వేసవిలో నర్సరీలోని మొక్కలను ఎలా సంరక్షిస్తారో తెలుసా.. ఈ వీడియోలో తెలుసుకోండి..

ఎండ తీవ్రత నుంచి నర్సరీలో మొక్కలను సంరక్షించాలంటే పలు జాగ్రత్తలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. సరైన అవగాహన లేక మెుక్కలను ఇష్టం వచ్చినట్లు వదిలేస్తే నాశనం కాక తప్పవని నర్సరీ నిర్వాహుకులు తెలుపుతున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పరిధిలో తంగడంచ గ్రామం ఉంది. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన నర్సరీ ఉంది. ఈ నర్సరీని చంద్రశేఖర్ అనే వ్యక్తి నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ఇతను దాదాపుగా పది సంవత్సరాల నుంచి జూపాడు బంగ్లాలో నర్సరీ ఏర్పాటు చేశారు.

ఇప్పుడు అక్కడ నుంచి తంగడంచలో నర్సరీని నిర్వహిస్తున్నాడు చంద్రశేఖర్. తంగడంచ గ్రామంలో 5 ఎకరాల సాగులో కొత్తగా నర్సరీని ఏర్పాటు చేశారు. ఈ నర్సరీలో ఉన్న మొక్కలను ఎండ తీవ్రత ఎక్కువగా తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మొక్కలను పెంచడం జరుగుతుంది. ఇందులో రకరకాల పంటలకు సంబంధించిన మొక్కలను పెంపుదల చేస్తున్నారు. అందులో ముఖ్యంగా పచ్చిమిరప, ఒట్టి మిరప, బెండ వంకాయ తదితర కూరగాయల మొక్కలను పెంచుతూ ఉన్నారు.

ఈ గోలిసోడా తాగితే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు రావాల్సిందే.. ఆ మధురమే వేరు..

నర్సరీ యజమాని చంద్రశేఖర్ కడప జిల్లా వాసి. అయినప్పటికీ తంగడంచ గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులందరూ ఈ నర్సరీ లోనే పనులు చేస్తూ వారితోపాటు ఇంకో పదిమందికి ఉపాధిని కల్పిస్తున్నారు. ఈ నర్సరీలో రెండు రకాల మొక్కలను పెంపుదల ఉంటుంది. అందులో ఒకటి ఏమిటంటే నర్సరీ లో పెంచే మొక్కలు పూర్తిగా నర్సరీ యజమానికే సంబంధించి ఉంటుంది. రెండవది రైతన్నలు వారికి నచ్చిన కంపెనీ విత్తనాలను తీసుకొచ్చి నర్సరీ యజమాని చంద్రశేఖర్ కి ఇచ్చి వాటిని పెంచమని ఇస్తారు.

నర్సరీ యజమాని చంద్రశేఖర్ వారు తెచ్చినటువంటి విత్తనాలను చాలా జాగ్రత్తగా నర్సరీలో వేసి మొక్కల ఎదుగుదలకు తాను కష్టపడి పెంపుదల పెంపొందిస్తారు. ఇలా పెంచినట్లయితే నర్సరీ యజమానికి రైతన్నలు కొద్ది మోతాదులో డబ్బులు అందజేయడం జరుగుతూ ఉంటుంది . మొక్క చిన్నతనం నుంచి ఒక ఏజ్ వచ్చేదాకా పూర్తి బాధ్యతలు నర్సరీ యజమాని చంద్రశేఖర్ చూసుకోవాల్సి ఉంటుంది.

ఈ మొక్కల పెంపుదల విషయంలో పూర్తిగా ట్రాక్ లో వాటిని వేసిన తర్వాత నల్లని పట్టాను కట్టడం జరుగుతుంది. ఈ పట్టానే 50 ప్లస్ అంటారు. 50 ప్లస్ అంటే 50 శాతం ఎండ ఉంటే ఆ మొక్కల పైకి 20 శాతం ఎండను మాత్రమే పంపిస్తుంది. దాదాపుగా 30 శాతం ఎండ తీవ్రతను తట్టుకొని ఉంటుంది. అధిక వర్షాలు కురిసినప్పుడు రైతన్నలు అధికంగా మొక్కలు కొనుగోలు జరుగుతూ ఉంటుందని నర్సరీ యజమాని చంద్రశేఖర్ లోకల్ 18 ద్వారా తెలియజేశారు.

2024-05-07T11:33:48Z dg43tfdfdgfd