CLOVE TEA 5 BENEFITS: లవంగం టీ తాగుతున్నారా? మైండ్‌ బ్లాంక్‌ అయ్యే మిరకిల్స్..!

Clove Tea Health Benefits:  లవంగం మన వంటగదుల్లో కచ్చితంగా ఉండే ఓ మసాలా. ఇందులో మెడిసినల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. లవంగం మనం సాధారణంగా స్పైసీ వంటకాల్లో వినియోగిస్తాం. చికెన్, మటన్‌, బగారా రైస్ ఏదైనా వెజిటేబుల్ మసాలా కర్రీ వండుకున్నప్పుడు ఉపయోగిస్తాం. అయితే, ఈ మాసాలా గత ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నాం. జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారికి లవంగం ఎఫెక్టివ్ రెమిడీ. లవంగం మన డైట్లో చేర్చుకోవడం మేలు. కొంతమంది ఆరోగ్య నిపుణులు లవంగం రాత్రి పడుకునేటప్పుడు చేర్చుకోవాలని చెబుతారు. దీంతో గొంతునొప్పి, సీజనల్‌ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు.

ప్రతిరోజూ డైట్లో లవంగంతో తయారు చేసిన టీ తాగడం వల్ల కూడా అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. ఇది మీ డైలీ రొటీన్లో చేర్చుకోవడం మంచిది. ఈ మంచి అరోమా ఉండే డ్రింక్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణ ఆరోగ్యానికి మంచిది, వాపు సమస్యలకు చెక్ పెట్టి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. లవంగం టీ సహజసిద్ధమైన యాంటీ బ్యాక్టిరియల్ లాభాలు ఉంటాయి. ఇది పంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. లవంగం టీ తీసుకోవడం వల్ల తలనొప్పి సమస్య కూడా తగ్గిపోతుంది. లవంగం టీ మన డైట్లో చేర్చుకోవడం వల్ల కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

కేన్సర్..

లవంగం టీ ప్రతిరోజూ మన డైట్లో చేర్చుకుంటే కేన్సర్ కణాలు పెరగకుండా నివారిస్తాయి. ఎసోఫగైల్ కేన్సర్ సమస్యను తగ్గిస్తుంది. లవంగంలో యాంటీ కేన్సర్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. సాధారణ టీ కి బదులు ఈ లవంగం టీ ని మీ డైట్లో చేర్చుకోండి అద్భుతాలు మీరే చూస్తారు.

ఇదీ చదవండి: పిస్తా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా?

జీర్ణ ఆరోగ్యం..

లవంగాలు మన డైట్లో చేర్చుకుంటే ఇందులో ఉండే రకరకాల కెమికల్స్ కడుపులో పుండ్లను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.  గ్యాస్ట్రిక్‌ మ్యూకస్ మందంగా తయారు చేయడంలో లవంగాలు కీలకపాత్ర పోషిస్తాయి.  పెప్టిక్ కడుపు పుండ్లను నిర్మూలించడానికి లవంగం సహాయపడుతుంది.

వెయిట్‌ లాస్..

లవంగం బాడీ మాస్  తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. లవంగంలో సహజసిద్ధమైన ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో బరువు కూడా సులభంగా తగ్గిపోతారు.

ఇదీ చదవండి: ఇన్సులిన్ అంటే ఏమిటి? డయాబెటిక్ రోగులకు ఎప్పుడు? ఎందుకు అవసరమో తెలుసుకోండి..

కాలేయ ఆరోగ్యం..

లవంగంలో యూకలిప్టస్ అంశాలు కనిపిస్తాయి. ఇవి యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటాయి. కాలేయ పనితీరుకు ఇది ఎంతో అవసరం. అంతేకాదు లవంగంలో ఉండే అస్కార్బిక్ యాసిడ్‌, బీటా సిటోస్టీరల్స్ కాలేయాన్ని డ్యామేజ్‌ కాకుండా కాపాడతాయి.

స్ట్రెస్‌..

లవంగాలు స్ట్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. విపరీతమైన పని బారంతో బాధపడేవారు లవంగం టీ ని డైట్లో చేర్చుకోవాలి. లవంగంలో యాంటీ ఆక్సిడెంట్లు గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిపై ఇంకా సరైన అధ్యయనాలు చేయాల్సి ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-04-26T07:33:50Z dg43tfdfdgfd