శత్రు గ్రహాల కలయికకు ముగింపు..ఈ 4 రాశుల దరిద్రం వదిలింది..ఇక అంతా శుభమే..!

జ్యోతిష్యం ప్రకారం.. గ్రహాలు, నక్షత్రాల గమనం అనేది సాధారణ విషయం. ఈ క్రమంలో కొన్ని గ్రహాలు సంయోగం చెందుతాయి. అంటే ఒకే రాశిలో వివిధ గ్రహాలు సంచరిస్తాయి. దీని ప్రభావం వివిధ రాశులపై పడుతుంది. కొన్ని రాశులపై సానుకూల ప్రభావం ఉంటే, మరికొన్నింటిపై నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ముఖ్యంగా శని సంచారం కారణంగా అన్ని రాశులు ప్రభావితం అవుతాయి.(ప్రతీకాత్మక చిత్రం)
గ్రహ సంయోగాలు కొంత సమయం వరకు క్రమానుగతంగా సంభవిస్తాయి, నిర్దిష్ట కాలం తర్వాత ముగుస్తాయి. అయితే కొన్ని సంయోగాలు ఒక గ్రహంతో మరొకటి శత్రు సంబంధాలను ఏర్పరచుకుంటాయి. ఇటీవల కుంభ రాశిలో ఏర్పడిన శని, సూర్యుని కలయిక ఇలాంటిదే. ఇది శత్రుత్వ సంబంధాన్ని సృష్టించిందని పండితులు విశ్లేషించారు. అయితే ఈ సంయోగ ప్రభావం మార్చి 14న ముగిసింది. సూర్య దేవుడు ఇప్పుడు మీన రాశిలోకి ప్రవేశించాడు. దీని వల్ల మూడు రాశుల వారు ఊహించని ధనలాభాలతో పాటు ఇతర ప్రయోజనాలను పొందుతారు. ఈ అదృష్ట రాశులు ఏవో ఇక్కడ చూడండి.(ప్రతీకాత్మక చిత్రం)
మకర రాశి : మకర రాశి వారికి ఈ సమయం చాలా మంచిది. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శని, సూర్యుని కలయిక ముగియడంతో ఈ రాశిచక్రం సంపద వృద్ధి చెందుతుంది. వీరికి ఆకస్మిక ధనలాభాలు రావచ్చు. వీరికి పట్టిన దరిద్రం వదులుతుంది. మీ స్నేహపూర్వక ప్రభావం ఎదుటి వారిని ఆకట్టుకుంటుంది. కుటుంబంలో ఏదైనా వివాదాలు ఉంటే, దాని నుంచి కూడా ఉపశమనం పొందుతారు.(ప్రతీకాత్మక చిత్రం)
మేష రాశి : సూర్యుడు, శని సంయోగం ముగిసిపోవడంతో మేష రాశి వారి ఇబ్బందులు తొలగిపోతాయి. వీరికి ఈ ఘటన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. శని దేవుడి నుంచి సూర్య దేవుడు విడిపోవడం, మేష రాశి వారికి చాలా మంచి ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది. మీ సోషల్ సర్కిల్ పెరుగుతుంది. సమాజంలో మీ పట్ల గౌరవం, అభిమానం కూడా పెరుగుతాయి. వ్యాపారాలు చేసే వారికి లాభాలు పెరుగుతాయి. ప్రత్యేకించి విదేశాల్లో వ్యాపారాలు ఉన్నవారికి లేదా ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేసే వారికి అన్నీ కలిసివస్తాయి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం, ఈ ఇన్వెస్ట్‌మెంట్ దీర్ఘకాలంలో మీకు మంచి లాభాలను అందిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
కుంభ రాశి : కుంభ రాశి వారి వ్యక్తిత్వాన్ని ప్రస్తుత పరిస్థితులు మెరుగుపరుస్తాయి. శని, సూర్యుల శత్రుత్వ ప్రభావం తగ్గడంతో, వ్యాపారాలు చేసే కుంభ రాశి వారికి లాభాలు పెరుగుతాయి. వ్యక్తిగత ఆదాయం సైతం వృద్ధి చెందుతుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి ఏదైనా ప్లాన్ వేస్తే, అది కచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆస్తి కొనుగోలుకు ఇది మంచి సమయం. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. పెళ్లి చేసుకోవాలనుకునే వారికి వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి.(ప్రతీకాత్మక చిత్రం)
వృషభ రాశి : ఈ రాశి వారికి మంచి రోజులు మొదలయ్యాయి. ఇప్పటి వరకు చేసిన ఖర్చు ఇప్పుడు నియంత్రణలోకి వస్తాయి. అనవసర, వృథా ఖర్చులు తగ్గుతాయి. మీరు మరింత డబ్బు ఆదా చేసుకోగలుగుతారు. పరిస్థితుల ప్రభావంతో మీ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు ఊహించని విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.(ప్రతీకాత్మక చిత్రం)

2024-03-28T11:43:55Z dg43tfdfdgfd