శనగపిండిలో వీటిని కలిపి ప్యాక్ వేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది..

చర్మాన్ని కాంతివంతంగా కనిపించేందుకు ఫేషియల్స్ హెల్ప్ చేస్తాయి. ఇంట్లోనే తయారుచేసే ఓ ఫేషియల్ గురించి తెలుసుకోండి.

పెరిగిన ఎండల కారణంగా చర్మం, జుట్టు ఆరోగ్యం దెబ్బతిని అందవిహీనంగా మారతాయి. ఇలాంటి వాతావరణంలో హెయిర్, స్కిన్ కేర్ అవసరం. ఎండల కారణంగా చాలామందికి మొటిమలు, ముఖ రంగు తగ్గడం వంటి అనేక స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనికి ఎండతో పాటు దుమ్ము కూడా కారణంగా వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే ఇంట్లోనే చక్కగా తయారుచేసుకునే ఫేస్‌ప్యాక్ అవసరం. అది ఎలా తయారు చేయాలి. ఏమేం పదార్థాలు కావాలో తెలుసుకోండి. శనగపిండి..

అందాన్ని పెంచడంలో శనగపిండి చాలా బాగా పనిచేస్తుంది. ఇది చనిపోయిన చర్మకణాలను తొలగించడంలో సాయపడుతుంది. ఇందులోని అనేక భాగాలు చర్మానికి ఎన్నో బెనిఫిట్స్‌ని అందిస్తాయి. శనగపిండిలో జింక్ ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా చేసి కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. ఇందులోని ప్రత్యేక గుణాలు చర్మంపై స్క్రబ్‌లా పనిచేస్తాయి.

అందాన్ని పెంచే ఫేస్ స్క్రబ్..​ ​

పెరుగు..

చర్మాన్ని కాపాడేందుకు పెరుగు కూడా చాలా బాగా పనిచేస్తుంది. పెరుగు చర్మ pH బ్యాలెన్స్‌ని మెరుగ్గా చేస్తుంది. ఇందులోని లాక్టిక్ యాసిడ్ చర్మానికి మేలు చేస్తుంది. మృతకణాలని తొలగించి చర్మాన్ని మృదువుగా మార్చడంలో పెరుగు హెల్ప్ చేస్తుంది. ఇందులోని తేమశాతం చర్మాన్ని పొడిబారకుండా చూస్తుంది. దీని వల్ల చర్మానికి పోషణ అందుతుంది. ​Also Read : వారానికి ఓ సారి కొబ్బరినూనె రాసి స్నానం చేస్తే ఈ సమస్యలన్నీ దూరం..

కాఫీ..

కాఫీ పౌడర్ కూడా చర్మంపై మంచి స్క్రబ్‌లా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ అనేక చచర్మ సమస్యల్ని దూరం చేస్తాయి. కాఫీ పొడి చర్మం కాంతివంతంగా, మృదువుగా మారడానికి హెల్ప్ చేస్తుంది. నేడు చాలా బ్యూటీ ప్రోడక్ట్స్‌లో కాఫీని వాడతారు. ఇందులోని నేచురల్ గుణాలు చర్మ రంగుని మెరుగ్గా చేస్తాయి.

పసుపు..

చర్మ సంరక్షణలో పసుపు కూడా కీ రోల్ పోషిస్తుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్ని కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి తెల్లని రంగుని పెంచుతాయి. పసుపులోని కర్కుమిన్ చర్మంలో అదనపు మెలనిన్ ఉత్పత్తిని తగ్గించేందుకు హెల్ప్ అవుతుంది. జిడ్డు చర్మానికి పసుపు చాలా మంచిది. ​Also Read : ఇంట్లోనే తయారు చేసే ఈ ఉబ్టాన్ ఫేస్‌‌మాస్క్‌తో మీ ముఖం మెరిసిపోద్ది..

ప్యాక్ ఎలా తయారు చేయాలంటే..

ఈ మాస్క్ కోసం ఓ చెంచా శనగపిండిలో 1 టీ స్పూన్ కాఫీ పౌడర్ అవసరం అవుతుంది. అందులో చిటికెడు పెరుగు వేయండి. దీనిని ప్యాక్‌లా చేసి ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత క్లీన్ చేయండి. దీని వల్ల చర్మం కాంతివంతంగా మారి బ్లాక్ హెడ్స్ దూరమవుతాయి. గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Beauty News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-16T09:25:30Z dg43tfdfdgfd