FINGER LICKING CORIANDER CHUTNEY: కొత్తిమీర పచ్చడి ఇలా చేస్తే ఇడ్లి, దోశ, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది..

Finger Licking Coriander Chutney: మన దేశంలో రకరకాల చట్నీలు ఉన్నాయి. సౌత్‌ ఒక్క స్టైల్‌ అయితే, నార్త్‌ మరో స్టైల్. ఇక మన దక్షిణ భారత్‌దేశం విషాయానికి వస్తే ప్రతిరోజూ ఓ చట్నీ ఇడ్లి లేదా దోశ, చపాతీల్లోకి నంజుకోవడానికి ఉండాల్సిందే. అయితే, ఈరోజు మనం రుచికరమైన కొత్తిమీర చట్నీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.ఈ కొత్తిమీరా చట్నీని కొత్తిమీరా ఆకులు, కొబ్బరి ఇతర మసాలాలు వేసి తయారు చేసుకుంటారు. ఇది పుల్లగా, ఘాటుగా భలే ఉంటుంది. ఈ కొత్తిమీర పచ్చడి ఇడ్లి, దోశ, ఊతప్పం, అప్పంలోకి కూడా బాగుంటుంది. దీని తయారీ విధానం కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు..

కొత్తిమీరా -500 గ్రాములు

నువ్వుల నూనె-4TBSP

తురిమిన కొబ్బరి- ఒక కప్పు

చింతపండు కాస్త

వెల్లుల్లి రెబ్బలు-15

పచ్చిమిర్చి -5

ఎండుమిర్చి-10

వేయించిన శనగపప్పు-3 TBSP

మినపప్పు-3TBSP

జీలకర్ర-1TBSP

ఇంగువ-1/4

రాళ్ల ఉప్పు-1TBSP

కరివేపాకు ఒకరెమ్మ

ఇదీ చదవండి: చందనంతో ఇలా ఉబ్తాన్‌ తయారు చేసుకోండి.. మీ చర్మానికి రెట్టింపు రంగు..

తయారీ విధానం..

ముందుగా వేడి నీటిలో చింతపండును నానబెట్టి, గుజ్జు తీసిపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ వేడి చేసి అందులో నువ్వులనూనె వేసి వేడి చేసుకోవాలి. అందులోనే వేయించిన శనగపప్పు, మినపప్పు వేసి బంగారు వర్ణంలోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర కూడా వేసి మంచి అరోమా వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి ఓ నిమిషం పాటు వేయించుకోవాలి. సన్నగా కట్‌ చేసి పెట్టుకున్న కొబ్బరి, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఓ 3 నిమిషాలపాటు మీడియం మంటపై వేయించుకోవాలి.

ఇదీ చదవండి: కొకనట్‌ ఆయిల్‌ VS వర్జిన్ కోకనట్ ఆయిల్  మధ్య తేడా ఏంటి?

ఇప్పుడు ఇందులో నానబెట్టిన చింతపండు గుజ్జు కొత్తిమీరా, ఉప్పు వేసి కొత్తిమీరా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారాక బరకగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి కరివేపాకు, పసుపు కూడా వేయించుకోవాలి. ఈ నూనెను మిశ్రమంలో పైనుంచి వేసుకోవాలి. చట్నీ మొత్తం బాగా కలుపుకోవాలి. కొత్తిమీరా చట్నీ రెడీ.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-04-19T08:28:16Z dg43tfdfdgfd