HEALTHY LIFESTYLE: మీరు నైట్ షిఫ్ట్ చేస్తున్నారా? అయితే ఇది తెలుసుకోవడం తప్పనిసరి

Healthy Diet: పొద్దున మనం తీసుకునే ఆహారం ఎంత హెల్తీగా ఉంటే..మన శరీరం అంత హెల్తీగా ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసింది. చాలావరకు.. చాలామంది.. పొద్దున ఇడ్లీ, దోస లాంటివి తీసుకుంటుంటారు. ఇక మరో పక్క డైట్ ఫాలో అయ్యేవారు పొద్దున స్మృతి, సలాడ్స్, ప్రోటీన్ షేక్స్ తాగుతుంటారు. అయితే కొందరు కొన్ని కారణాలవల్ల పొద్దున పూట అన్నం టిఫిన్ గా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా తీసుకోవడం మంచిదా? దీనివల్ల శరీరంపై ఎటువంటి ప్రభావం పడుతుంది? తెలుసుకుందాం పదండి..

ముఖ్యంగా చెప్పాలి అంటే నైట్ షిఫ్ట్ లో పనిచేసే వాళ్లు పొద్దున ఆలస్యంగా నిద్రలేస్తారు కాబట్టి ఉదయం భోజనం చేస్తారు. కానీ పొద్దున బ్రేక్ ఫాస్ట్ కి బదులుగా అన్నం తింటే మన ఆరోగ్యానికి సెట్ అవుతుందంటారా? నిజానికి అల్పాహారం బదులు భోజనం తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు అని నిపుణులు చెబుతున్నారు. మనం ఏం తింటున్నాం అనే దాని కంటే కూడా మనం తినే ఆహారంలో ఎటువంటి పోషక విలువలు ఉన్నాయి అన్న విషయాన్ని చూసుకోవాలట.

మరి ముఖ్యంగా ఇలా నైట్ షిఫ్ట్ లో పనిచేసే.. పొద్దున తోచిన సమయానికి తినేవారు తప్పనిసరిగా తాము తీసుకునే భోజనంలో ఉన్న పోషకాలపై దృష్టి పెట్టాలి. ఇలా చేసేవారు పొద్దున తినే వాటిని సాయంత్రం అల్పాహారంలో చేర్చుకోవడం మంచిదట. అంటే స్నాక్స్ కింద గుగ్గిళ్లు, ఓట్స్‌, జావ, ఆమ్లెట్‌, జొన్న ఇడ్లీ, దోశ వంటివి తీసుకోవచ్చు. ఇక నైట్ షిఫ్ట్ కి వెళ్లేవారు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో.. తాజా పండ్లు తో చేసిన సలాడ్స్ తీసుకోవడం దానికి ఎంతో మేలు చేస్తుంది. 

వర్క్ కి వెళ్లే ముందు ఇలా తేలికపాటి ఫుడ్ తీసుకోవడం వల్ల మీరు నైట్ అంతా యాక్టివ్ గా ఉండగలుగుతారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం.. తీసుకునే మోతాదు. భోజనాన్ని ఎప్పుడు కూడా మితంగా తీసుకోవాలి. నిద్రకు కనీసం 8 గంటలు కేటాయించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నైట్ షిఫ్ట్ కి వెళ్లేవారు నిద్రలేచిన తర్వాత కాస్త వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ తేలికపాటి జాగ్రత్తలు తీసుకుంటే మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

Read More: Rajasthan Man Collapses: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తుండగా ఊహించని ఘటన.. వీడియో వైరల్..

Read MOre: Viral video: రా రా రక్కమ్మ.. పాటకు మాస్ స్టెప్పులు వేసిన పెళ్లికూతురు.. వీడియో చూస్తే ఆపుకోలేరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-04-26T16:35:31Z dg43tfdfdgfd