స్లీప్ డివోర్స్ అంటే ఏంటి? భార్యాభర్తలు ఎందుకిలా చేస్తున్నారు?

సాధారణంగా భార్యాభర్తలు ఒకే చోట నిద్రిస్తారు. ప్రత్యేక సందర్భాలు, అవసరాలు వస్తే తప్ప వేర్వేరు గదుల్లో పడుకోరు. కానీ ఈ రోజుల్లో చాలా మంది జంటలు స్లీప్ డివోర్స్ (Sleep Divorce) లేదా "నిద్ర విడాకులు" అని పిలిచే ఒక కొత్త ధోరణిని అనుసరిస్తున్నారు. దీనర్థం ఏమిటంటే, ఆలుమగలు నాణ్యమైన నిద్ర కోసం లేదా వేర్వేరు వర్క్ షెడ్యూల్స్‌ కారణంగా వేర్వేరు గదుల్లో పడుకుంటున్నారు. అమెరికాలో మూడింట ఒక వంతు జంటలు మంచి నిద్ర కోసం స్లీప్‌ డివోర్స్‌ ఫాలో అవుతున్నారని ScientificAmerican.com వెబ్‌సైట్ తెలియజేస్తోంది. ఈ ట్రెండ్‌ ఇప్పుడు భారతదేశంలోని చాలా జంటలను ఆకట్టుకుంటోంది.

ఒకే బెడ్‌పై కాకుండా వేర్వేరు గదుల్లో ఎక్కువ కాలం పడుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య వైవాహిక సంబంధం చెడిపోదా? అనే ఆలోచన రావడం సహజం. ప్రముఖ మ్యాచ్‌మేకర్, రిలేషన్‌షిప్ కౌన్సెలర్ రాధిక మోహతా ఈ ప్రశ్నకు ఒక ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ ‘మనకు ఉన్న అత్యంత ముఖ్యమైన సంబంధం మనతో మనకి ఉన్న సంబంధమే. దాని తర్వాత మన ఇన్నర్ సర్కిల్‌లో ఉన్న వ్యక్తుల సంబంధాలు ముఖ్యమైనవి. చివరగా ప్రపంచంతో మనకున్న సంబంధాలకు ప్రాధాన్యం ఉంటుంది. మరింత శ్రద్ధగలవారిగా ఉండటానికి బాగా విశ్రాంతి తీసుకున్న మనస్సు, శరీరం కీలకం.’ అన్నారు.

స్లీప్‌ డివోర్స్‌ గురించి మాట్లాడుతూ, ‘వర్క్ షెడ్యూల్స్‌, గురక, సంరక్షణ బాధ్యతలు లేదా ఇతర కారణాల వల్ల రొమాంటిక్ పార్ట్‌నర్స్‌ వేర్వేరు గదుల్లో నిద్రించవచ్చు. ఇది వారి జీవితాన్ని సులభతరం చేస్తే, వారికి బాగా పనిచేస్తే, సమస్యలేమీ ఉండవు.’ అని స్పష్టం చేశారు. చాలా అధ్యయనాలు మంచి నిద్రతో అనేక ప్రయోజనాలు లభిస్తాయని చూపించాయి, వాటిలో కొన్ని చూద్దాం.

బ్రెయిన్ పవర్

మంచి నాణ్యమైన నిద్ర మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌, డెసిషన్‌ మేకింగ్‌ స్కిల్స్‌ మెరుగుపరుస్తుంది. బాగా నిద్రించినప్పుడు, మెదడు తగినంత విశ్రాంతి తీసుకుంటుంది. సమాచారాన్ని మరింత సమర్థవంతంగా ప్రాసెస్ చేస్తుంది.

మూడ్, ఎమోషనల్ వెల్-బీయింగ్

మంచి నిద్ర భావోద్వేగాలను, మానసిక స్థితిని నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నిద్రలేమి చిరాకు, మానసిక స్థితి మార్పులు, పెరిగిన ఒత్తిడికి దారితీస్తుంది. మంచి నిద్ర శారీరక ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ఇది గుండె జబ్బులు, మధుమేహం, స్థూలకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలానే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. గాయాలు, అనారోగ్యాల నుంచి త్వరగా కోలుకోవచ్చు.

లైఫ్ క్వాలిటీ

నాణ్యమైన నిద్ర చాలా రకాలుగా జీవితాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఎక్కువ కాలం జీవించగలం.

మెరుగైన ఆరోగ్యం

కంటి నిండా నిద్రపోతే శారీరక, మానసిక ఆరోగ్యం అభివృద్ది చెందుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనేక అధ్యయనాలు తగినంత నిద్రతో హృదయ జబ్బులు, మధుమేహం, స్థూలకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నాయి.

ప్రొడక్టివిటీ

క్వాలిటీ స్లీప్ మనకు ఎక్కువ శక్తిని ఇస్తుంది. ఫలితంగా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. తగినంత నిద్రపోయిన వారు పనిలో లేదా పాఠశాలలో మెరుగ్గా రాణిస్తారు, పూర్తి ఏకాగ్రతత లక్ష్యాలను సాధించగలుగుతారు.

2024-05-04T09:22:43Z dg43tfdfdgfd