ఆర్థిక ఇబ్బందులను దూరం చేసే వాస్తు టిప్స్.. ఇలా చేస్తే డబ్బు సమస్యలు ఉండవు

Vastu Tips: మీరు ఎంత కష్టం చేసినా, దానికి తగ్గ ఫలితం పొందట్లేదా..? డబ్బు విషయంలో ఎప్పుడూ నష్టాలే వస్తున్నాయా..? ఆర్థిక ఇబ్బందులు అస్సలు వదలట్లేదా..? అయితే కొన్ని వాస్తు దోషాలు ఇందుకు కారణం కావచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం.. మీ ఇంటి లేఅవుట్, స్ట్రక్ఛర్ మీ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతుంది. అందుకే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు వాస్తు దోషాలను సెట్ చేసుకోవాలి. అలాగే కొన్ని వాస్తు టిప్స్ పాటిస్తే అప్పులు తీర్చుకోవడం సాధ్యమవుతుంది, ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. ఆ టిప్స్ ఏవో చూడండి.

* అప్పుల బాధ తగ్గించే మార్గాలు

వాస్తు శాస్త్రం అప్పులు క్లియర్ చేయడానికి, శ్రేయస్సును ఆకర్షించడానికి వివిధ పరిహారాలను సూచించింది. సంపద, శ్రేయస్సును ఆకర్షించడానికి ఇంట్లో కుబేర యంత్రం లేదా శ్రీ యంత్రం పెట్టండి. పాజిటివ్ ఫైనాన్షియల్ ఎనర్జీని ఆకర్షించడానికి ప్రతిరోజూ సాయంత్రం ఇంటి ఆగ్నేయ మూలలో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. లక్ష్మీ గాయత్రీ మంత్రం లేదా కుబేర మంత్రం వంటి మంత్రాలను పఠిస్తూ సంపదను ప్రసాదించే దేవతల ఆశీర్వాదం పొందండి.

IRCTC: ఐఆర్‌సీటీసీ ఆధ్యాత్మిక యాత్ర.. ఏడు జ్యోతిర్లింగాల దర్శనానికి స్పెషల్ టూర్ ప్యాకేజీ

* వాస్తు దోషాలు

మీ ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉంటే అప్పులు తీర్చడం కష్టమవుతుంది. ప్రతి విషయంలోనూ ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇల్లు అస్తవ్యస్తంగా, ఇంటి వాతావరణం అయోమయంగా ఉంటే.. పాజిటివ్ ఎనర్జీ ప్రవాహాన్ని అడ్డుకుంటుంది, ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. అందుకే పనికిరాని, అనవసరమైన వస్తువులను ఇంటి నుంచి బయట పడేయండి. ఇల్లు ఎప్పుడూ నీట్‌గా, క్లీన్‌గా ఉండాలి. ఇంటిలోపల తలుపులు లేదా దారులకు అడ్డుగా ఫర్నిచర్ వంటివి పెట్టి బ్లాక్ చేయకూడదు. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ ప్రవాహానికి అంతరాయం కలుగుతుంది.

---- Polls module would be displayed here ----

* ఆగ్నేయ దిశ

వాస్తు పరంగా ఆగ్నేయ దిశకు సంపద, శ్రేయస్సుతో సంబంధం ఉంటుంది. ఇంట్లో ఈ ప్రాంతాన్ని గందరగోళంగా ఉంచకూడదు. సంపద, శక్తిని ఆకర్షించడానికి ఇంటి ఆగ్నేయ మూలలో ఫౌంటెన్ లేదా అక్వేరియం వంటి వాటర్ ఫీచర్‌ ఐటెమ్స్ పెట్టండి. ఆకుపచ్చ, నీలం లేదా ఊదా వంటి రంగుల వస్తువులు ఈ ఏరియాలో ఉండాలి. అలాగే ఈ దిశ నుంచి వెంటిలేషన్ కూడా బాగుండాలి.

* పాజిటివ్ మైండ్‌సెట్

ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు వాస్తు దోషాలు క్లియర్ చేసి, వాస్తు పరిహారాలు పాటించడంతో పాటు పాజిటివ్‌గా ఆలోచించాలి. అప్పులు తీర్చడానికి ఉన్న మార్గాలను గుర్తించాలి. సాధ్యమైనంత త్వరగా అన్ని అప్పులు తీర్చి, ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు డబ్బు దాచుకోండి. పాజిటివ్ మైండ్‌సెట్ ఉంటేనే ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సాధ్యమవుతుంది.

* వాయువ్య దిశ

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి వాయువ్య దిశ ఆర్థిక స్థిరత్వంతో ముడిపడి ఉంటుంది. అందుకే ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడానికి ఈ ప్రాంతం శుభ్రంగా, చక్కగా ఉండాలి. ఇల్లు లేదా ఆఫీస్ వాయువ్య మూలలో మనీ ప్లాంట్ లేదా సంపద చిహ్నాలను పెట్టండి. ఈ దిశలో పెట్టే వస్తువులు తెలుపు, వెండి లేదా బంగారం వంటి శ్రేయస్సును ప్రోత్సహించే రంగుల్లో ఉండాలి.

2024-04-26T13:06:59Z dg43tfdfdgfd