సమ్మర్ లో బీట్ రూట్ జ్యూస్ ఎందుకు తాగాలి..?

కానీ కాస్త కష్టమైనా ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు జరుగుతాయి అని నిపుణులు  చెబుతున్నారు. మరి.. ఈ ఎండాకాలం బీట్ రూట్ జ్యూస్ తాగితే కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం..

ఈ ఎండాకాలంలో మనం బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. దాని కోసం  ఎక్కువగా వాటర్ తాగుతూ ఉంటాం. అయితే.. వాటర్ తో పాటు.. కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, పలు పండ్ల రసాలు తాగుతూ ఉంటాం. అయితే..వీటితో పాటు.. సమ్మర్ లో కచ్చితంగా మనం ఒక జ్యూస్ తాగాలి. అదే బీట్ రూట్ జ్యూస్.

నిజానికి పండ్ల రసాలు తాగినంత ఇష్టంగా బీట్ రూట్ జ్యూస్ తాగలేం. కానీ కాస్త కష్టమైనా ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు జరుగుతాయి అని నిపుణులు  చెబుతున్నారు. మరి.. ఈ ఎండాకాలం బీట్ రూట్ జ్యూస్ తాగితే కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం..

బీట్ రూట్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఒత్తిడిని తగ్గించడంలో సహాయం చేస్తుంది. అంతేకాదు.. ఈ ఎండాకాలం ఉదయం లేచే సరికి ఫేస్ అంతా ఉబ్బినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. దానిని కూడా ఈ బీట్ రూట్ జ్యూస్ తగ్గిస్తుంది.

అంతేకాదు.. రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే..బాడీ లోని టాక్సిన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెటబాలిజం మెరుగుపరుస్తుంది. మండే ఎండల్లో శరీరానికి ఊరట కలిగిస్తుంది.

 

మనం సాధారణంగా ఎండకాలం ఎక్కువ సేపు వ్యాయామాలు చేయలేం. అందుకే బాడీ సహకరించదు. కానీ.. ఈ ఎండల్లోనూ ఎలాంటి యాక్టివిటీ చేసినా అలసిపోకుండా ఉండేలా చేయడంలో ఈ బీట్ రూట్ జ్యూస్ సహాయం చేస్తుంది. మన పర్ఫార్మెన్స్ , స్టామినా పెంచుతుంది.

బీట్ రూట్ లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరానికి అందిస్తుంది. అంతేకాకుండా.. ఎండల ద్వారా వచ్చే నీరసాన్ని తగ్గించి.. తక్షణ ఎనర్జీని అందిస్తుంది.

ఈ ఎండల్లో బాడీని హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ బీట్ రూట్ జ్యూస్ లో పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరానికి  ఎనర్జీ అందించే ఎలక్ట్రో లైట్స్ కూడా ఉంటాయి.

 

అంతేకాదు.. ఈ బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల మన అందం కూడా రెట్టింపు అవుతుంది.  సన్ వల్ల జరిగే స్కిన్ డ్యామేజ్ ని తగ్గిస్తుంది.  ఇందులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మం అందంగా కనిపించడంలో సహాయం చేస్తుంది. మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవ్వడంలోనూ సహాయం చేస్తుంది.

2024-04-27T04:20:05Z dg43tfdfdgfd