శ్రీశైలం శివయ్య క్షేత్రంలో వైభవంగా రామయ్య కళ్యాణం..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవశక్తి పీఠం రెండవ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలు కన్నుల పండవకొనసాగాయి. తెలుగువారి తొలి పండుగ ఉగాది తరువాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి. శ్రీమహావిష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని రామ నవమిగా జరుపుకుంటారు.

దేశవ్యాప్తంగా కూడా శ్రీరామ నవమి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయోధ్య రాజు దశరథ మహారాజు రాణి కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించిన శుభ సందర్భమే శ్రీరామ నవమి.దేవస్థానానికి అనుబంధ అలయమైన ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ఉదయం నుండి శ్రీసీతారామస్వామికి శ్రీప్రసన్నాంజనేయస్వామికి విశేష పూజలు నిర్వహించి పూజలనంతరం శ్రీసీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు.

కళ్యాణోత్సవానికి ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పం పాటించి కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ,వృద్ధి అభ్యుదయాలను కాంక్షిస్తూ పుణ్యాహవాచనం,కంకణపూజ,యజ్ఞోపవీత పూజ,నూతన వస్త్ర సమర్పణ,వరపూజ, ప్రవర పఠన, మాంగల్య పూజ, శ్రీసీతాదేవికి మాంగల్య ధారణ,తలంబ్రాలు, మొదలైన కార్యక్రమాలతో శాస్త్రోక్తకంగా సాంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.

సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని దేవస్థానం అధికారులు,సిబ్బంది స్థానికులు భక్తులు తిలకించారు. అనంతరం దేవస్థానం భక్తులకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ తీర్థ ప్రసాదాలను అందజేశారు. భూకైలాసంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో సాక్షాత్తు ఆ పరమశివుడే స్వయంగావెలిసి భక్తులు కోరిన కోరికలు తీర్చే భగవంతుడికి నీవే అంటూ పూజలు చేశారు. కొలిచిన వారికి జీవితంలో అనుకున్నవన్నీ నెరవేర్చుతారని నమ్మకం.సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగి సుఖ సంతోషాలతో విరాజిల్లుతారని భక్తులు విశ్వసిస్తుంటారు.

---- Polls module would be displayed here ----

అలాంటి శివయ్య క్షేత్రంలో ప్రతి ఏటాశ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా శ్రీశైలం ఆలయానికి అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో కొలువైనశ్రీరామచంద్ర ప్రభు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

2024-04-17T14:49:26Z dg43tfdfdgfd