టేస్టీ బీట్రూట్ దోశ ఇలా తయారు చేసుకోండి..!!

ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రస్తుతం అందరూ కూడా ఆరోగ్యం పైనే శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రతిరోజు తినే ఆహారంలో ప్రోటీన్ ఉండే విధంగా చూసుకుంటున్నారు. టిఫిన్, భోజనం, డిన్నర్ లో ఇలా ప్రతిదాంట్లో కూడా మంచి ప్రోటీన్ ఆహారం తినడం జరుగుతుంది. ఉదయం అల్పాహారంలో బీట్రూట్ దోశతింటే ఆరోగ్యానికి ఎంతో మేలు అని డాక్టర్లు చెబుతున్నారు. ఎప్పుడు మసాలా దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశలా కాకుండా ఈ బీట్రూట్ దోశఇంట్లో తయారు చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి.

ఈ బీట్రూట్ దోస చేయడానికి ముందుగా బీట్రూట్ దుంపలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో మినప పప్పు, ఒక కప్పు బియ్యం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ దుంపలో వేసుకోవాలి. మిక్సీలో సగం నలిగిన తర్వాత కొంచెం నీళ్లు వేసి బాగా మెత్తగా అయ్యే విధంగా తయారు చేసుకోవాలి. బీట్రూట్ దోశలో కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొద్దిగా మిరపకాయలు దంచుకొని ఈ రుబ్బులో వేసుకోవాలి.

ఆ పార్క్‌కు వెళ్తే కలర్ పుల్ ఫ్లవర్స్ వెల్కం చెబుతాయి!

తర్వాత కళాయి పై పల్చగా వచ్చేలా దోశ వేస్తే టేస్టీ టేస్టీ రుచికరమైన బీట్రూట్ దోస రెడీ అయిపోతుంది. అధిక శాతం మహిళలు ఈ బీట్రూట్ దోస్ తింటే ఎంతో మంచిది. శరీరంలో రక్తహీనత ఉంటే ఎక్కువగా బీట్రూట్ తినాలి. అధిక శాతం ఈ బీట్రూట్ డైరెక్ట్ గా తినరు. ఇలా దోశలో బీట్రూట్ వేసుకొని తింటే ఎంతో ఉపయోగంగా ఆరోగ్యంగా ఉంటుంది. చిన్నపిల్లలు ఎక్కువగా బీట్రూట్ తినరు. ఇలా దోశలో బీట్రూట్ వేసి పెడితే మీ పిల్లలకి కూడా ఆరోగ్యంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. బీట్రూట్ దోశ తినడం వల్ల పూర్తిగా ఆరోగ్యంగా బలంగా ఉండవచ్చు. అల్పాహారంగా ఈ బీట్రూట్ దోశ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అన్ని రకాల పోషక విలువలు మన శరీరానికి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఓసారి మీరు కూడా ఈ బీట్రూట్ దోస ట్రై చేయండి మరి.

2024-04-24T06:27:47Z dg43tfdfdgfd