శరీరంలో ఐరన్ లోపం ఉందా!.. ఈ రెండు తినండి చాలు..

శరీరం తన విధులను సక్రమంగా నిర్వహించాలంటే సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా అందాలి. అలాంటి వాటిలో ఐరన్ ఒకటి. శరీరానికి ఐరన్ అందితే హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. దీన్ని ఐరన్ ప్రొటీన్‌గా పేర్కొంటారు. ఇది రక్తం నుంచి శరీర కణజాలాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఉంటే, హిమోగ్లోబిన్ లెవల్స్ పడిపోతాయి. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. దీంతో అలసట, బలహీనత, మైకం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐరన్ లోపాన్ని అధిగమించాలంటే ఎలాంటి ఆహారాలు తినాలి, ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకోండి.

* మునగాకు

సాధారణంగా మునక్కాయల కంటే మునగాకులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పాలకూరతో పోలిస్తే మునగాకులో 28 మి.గ్రా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటితో జ్యూస్ చేసుకొని తాగవచ్చు లేదా వండుకుని తినవచ్చు. లేకపోతే ఇతర వంటకాల్లో యాడ్ చేయవచ్చు. ఐరన్ లోపంతో బాధపడేవారు మునగాకులు తింటే, సమస్య దూరమై హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి పెరుగుతుంది.

* సీడ్స్

వివిధ రకాల నట్స్, సీడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడికాయ, చియా, ఫ్లాక్స్ వంటి విత్తనాల్లో ఐరన్, ఫోలేట్, జింక్‌, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని సలాడ్స్, ఓట్‌మీల్‌, స్మూతీస్‌లో కలిపి తీసుకోవచ్చు. దీంతో శరీరంలో ఐరన్ లోపం తగ్గుతుంది, రక్తంలో హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి.

* గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, సిట్రస్ ఫ్రూట్స్

రక్తంలో ఫోలిక్ యాసిడ్ లోపం కారణంగా రక్తహీనత ఏర్పడితే తాజా ఆకు కూరలతో ఆ సమస్యకు చెక్ చెప్పవచ్చు. పాలకూరలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. నారింజ, నిమ్మ, ద్రాక్ష, బత్తాయి వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి కంటెంట్ ఉంటుంది. శరీరం ఐరన్ గ్రహించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. స్విస్‌చార్డ్, కొల్లార్డ్ గ్రీన్స్ వంటివాటిల్లో విటమిన్ సి, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అందుకే ఈ ఆకుకూరలు, కూరగాయలు, సిట్రస్ పండ్లను డైట్‌లో చేర్చుకుంటే శరీరానికి అవసరమైన ఐరన్ కంటెంట్ లభిస్తుంది, రక్తహీనతకు చెక్ చెప్పవచ్చు.

* దుంపలు

బంగాళదుంపలు, బీట్‌రూట్, చిలకగదుంపలు వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఐరన్ కంటెంట్‌తో పాటు రాగి, భాస్వరం, మెగ్నీషియం, విటమిన్ B1, B2, B6, B12, విటమిన్ సీ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ దుంపలను డైట్‌లో చేర్చుకుంటే శరీరంలో ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ప్రేరేపించే హిమోగ్లోబిన్ లెవల్స్‌ పెరుగుతాయి.

* రాగి పాత్రలు

ఒకప్పుడు మన జీవనవిధానంలో రాగి పాత్రలు భాగంగా ఉండేవి. స్టీల్ పాత్రలు అందుబాటులోకి వచ్చాక వీటి వినియోగం తగ్గింది. అయితే రాగి పాత్రల్లో నీరు నిల్వ ఉంచి తాగడం మంచిది. PharmEasy వెబ్‌సైట్ ప్రకారం.. దీనివల్ల శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి పెరిగి, ఆహారం సులభంగా విచ్ఛిన్నం అవుతుంది. ఫలితంగా శరీరం ఐరన్‌ను ఎక్కువగా శోషించుకుంటుంది. రాగి ఒక ముఖ్యమైన ట్రేస్ మెటీరియల్. కొన్ని హెమటోలాజికల్ కండిషన్స్‌ను నివారించడానికి ఇది శరీరానికి అవసరం అవుతుంది.

2024-05-03T13:19:24Z dg43tfdfdgfd