సమ్మర్‌లో సుర్రుమంటోందా? ఈ ఫారెస్ట్‌కి వచ్చేస్తే అంతా కూల్ కూల్

కర్నూలు సిటిలో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇది. ఎండాకాలంలో చల్లగా ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు అనువైన ప్రదేశం నగర వనం. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో పాఠశాలలు,కళాశాలలు సెలవుల నేపథ్యంలో ప్రతి రోజు ఇంట్లో కూర్చోవాలి అంటే ఇబ్బందే. అలా అని ఎక్కడికైనా పర్యాటక ప్రదేశాన్ని సందర్శించాలన్న బయట ఎండలు మాములుగా లేవు. కాదని బయటికి వెళ్తే మాత్రం ఏరి కోరి రోగాలు తెచ్చుకునట్లే. కానీ పిల్లల సరదా తీర్చాలి అంటే మాత్రం దగ్గరలోని ఏదో ఒక పార్క్ లేదా పర్యాటక ప్రదేశానికి వెళ్లి తీరాల్సిందే.

అది కూడా కేవలం అర గంటలో వెళ్లే టూరిస్ట్ ప్లేస్ ఉంటే మాత్రం అంతకన్నా అదృష్టం ఇంకోటి ఉండదు.ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ప్రజలకు ఒక బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అందుబాటులో ఉంది. కర్నూల్ పట్టణానికి కూసింత దూరంలో ఉన్నా సిటీ ఫారెస్ట్ నగర వనం ప్రస్తుతం అందరి చూపులను ఆకర్షిస్తుంది. కర్నూల్ పట్టణానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సిటీ ఫారెస్ట్ కు 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. కర్నూల్ నగర అందాలను మరింత పెంచే విధంగా ఈ సిటీ ఫారెస్ట్ ను కర్నూల్ సిటీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరింత అందంగా తీర్చిదిద్దింది.

Tirupati Trains: తిరుపతి వెళ్లేవారికి అలర్ట్... ఈ రైళ్ల దారి మళ్లింపు... కొత్త రూట్ ఇదే

సిటీ ఫారెస్ట్ 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. చుట్టూ పచ్చదనం ఎత్తైన చెట్లు ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు అనువైన ప్రదేశం కుటుంబంలోని చిన్న పెద్ద పిల్లలతో కలిసి సరదాగా గడపడానికి బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ గా పేరుపొందింది. ఈ సిటీ ఫారెస్ట్ లో ముఖ్యంగా వాకింగ్ చేయడానికి అదే విధంగా ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి అనువైన ప్రదేశంగా భావించొచ్చు. అంతేకాకుండా ఈ సిటీ ఫారెస్ట్ లో 7 టెంట్ హౌస్ లో టవర్ పాయింట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఈ సిటీ ఫారెస్ట్ లో ఉన్న టవర్ పాయింట్ ఎక్కి చూస్తే మాత్రం ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఫారెస్ట్ ఏరియా అంతా ఇట్టే చూడొచ్చు. అంతేకాకుండా చిన్న పిల్లలకు ఆడుకునేందుకు ఉయ్యాలలో పార్క్ ఏరియా, అదే విధంగా స్నాక్స్ ఐస్ క్రీమ్స్ ఇలా అన్ని ఏర్పాటు చేశారు. వీటితోపాటు బోట్ షికార్ చేసేందుకు వీలుగా నగరవనం ముందే ఒక పెద్ద చెరువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చెరువులో బోట్ షికారు చేస్తూ ఇతర దేశాల నుంచి వచ్చే పక్షులను చూడొచ్చు.

విశాఖ తీరంలో గోవా సీన్... ఈ సమ్మర్‌లో మీరు అస్సలు మిస్ అవొద్దు

ఇలాంటి అందమైన అనువైన ప్రదేశం కర్నూల్ సిటీకి దగ్గరలో ఉండడంతో పర్యాటకుల సైతం ఆసక్తి చూపుతున్నారు. ఈ సిటీ ఫారెస్ట్ ను సందర్శించేందుకు ఎంట్రీ టిక్కెట్లు తీసుకోవాల్సి ఉంటుంది.చిన్నపిల్లలకు 20 రూపాయలు, పెద్దవారికి 40 రూపాయల చొప్పున టిక్కెట్టు తీసుకోవాల్సి ఉంటుంది.

2024-05-01T05:10:22Z dg43tfdfdgfd