4 DIY SUGAR SCRUBS: ముఖానికి నేచురల్‌ గ్లో అందించే 4 షుగర్‌ స్క్రబ్స్‌..

4 DIY Sugar Scrubs: ముఖానికి మెరుపు పెంచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. అయితే, ముఖానికి నేచురల్ గ్లో పెంచడానికి షుగర్ స్క్రబ్ వాడండి మ్యాజిక్ మీరే చూస్తారు. ఇది చర్మంపై పేరుకున్న డెడ్ స్కిన్ తొలగిస్తుంది. ముఖానికి నేచురల్ గ్లో ని అందిస్తుంది. ఎందుకంటే చక్కెరలో గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్‌ చేసి పొడిబారడాన్ని నివారిస్తుంది.

ముఖానికి సహజసిద్ధమైన మెరుపును అందించే 4 స్క్రబ్స్ ఏంటో తెలుసుకుందాం.

షుగర్, లెమన్..

నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి ముఖాన్ని మచ్చలేకుండా చేస్తాయి. చక్కెరతో నిమ్మకాయను కలిపితే మీ ముఖంపై మ్యాజికల్ గ్లో చూస్తారు. ఒక బౌల్‌లో రెండు స్పూన్ల చక్కెర వేసుకోండి. ఇప్పుడు తగినంత నిమ్మరసం కూడా వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్‌ చేసి ముఖానికి మసాజ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

గ్రీన్ టీ, షుగర్..

గ్రీన్‌ టీ లో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఉంటాయి. ఇవి చర్మ సంబంధిత సమస్యలకు చెక్‌ పెడతాయి. ఒక బౌల్‌ తీసుకుని అందులో ఒక చెంచా చక్కెర ఒక గ్రీన్‌ టీ బ్యాగ్  నాలుగు చుక్కల ఆలివ్ ఆయిల్ వేసకుని ముఖానికి స్క్రబ్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత ఫేస్ వాష్‌ చేయాలి.

ఇదీ చదవండి: వెలగపండులో వెలకట్టలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..

ఓట్స్..

ఓట్స్ సాధారణంగా నేచురల్ స్క్రబ్ మాదిరి పనిచేస్తుంది. ఇది చర్మంపై డెడ్ స్కిన్‌ ను తొలగిస్తుంది. ఒక బౌల్‌ తీసుకుని అందులో ఓట్స్, ఒక చెంచా చక్కెర, ఆలివ్ ఆయిల్ కలుపుకోవాలి. దీన్ని ముఖంపై స్క్రబ్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత ముఖానికి ఫేస్ వాష్‌  చేసుకోవాలి.

ఇదీ చదవండి: మామిడిపండ్లను తినబోయే ముందు నీళ్లలో ఎందుకు  నానబెట్టాలి?

ఆలివ్ ఆయిల్..

ఆలివ్ ఆయిల్ మంచి పోషకాలు ఉంటాయి. ఇది చర్మానికి మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. ఒక బౌల్‌ తీసుకుని అందులో ఆలివ్ ఆయిల్ అందులో చక్కెర తీసుకుని పేస్ట్‌ మాదిరి తయారు చేసుకోవాలి. చేతివేళ్లతో పది నిమిషాలపాటు మర్దన చేసుకుని ఫేస్ వాష్‌ చేయాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-04-24T04:55:49Z dg43tfdfdgfd