సీతమ్మ తల్లి పలికిన ఒకే ఒక్క మాట.. సింధూరం పూసుకున్న హనుమంతుడు.. ఏమి జరిగిందో తెలుసుకుందాం

సింధూరం అంటే హిందూ సాంప్రదాయంలో ఒక భాగమని చెప్పవచ్చు. ఈ సింధూరాన్ని ధరించేందుకు భక్తులు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తుంటారు. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహానికి ప్రతీకగా సింధూరాన్ని భావిస్తుంటారు. అందుకే కాబోలు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సింధూరంతో స్వామివారికి పలు ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.‌ ఈ నేపథ్యంలో సింధూరంకు ఆంజనేయస్వామికి గల అనుబంధం,  సింధూరంతో ఆంజనేయ స్వామివారిని అలంకరించడానికి గల కారణమేమిటనే విషయాలను భద్రాచలం లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం ఆలయ అర్చకులు ఎస్.బి రవి కిరణ్, లోకల్ 18 కు వివరించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...

సీతమ్మ వారు ప్రతిరోజూ నిత్యం సింధూరాన్ని ధరించేవారు.‌ ఈ నేపథ్యంలో అమ్మవారిని ఆంజనేయులు ఒకరోజు అమ్మా... ప్రతిరోజూ సింధూరాన్ని ధరిస్తున్నారు ఎందుకమ్మా అని ప్రశ్నించారు.  సీతమ్మ తల్లి ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ... సౌభాగ్యానికి, సౌమాంగల్యానికి, శుభానికి ప్రతీకగా సింధూరం నిలుస్తుందన్నారు.

కష్టాల కడలితో పార్ట్ టైమ్ జాబ్.. బెస్ట్ మార్క్స్ సాధించిన ఇంటర్ విద్యార్థి !

అంతేకాకుండా సింధూరాన్ని ధరించడం శ్రీ రామచంద్రమూర్తికి అత్యంత ఇష్టం.  అందుకే నిత్యం నేను సింధూరాన్ని ధరిస్తున్నానని చెప్పారట. నాటి నుండి హనుమంతుడు సైతం శ్రీరామచంద్రమూర్తికి ఇష్టమైన సింధూరంను ఒంటినిండా పూసుకోవటం జరిగిందని అర్చకులు రవి కిరణ్ తెలిపారు.

Rice: ఆధార్ కార్డు చూపిస్తే కేవలం రూ.29కే బియ్యం.. త్వరపడండి!

అందుకే ఆంజనేయ స్వామి వారి ఆలయాలలో సింధూరంతో స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటామన్నారు. సింధూరం అంటే ఆంజనేయ స్వామికి ప్రీతి కావడంతో,  భక్తులు సైతం స్వామివారి అనుగ్రహానికి ప్రత్యేకగా సింధూరాన్ని ధరిస్తారు. అత్యంత ఇష్టమైన సింధూరపు వర్ణంలో ఉన్న దుస్తులనే ఆంజనేయస్వామి దీక్షాపర స్వాములు సైతం దీక్షా సమయంలో ధరిస్తారన్నారు. సాక్షాత్తు శ్రీరామచంద్రునికి ఇష్టమైన సింధూరపు రంగునే ఆంజనేయ స్వామి వారు తన ఇష్టమైన రంగుగా భావించి ధరించేందుకు,  అలంకరించుకునేందుకు ఇష్టపడుతుంటారని, అందుకే స్వామి వారి అభిషేక సమయంలో సైతం సింధూరంతో ప్రత్యేకంగా అలంకరించిన తర్వాత భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తామని అర్చకులు రవి కిరణ్ తెలిపారు.

2024-04-26T13:07:01Z dg43tfdfdgfd