స్కూల్ బ్యాగ్ చినిగిపోయిందా.. ఇక్కడకు వస్తే క్షణాల్లో కుట్టేస్తారు!

ఇంట్లో సరుకులు తీసుకురావడానికి, పిల్లలకి లంచ్ ప్యాక్ చేసి పంపేందుకు, ఆఫీస్ కి లంచ్ తీసుకెళ్లడానికి, పిల్లల స్కూల్ బుక్స్ పంపించడానికి ఒక బ్యాగు కావాలి. డబ్బులు ఊరికే రావు కదా అందుకే ఒకసారి బ్యాగ్ కొంటె కనీసం రెండేళ్లయినా ఉండాలని చూస్తారు. ముఖ్యంగా లంచ్ బ్యాగుల ఇంట్లోకి సరుకులు తీసుకొచ్చే బ్యాగుల విషయం లో క్వాలిటీ పై శ్రద్ద చూపిస్తుంటారు కదా.
అయితే ఇక్కడ ఎక్కడో తయారు చేసిన బ్యాగులు కాకుండా మన కళ్ళ ముందే తయారు చేస్తారుమనకి నచ్చిన విధముగా అనుకున్న సైజులో తయారు చేయించుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లక్ష్మి నగర్ వికె రెడ్డి స్వీట్స్ వెనకాల సుమారు 12 బ్యాగుల తయారీషాపులు గత 30 ఏళ్లుగా నిర్వహణ చేస్తున్నారు. ఇక్కడ నిర్వహించే బ్యాగుల తయారీ దారులు అందరూ 20 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన వారే కావడం విశేషం.
ఇంట్లోకి కానీ లేదా బయట అవసరాలకి ఉపయోగ పడడానికి మంచి గట్టిగామూడేళ్ల పాటు ఉండే బ్యాగ్ లు ఇక్కడ తయారు చేయబడతాయి. అవి కూడా మీరు అనుకున్న సైజులో మీ కళ్ళ ముందే వీరి వద్ద దొరికే బ్యాగ్ లు స్కూల్ బ్యాగ్స్, లంచ్ బ్యాగ్స్ క్యారీ బ్యాగ్స్, ముఖ్యంగా ఫోటో గ్రాఫర్స్ స్టాండ్‌కి అనువైన బ్యాగ్స్, కూరగాయలు కోసం ఉపయోగించే హ్యాండ్ బ్యాగ్స్ వంటివి తయారు చేసి ఇస్తారు. కొత్తవని కాకుండా పాతవి కూడా అతి తక్కువ ధరలకే చేసి ఇస్తారు.
గోదావరిఖని లక్ష్మి నగర్ బ్యాగుల కార్నర్ వద్ద దొరికే బ్యాగుల రకాలు వాటి బ్రాండ్లు ఇవే డస్ట్ ఫిల్టర్ బ్యాగులు, సింథటిక్ బ్యాగులు, కాన్వాస్ బ్యాగుల, రెడీ మేడ్ బ్యాగులు ఉంటాయి.
ఇక్కడ స్పెషల్ గా దొరికేవి మాత్రం యు.ఎస్.ఏ బ్యాగులు. ఇవి దొరికే హైలి బ్రాండెడ్ బ్యాగుల ఇవి. ఆర్డర్ చేసిన వారికి మాత్రమే తయారు చేసి ఇస్తారు. ఇక్కడ దొరికే బ్యాగుల ధరలు అతి తక్కువ లో ఉంటాయి.

2024-03-28T12:14:20Z dg43tfdfdgfd