచ్ఛిన్నం కావడానికి సమయం పడుతుంది. ఈ రెండింటి కాంబినేషన్ కడుపు ఉబ్బరం, అసౌకర్యానికి కారణం కావచ్చు.

* పిండి పదార్థాలు- యాసిడ్స్ ఫుడ్స్

కొందరు ఆకుపచ్చ కూరగాయాలతో కూడిన సలాడ్స్‌లో సిట్రస్ పండ్ల రసాన్ని మిక్స్ చేస్తుంటారు. అయితే పిండిపదార్థం అధికంగా ఉండే ఫుడ్స్‌తో కాంబినేషన్‌గా సలాడ్స్ తీసుకుంటే ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అజీర్ణానికి దారి తీసి జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది.

2024-05-07T08:03:10Z dg43tfdfdgfd