మీ పిల్లలతో ఈ మాటలు అస్సలు అనొద్దు..

పిల్లల్ని పెంచే విషయంలో ప్రతీ తల్లీదండ్రులు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేంటో తెలుసుకోండి.

పిల్లల్ని పెంచేటప్పుడు పేరెంట్స్ కొన్ని విషయాలను గమనించాలి. వారితో కొన్ని మటాలు ఎప్పటికీ కూడా చెప్పొద్దు. అవి వారిని చాలా దారుణంగా ఎఫెక్ట్ చేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..మీరు ఫెయిల్ అవుతారు..

అందరూ పిల్లలు ఒకేలా ఉండరు. కొందరు యాక్టివ్‌గా ఉంటే మరికొంతమంది కాస్తా డల్‌గా ఉంటారు. అంత మాత్రాన మీరు ఎప్పుడు ఇంతే ఏం సాధించలేరు. అన్నింట్లో ఫెయిల్ అవుతారు ఇలాంటి మాటలు అస్సలు చెప్పొద్దు. దీని వల్ల వారిలో సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటాయి.

చిన్నపిల్లలు మీకేం తెలియదు..

ఇలాంటివి కూడా అనొద్దు. ఎందుకంటే వారు ఏమైనా మనకి చెప్పుకోవాలనుకున్నప్పుడు వాటిని క్లియర్‌గా చెప్పుకోలేరు. అందుకే, ఏవైనా చెప్పగలిగే ధైర్యమివ్వాలి. ​Also Read : భార్య ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు భర్త చేయాల్సిన పనులివే..

పోలిక..

ఇతరుల్ని చూపించి వారు ఇది చేస్తున్నారు. వీళ్ళు ఇన్ని మార్కులు తెచ్చుకున్నారు. మీరేం చేయలేరా అని పోల్చడం తప్పుడు. వారి తప్పులు ఏవైనా ఉంటే అవి చెప్పండి. సరిదిద్దే ప్రయత్నం చేయండి. ​Also Read : ప్రెగ్నెంట్స్ తక్కువ బరువు ఉంటే పుట్టే పిల్లలకి ప్రమాదమా..

లింగబేధం..

మీరు అమ్మాయిలు ఇవి చేయాలి.. అబ్బాయిలు అలానే ఉండాలనే మాటలు వారి ఎదుట అనొద్దు. వీటి వల్ల వారి చిన్ని మనసులో అసమానతలు చెలరేగుతాయి. అందుకే, అలా ఉండకుండా వారిని వారిలానే ట్రీట్ చేయండి. ​​​Read More : Pregnancy and Parenting News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-25T12:15:43Z dg43tfdfdgfd