సమ్మర్ లో రోజుకు ఎన్ని సార్లు ముఖం కడగాలో తెలుసా?

మండే ఎండల వల్ల రోజుకు ఏడెనిమిది సార్లైనా ముఖాన్ని కడుగుతుంటారు చాలా మంది. కానీ రోజుకు ఎన్ని సార్లు పడితే అన్ని సార్లు ముఖం కడిగితే ముఖ చర్మం దెబ్బతింటుంది. అందుకే ఎండాకాలంలో రోజుకు ఎన్ని సార్లు ముఖం కడగాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

చలికాలం లేదా ఎండాకాలంలో చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చర్మాన్ని బాగా శుభ్రంగా ఉంచుకోవాలి. అందంగా ఉండాలని, జిడ్డును పోగొట్టాలని చాలా మంది రోజుకు ఏడెనిమిది సార్లైనా సబ్బుతో ముఖాన్ని కడుగుతూనే ఉంటారు. కానీ ఇలా కడగడం చర్మ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. నిపుణుల ప్రకారం.. చర్మ రకం, జీవనశైలిని బట్టి రోజుకు రెండు లేదా మూడు సార్లు ఫేస్ వాష్ తో కడగాలి. అలాగే ఒకసారి గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి.

రోజుకు ఎన్నిసార్లు ముఖం కడుక్కోవాలి

మొదటి సారి— నిద్రలేచినప్పుడు 

నిపుణుల ప్రకారం.. నిద్రలేవగానే ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది రాత్రిపూట మీ చర్మం విడుదల చేసే నూనెలు, మీ ముఖంపై ఉండే టాక్సిన్స్, దిండు వల్ల అంటుకున్న దుమ్మును తొలగిస్తుంది.  

 

రెండోసారి-  మేకప్ వేసుకోవడానికి ముందు 

మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, మేకప్ వేసుకునే ముందు మీ ముఖాన్ని మళ్లీ కడగాలి. అలాగే మీరు జిమ్ కు వెళ్లినట్టైతే లేదా ఆయిలీ స్కిన్ ఉంటే ఫేస్ వాష్ తో శుభ్రం చేయండి. లేదా సాధారణ, పొడి, సున్నితమైన చర్మం ఉంటే నార్మల్ వాటర్ తో కగడండి. 

 

మూడో సారి - సాయంత్రం 5 గంటలకు 

మూడోసారి రోజువారి మేకప్, దుమ్ము, కాలుష్యం, చెమట మొదలైన వాటిని వదిలించుకోవడానికి ఉపయోగడపడుతుంది. ఈ సమయంలో ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. మీరు మేకప్ ఉపయోగించినా, ఆరు బయట పనిచేస్తున్నా, ఆయిలీ స్కిన్ ఉన్నా లేదా పగటిపూట చెమట ఎక్కువగా పట్టినా.. క్లెన్సింగ్ బామ్ లేదా సూపర్ మైల్డ్ క్రీమీ ఎక్స్ఫోలియేటర్ ను ఉపయోగించి చర్మాన్ని శుభ్రం చేయొచ్చు.

 

నాల్గో సారి-పడుకునే ముందు

రాత్రి పడుకునే ముందు కూడా ముఖాన్ని కడగాలి. ఈ టైంలో మీరు మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. 

ముఖాన్ని తరచుగా కడుక్కోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

రెగ్యులర్ స్కిన్ క్లెన్సింగ్ దుమ్ము, నూనె, మలినాలు, క్రిములు, చనిపోయిన చర్మ కణాలు,  మొటిమలు వంటి చర్మ సమస్యలకు దారితీసే ఇతర మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది. ముఖాన్ని కడగడం వల్ల చర్మానికి తాజా రూపం ఏర్పడుతుంది. అలాగే చర్మ సంరక్షణ ఉత్పత్తులు చర్మంలోకి సరిగ్గా బాగా వెళతాయి. క్రమం తప్పకుండా ముఖాన్నిశుభ్రం చేయడం వల్ల అదనపు నూనెల ఉత్పత్తి తగ్గుతుంది. 

 

చర్మాన్ని బాగా హైడ్రేట్ గా ఉంచడానికి మంచి మాయిశ్చరైజర్ ఉపయోగించి ప్రతిరోజూ ముఖాన్ని కడగాలని నిపుణులు చెబుతున్నారు. తగినంత ఆర్ద్రీకరణ చర్మ ఎరుపు, పొడి, చికాకును కలిగిస్తుంది. మీ చర్మం వృద్ధాప్యంగా కనిపిస్తుంది. మీ చర్మ రకాన్ని బట్టి సరైన ఫేస్ వాష్ లేదా ఫేషియల్ క్లెన్సర్లను ఉపయోగించుకోండి. ఏదైనా ఉత్పత్తిని ఉపయోగించే ముందు ముందుగా చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం మంచిది. 

2024-05-05T04:51:27Z dg43tfdfdgfd