వేసవిలో నీరసాన్ని దూరం చేసే 7 బెస్ట్ నేచురల్ ఫుడ్స్..

ఈ సమ్మర్ సీజన్‌లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఎండలు, వడగాలులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా వేసవిలో వేడి వాతావరణం శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇది పోషకాల లోటుకు కారణమై డీహైడ్రేషన్‌ ముప్పును పెంచుతుంది, ఆలసటకు కారణమవుతుంది. అందుకే వేసవిలో తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెంచే పదార్థాలు తినాలి. ముఖ్యంగా కొన్ని పోషకాలు సమృద్ధిగా లభించే హెల్తీ ఫుడ్స్ డైట్‌లో చేర్చుకోవాలి. అవేంటంటే..

* డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్స్, కోకో వంటి వాటిల్లో కెఫిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది ఘాటైన రుచిని అందిస్తుంది. పొట్ట సంతృప్తి భావనను పెంచుతుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

* ఓట్‌మీల్

ఓట్‌మీల్ అనేది ఒక రకమైన తృణధాన్యం. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బీటా-గ్లూకాన్, అమైలోజ్ వంటి పోషకాలు రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తాయి. వేసవిలో శరీరంలో ఎనర్జీ లెవల్స్‌ను భర్తీ చేస్తాయి.

* కాఫీ

వేసవిలో అలసటను తగ్గించడంలో కాఫీ కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో కెఫిన్ ఉంటుంది. ఇది మెదడును ప్రేరేపిస్తుంది. దీంతో శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. అయితే కాఫీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి హానికారం. ఇది వేసవిలో డీహైడ్రేషన్ ముప్పు ఉంటుంది.

* చేపలు

సాల్మన్, ట్యూనా వంటి ఫ్యాటీ చేపలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వేసవిలో శరీరం శక్తివంతం కావడానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఈ చేపల్లో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. ఇది మెటబాలిజాన్ని, అలాగే శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెంచుతుంది. తద్వారా అలసటను తగ్గిస్తుంది. ఫ్యాటీ చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ పోషకాలు మెదడు పనితీరును మెరుగుపర్చుతాయి. శరీరంలో శక్తిని పెంచి రోగనిరోధకవ్యవస్థను బలోపేతం చేస్తాయి.

* గ్రీన్ లీఫీ వెజిటబుల్స్

సమ్మర్‌లో పాలకూర, బ్రకోలి, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, క్యారెట్, బీట్‌రూట్ వంటి కూరగాయలను తరచుగా తినాలి. వీటిలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. వేసవిలో చెమట రూపంలో పోయే పోషకాలను ఇవి భర్తీ చేస్తాయి. శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.

* యాపిల్

సమ్మర్‌లో తినాల్సిన పండ్లలో యాపిల్ ఒకటి. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ఐరన్, విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు ఉండటంతో యాపిల్స్ స్థిరమైన శక్తిని అందిస్తాయి. వీటిలో ఉండే పాలీఫెనాల్ క్వెర్సెటిన్ శరీర మంటను నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి, అవసరమైన ఎనర్జీ లెవల్స్‌ను శరీరానికి అందిస్తుంది.

* గుడ్లు

వేసవిలో గుడ్లు తింటే శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్‌ గుడ్లలో పుష్కలంగా ఉంటాయి. ప్రొటీన్ కంటెంట్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. ఇవి శరీరంలో ఎనర్జీ లెవల్స్‌ను బ్యాలెన్స్‌డ్ చేస్తాయి. కండరాలను బలోపేతం చేస్తాయి. పోస్ట్-వర్కౌట్ కండరాల ప్రోటీన్ పునర్నిర్మాణాన్ని ప్రోత్సహిస్తాయి.

* చికెన్

స్కిన్‌లెస్ చికెన్‌లో లీన్ ప్రొటీన్ కంటెంట్ పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరానికి అవసరమైన శక్తిని పెంపొందిస్తుంది. పొట్ట సంతృప్త లెవల్స్‌ను పెంచుతుంది. అందుకే వేసవిలో చికెన్‌ను తరచుగా తినాలి.

* హైడ్రేట్‌గా ఉండటం

వేసవిలో శరీరం ఎనర్జిటిక్‌గా ఉంచుకోవడంతో పాటు హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. అందుకు నీటితో పాటు హెల్తీ కూల్‌డ్రింక్స్ తాగాలి. వాటర్ కంటెంట్ అధికంగా ఉండే పుచ్చకాయ, కర్భూజ, మామిడి వంటి పండ్లను డైట్‌లో చేర్చుకోవాలి. దీంతో అవసరమైన పోషకాలు అంది శరీరం ఎనర్జిటిక్‌గా ఉంటుంది.

2024-04-24T11:58:42Z dg43tfdfdgfd