EGGS: గుడ్లు ఈ టైంలో తింటే మీ అంత ఆరోగ్యవంతులు మరొకరు ఉండరు..

రోజులో మొదటిసారి తినే ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్ అంటారు. అంటే అంతకు ముందు రాత్రి నుంచి కొనసాగుతున్న ఫాస్టింగ్ (ఉపవాసం) బ్రేక్ చేయడం అని అర్థం. ఉదయం తినే అల్పాహారంలో వివిధ రకాల పోషకాలు ఉన్న ఫుడ్స్ చేర్చుకోవాలి. అప్పుడే శరీరానికి శక్తి అందుతుంది.
అలాగే జీవ క్రియలకు అవసరమ్యే మైక్రో నూట్రియెంట్స్ ఉండే పదార్థాలను బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే, శరీరం వాటిని పూర్తిగా శోషించుకుంటుంది. అయితే పోషకాలకు పవర్ హౌస్‌గా పేరున్న గుడ్లను అల్పాహారంలో తినాలని నూట్రిషనిస్టులు చెబుతున్నారు.
గుడ్లను సూపర్ ఫుడ్స్‌ అంటారు. బ్యాలెన్స్‌డ్ డైట్‌లో ఇవి కచ్చితంగా ఉండాల్సిందే. వీటిలో చాలా రకాల పోషకాలు ఉంటాయి. తక్కువ ధరలో లభించే ప్రోటీన్ ఫుడ్‌ కాబట్టి, చాలామంది వీటిని తింటారు. బ్రేక్‌ఫాస్ట్‌లో ఉడకబెట్టిన గుడ్లు లేదా ఆమ్లెట్ తినవచ్చు. ఇంకా ఎలాగైనా అల్పాహారంలో చేర్చుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌లో ఎగ్స్ తింటే ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకుందాం.

బరువు తగ్గడం

గుడ్లు యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్లకు మంచి వనరులు. ఇవి వెయిట్ మేనేజ్‌మెంట్‌లో కీలకంగా పనిచేస్తాయి. గుడ్లలోని లీన్ ప్రోటీన్ జీవక్రియను (మెటబాలిజం) పెంచుతుంది, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, ఎముకలను బలపరుస్తుంది. అందుకే వెయిట్ లాస్ డైట్‌లో, ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌లో ఎగ్స్ ఉండాలి.

బరువు తగ్గడం

గుడ్లు యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్లకు మంచి వనరులు. ఇవి వెయిట్ మేనేజ్‌మెంట్‌లో కీలకంగా పనిచేస్తాయి. గుడ్లలోని లీన్ ప్రోటీన్ జీవక్రియను (మెటబాలిజం) పెంచుతుంది, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, ఎముకలను బలపరుస్తుంది. అందుకే వెయిట్ లాస్ డైట్‌లో, ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌లో ఎగ్స్ ఉండాలి.

రోగనిరోధక శక్తి

శరీరానికి అవసరమైన అన్ని, తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు గుడ్లలో లభించే ప్రోటీన్లలో ఉంటాయి. ఇవి వ్యాధికారక కణాలకు వ్యతిరేకంగా పోరాడుతూ, శరీర కణాలను బలంగా మారుస్తాయి. శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మజీవులను నిరోధిస్తూ, వ్యాధుల సంక్రమణను అడ్డుకుంటాయి. తద్వారా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

ప్రోటీన్ ఫుడ్

ఒక గుడ్డులో 6 నుంచి 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్‌ కంటెంట్‌లో మొత్తం తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. మన శరీరం వాటిని స్వయంగా ఉత్పత్తి చేయలేదు. అందుకే డైట్‌లో ఎగ్స్ చేర్చుకోవాలి. ఈ ప్రోటీన్‌ కంటెంట్‌లో సగం గుడ్డులోని తెల్లసొనలోనే ఉంటుంది. దీంట్లో కొవ్వు శాతం, కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయి.

వారికి మరీ మంచివి

వర్కవుట్స్ చేసేవారు రోజూ ఎగ్స్ తినాలి. ఇవి ఎనర్జీ, ప్రోటీన్‌కు అద్భుతమైన వనరులు. శరీరాన్ని పునరుజ్జీవింపజేసే ముఖ్యమైన పోషకాలు వీటి నుంచి లభిస్తాయి. దీంతో డైలీ డైట్‌లో ఎగ్స్ తింటే శరీరాన్ని మంచి పోషణ లభిస్తుంది. అల్పాహారంలో గుడ్లు తినడం మొత్తం శ్రేయస్సుకు మంచిది.

జుట్టు, చర్మ ఆరోగ్యం

జుట్టు, చర్మం, గోళ్ల ఆరోగ్యాన్ని గుడ్లలోని పోషకాలు కాపాడతాయి. ఇందుకు అవసరమైన బయోటిన్, విటమిన్ B12 రెండూ గుడ్లలో సమృద్ధిగా ఉంటాయి. గుడ్డులోని ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ చర్మాన్ని తేమగా మారుస్తూ పోషణనిస్తుంది. దీంతో చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది.  (Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)

2024-03-29T07:46:10Z dg43tfdfdgfd