సమ్మర్ స్పెషల్ ఫుడ్.. మీ ఇంట్లోనే తయారు చేసుకోండిలా!

ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం అలవాటుగా మారింది. ఇంట్లో చేసుకోవడం వీలుగా లేకుంటే బయట వెళ్ళి తింటు ఉంటాం. ఎక్కువగా ఇడ్లీ, దోశ, వడ ఇలా ఏది మనసుకు నచ్చితే అది తినడం అలవాటుగా మారిపోయింది. ఎందుకంటే అవి ఇంట్లో చేసుకోవడం కొద్దిగా కష్టంగా ఉండటం వలన బయట దొరికే టిఫిన్స్ బ్రేక్ ఫాస్ట్ గా అలవాటుగా మార్చుకున్నారు. కానీ కష్టపడకుండా చాలా సింపుల్ గా ఎన్నో లెక్కలేనన్ని పోషకాలు కూడిన ఆహారం చద్దన్నం.ఈ చద్దన్నం ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లా అలవాటు చేసుకోవడం వలన చలువ చేయడం తో పాటు లెక్కలేనన్ని పోషకాలు ఉన్నాయని మన పెద్దలు మనకు చెప్పిన మాటలు.
అయితే పూర్వం లో చద్దన్నం ఎక్కువగా తినే వారు మారుతున్న కాలం తో పాటు ఆహార పద్దతులు కూడా మారుత వచ్చాయి కానీ ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న కాలుష్యానికి అలాగే కల్తీ ఆహారాలు మారుతున్న వాతావరణం ఇంకా ఎన్నో కారణాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తుండటం తో మళ్ళీ పాత పద్ధతులను పాటించడం కోసం పాత పద్ధతులను పాటిస్తున్నారు.
ఏమాటకి ఆ మాట చెప్పుకోవాలి అంటే పూర్వం ఆహార పద్ధతుల్లో ఏది కావాలన్నా సొంతంగా తయారీ చేసుకుని తినేవారు. వాటిలో ఉన్న ప్రోటీన్స్ ఇప్పుడు మెషినరీ కాలం లో తయారు అయ్యే వాటిలో ఉండవని అంటున్నారు. ఇక చద్దన్నం ఎలా చేయాలి.. వాటిలో ఉండే ప్రోటీన్స్ ఏంటి.. అనే విషయాలు పెద్దపల్లి జిల్లా రామగుండం కు చెందిన మమత అనే గృహిణి పూర్తి వివరాలతో లోకల్ 18 కి తెలిపారు ఇప్పుడు చూద్దాము.
చద్దన్నం తయారు చేసుకోవడానికి ముందుగా మట్టి పాత్రను సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత వండుకున్న అన్నం ఆ మట్టి పాత్రలో వేసి వేసిన అన్నం మునిగేంత వరకు నీరు పోసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చటి పాలు కొన్ని, రెండు స్పూన్లు పెరుగు, కాస్త తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరిగి అన్నం పైన పెట్టుకోవాలి. ఇలా చేసిన తర్వాత మట్టి పాత్ర పై మూత వేసి ఉదయం వరకు ఉంచాలి.
ఇక ఉదయం మట్టి పాత్రలో చద్దన్నం తయారవుతుంది. దీన్ని ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లాగా అలవాటు చేసుకోవడం వల్ల లెక్కలేనన్ని ఉపయోగాలు ఉన్నాయని అంటే సర్వరోగ నివారిణి అని కూడా అంటారని వారు తెలిపారు.
చద్దన్నం తయారు చేసుకోవడం చాలా ఈజీ .చాలా సులువు. చద్దన్నం తయారు చేసుకోవాల్సిన పదార్థాలు ఇవి.. మట్టి పాత్ర, వండుకున్న అన్నం, పెరుగు, పాలు, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి.ఇవేనండి చద్దన్నానికి తయారు చేసుకోవాల్సిన పదార్థాలు. ఇవన్నీ కూడా రోజు మనం ఇంట్లో ఉపయోగించే పదార్థాలు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో చద్దన్నం చేసుకోవడం ప్రారంభించి ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తిని ఆరోగ్యాన్ని హెల్దిగా మార్చుకోండి.

2024-03-28T11:14:15Z dg43tfdfdgfd