వేసవిలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. తప్పక తెలుసుకోండి..

చరిత్రలో ఎన్నడూ నమోదు కానీ ఉష్ణోగ్రతలు 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో నమోదు కావడం జరుగుతుందని కొంత మంది నిపుణులు,వాతావరణ శాకు సంబంధించిన సిబ్బంది తెలిపారు.చిత్తూరు జిల్లాలో ఎన్నడూ ఇలాంటి మండే ఎండలు ఉదయాన్నే 7.00 గంటలకు సూర్యుడు నిప్పులు గక్కుతున్నాడు. గతంలో ఇంతలా ఎండలు లేవని వాపోతున్నారు జిల్లా వాసులు.

ఇలాంటి నేపథ్యంలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పలమనేరు ఏరియా ఆసుపత్రి కౌన్సలర్ కోమల అంటున్నారు.ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు పలు విషయలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ఆరోగ్యం పై శ్రద్ద మరిచి, బతుకు దెరువులో లీనం అవ్వడంతో వారి ఆరోగ్యం క్షీణీస్తోందని అవగాహన కల్పిస్తూ పలు జాగ్రత్తలు తెలిపింది.

పది ఫలితాల్లో సత్తా చాటిన కేజీబీవీ విద్యార్థిని.. 10/10 జీపీఏ..

ఈ సందర్భంగా కోమల మాట్లాడుతూ గర్భం దాల్చిన ప్రతి స్త్రీ ఈ క్రిటికల్ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.జరగరానిది జరిగితే ప్రాణానికే ప్రమాదమన్నారు. పలమనేరు ఏరియా ఆసుపత్రిలో ప్రతి బుధ,శుక్ర రోజుల్లో ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు చికిత్సలు, ఆరోగ్యంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే గర్భం దాల్చిన ప్రతి స్త్రీ గుర్తించుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు.

ఎండలు మండుతున్న తరుణంలో ఆరు బయట వచ్చేటప్పుడు ఉదయం,సాయంకాలం మాత్రమే అది తప్పని పరిస్థితుల్లో రావాలన్నారు. రోజు ద్రవాలు గల రసాలు తీసుకోవాలన్నారు. కడుపులో బిడ్డ ఉంటాడు కాబట్టి కొద్దీ కొద్దిగా ఆహారం రోజంతా తీసుకోవాలని చెప్పారు.దానిమ్మ,ఆపిల్, సపోటా, బత్తాయి, ఆరెంజ్, డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకోవాలన్నారు.వీటిని కొనుక్కోలేని వారు అందుబాటులో దొరికే సీజనల్ ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యం బాగుంటుందన్నారు. క్రమంగా నీరు,మజ్జిగ వంటి ద్రవాలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలన్నారు.

ఒకే సారి ఎక్కువగా భుజించకుండా తగు మోతాదులో విడతల విడతలుగా తీసుకోవాలని సూచించారు. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు. తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పారు. డాక్టర్ల సలహాలు పాటిస్తూ పౌష్టికాహార మెనూ క్రమాన్ని వాడితే పుట్టబోయే బిడ్డ ఏ అంగవైకల్యం లేకుండా పుట్టడం జరుగుతుందన్నారు. వేసవిలో రాగి జావా, పాలు, గుడ్లు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే ప్రతి పౌష్టిక ఆహాతినాలన్నారు.

మేస్త్రీ కుమార్తె పదిలో ఎన్ని గ్రేడ్ పాయింట్లు సాధించిందో తెలుసా..

క్రమంగా నెల చికిత్సలు చేసుకొంటూ తల్లి, బిడ్డ యోగ క్షేమాలపై డాక్టర్లను అడిగి తెలుసుకోవాలన్నారు. లోపం కంట పడితే తగు చికిత్సలు నిర్వహించుకొని 9 నెలల వరకు వికసించిన పుష్పంలాగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. డాక్టర్ల సలహాలు సూచనలు పాటిస్తే అన్ని మంచే జరుగుతుందని లోకల్ 18తో తెలిపారు.

2024-05-01T06:55:41Z dg43tfdfdgfd