Trending:


Video Viral : వామ్మో .. బట్టల షాపులో ఎద్దులు రెచ్చిపోయాయి

Video Viral : వామ్మో .. బట్టల షాపులో ఎద్దులు రెచ్చిపోయాయి ప్రతిరోజు మనం సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు చూస్తూనే ఉంటాం. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే మరికొన్ని భయాన్ని కలిగించేలా వీడియోలు కూడా ఉంటాయి. అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంటాయి. తాజాగా రెండు ఎద్దులు పోట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడ...


వేసవిలో పుచ్చకాయ తింటున్నారా.. అయితే జాగ్రత్త!

కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు కేటుగాళ్లు అన్నింటినీ కల్తీమయం చేస్తున్నారు. పాల దగ్గరి నుంచి తినే తిండి వరకు అన్నింట్లో నకిలీవి కలిపేస్తూ జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దీంతో ఏది తినాలో ఏది తినకూడదోనని ప్రజలు తీవ్ర ఆందోళన పడుతున్నారు. ఇక వేసవి కాలంలో జనం ఒంట్లో వేడిని తగ్గించుకునేందుకు ఎక్కువగా పండ్లు తింటారు. ఇక అలాంటి పండ్లను కూడా కల్తీ చేస్తూ పట్టుబడ్డారు. చివరికి పుచ్చకాయలను కల్తీ చేస్తున్న సంఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.


Strawberry Pancake: స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే పిల్లలకి తెగ నచ్చేస్తుంది

Strawberry Pancake: ఎప్పుడూ దోశలు, ఇడ్లీలు పెడితే పిల్లలు ఇష్టంగా తినరు. ఒకసారి స్ట్రాబెర్రీ పాన్ కేక్ తయారు చేసి చూడండి. దీన్ని తయారు చేయడం చాలా సులువు.


Pudina Pachadi: పుదీనా పచ్చడి ఆరోగ్యకరమైన వంటకం ఇలా తయారు చేసుకోండి

Pudina Pachadi Recipe: పుదీనా పచ్చడి ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటకం, ఇది భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందింది. దీనిని తయారు చేయడం ఎంతో సులభం.


తత్తూరు స్వీట్స్ తిన్నారా.. స్పెషాలిటీ ఇదే, ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు!

500 సంవత్సరాల చరిత్ర గల తత్తూరు రంగనాథ స్వామి తిరుణాలలో పెద్దపెద్ద స్వీట్ షాప్ లో చాలా చక్కగా ఎంతో రుచికరమైన స్వీట్ షాపులను ఇక్కడ ఏర్పాటు చేశారు. స్వీట్ అన్ని మన కళ్ళు ఎదురుగానే తయారుచేసి అమ్మకాలు జరుపుతారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో తత్తూరు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ తత్తూరు రంగనాథ స్వామి తిరుణాల ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ తిరుణాల కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల నుంచి వేలాదిమంది భక్తాదులందరూ తరలివచ్చి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంటూ ఉన్నారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం తిరునాళ్లను తిలకించేందుకు వెళ్తూ ఉంటారు. తిరుణాలలో భాగంగా పెద్దపెద్ద స్వీట్ షాపులను ఇక్కడ ఏర్పాటు చేశారు, తత్తూరు తిరునాళ్లకు ముఖ్యమైనవిగా ఈ స్వీట్ షాపులు అని చెప్పవచ్చును. తిరుణాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ తయారు చేసే స్వీట్లు కొనుగోలు చేయనిదే వారి గ్రామాలకు వెళ్ళరు. జాంగిర్, మైసూర్ పాక్, బాదుషా, తీయకారాలు, మిచ్చెర, తీయని బెండ్లు, ఇలా మొదలైనవి అన్ని అమ్మకాలు జరుపుతున్నారు. దాదాపుగా 80 సంవత్సరాల నుంచి మహమ్మద్ రఫీ, వారి కుటుంబ సభ్యులు తత్తూరు జాతరలో ఇలా స్వీట్ షాపుల టెంట్లు వేసి, రకరకాల స్వీట్ అమ్మకాలు జరుపుతూ ఉన్నామని తెలిపారు. ఇక్కడ ప్రతిరోజు ఉమ్మడి జిల్లాల నుంచి వేలాదిమంది భక్తాదులందరూ తత్తూరు రంగనాథ స్వామి దర్శించుకొని స్వీట్ కొనుగోలు చేయడానికి వస్తూ ఉంటారని అమ్మకాలు బాగానే జరుగుతూ ఉన్నాయని తెలిపారు. పూర్వం నుంచి ఇక్కడే మా వంశస్థులు స్వీట్ అమ్మకాలలో మా ప్రత్యేకత ఉంది.


Beauty Tips: మెడ నల్లగా మారిందా? బంగాళదుంపతో ఇలా చేశారంటే మెరవడం గ్యారంటీ

మనమందరం ముఖం గురించి పట్టించుకుంటాం. ఎంత క్రీమ్-లోషన్, ఫేషియల్-స్క్రబ్బింగ్ చేసినా... మధ్య నుంచి నల్లని మెడ కనిపిస్తుంటుంది. మెడను నిర్లక్ష్యం చేయడం వల్ల మురికి పేరుకుపోయి నల్లమచ్చలు వస్తాయి. ముఖ్యంగా వేసవిలో ఈ సమస్య ఎక్కువవుతుంది. పైగా, చాలా మంది తమ ముఖానికి సన్‌స్క్రీన్‌ని మెడపై వేసుకోరు. ఫలితంగా, సూర్యుడు మండుతుంది ముదురు మచ్చలను పొందుతుంది. ఈ డార్క్ స్పాట్‌లను హైపర్‌పిగ్మెంటేషన్ అంటారు. అకాంథోసిస్ నైగ్రికన్స్ అనే హార్మోన్ల సమస్య కూడా తరచుగా మెడపై నల్లటి పాచెస్‌కు కారణమవుతుంది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి చాలా మంది వివిధ మార్కెట్ సౌందర్య సాధనాలను ఉపయోగిస్తారు. కానీ ఏదైనా రసాయన ఉత్పత్తికి దుష్ప్రభావాలు ఉంటాయని గుర్తుంచుకోండి. కాబట్టి హోం రెమెడీస్‌పై ఆధారపడండి. ఈ 4 ఇంటి నివారణలు కేవలం 7 రోజుల్లో మెడ మెడపై ఉన్న నల్ల మచ్చలను తొలగిస్తాయి -అలోవెరా - కొన్ని ఎంజైమ్‌లు మెడపై నల్లటి మచ్చలను కలిగిస్తాయి. అలోవెరాలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఈ ఎంజైమ్‌ల కార్యకలాపాలను నిరోధిస్తాయి. అలాగే చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలోవెరా జెల్ లేదా తాజా కలబంద ఆకుల నుండి ఒలిచిన మెడ మెడ యొక్క నల్లటి ప్రదేశాలలో అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో కడగాలి. బేకింగ్ సోడా - రెండు చెంచాల బేకింగ్ సోడాను నీటిలో కలపండి . నల్ల మచ్చలపై రాయండి. పొడిగా ఉన్నప్పుడు, తడి వేళ్లతో స్క్రబ్ చేయండి. బేకింగ్ సోడా తర్వాత తప్పకుండా మాయిశ్చరైజర్ అప్లై చేయండి. బంగాళాదుంప రసం - బంగాళాదుంపలో బ్లీచింగ్ లక్షణాలు ఉన్నాయి, ఇవి చర్మపు రంగును కాంతివంతం చేస్తాయి. ఒక బంగాళాదుంపను ఎంచుకుని, వడకట్టి రసం తీయండి. ఈ రసాన్ని కాటన్ బాల్‌పై అప్లై చేసి నల్ల మచ్చపై అప్లై చేయండి. పూర్తిగా ఆరిపోయినప్పుడు, నీటితో కడగాలి.యాపిల్ సైడర్ వెనిగర్ - యాపిల్ సైడర్ వెనిగర్ చర్మం యొక్క pHని బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులో ఉండే మాలిక్ యాసిడ్ మృత చర్మ కణాలను తొలగించి చర్మాన్ని బొద్దుగా మార్చుతుంది. యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను కొద్దిగా నీళ్లలో కలిపి గొంతుకు పట్టించాలి. 10 నిమిషాల తర్వాత కడిగేయాలి.


Narmada Pushkaralu 2024 నర్మదా నది పుష్కరాల ప్రాముఖ్యతలేంటి.. పుష్కర స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందా?

Narmada Pushkaralu 2024 భారతదేశంలోని 12 పుణ్య నదుల్లో ఒకటైన నర్మదా నది పుష్కరాలు మే 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి.. ఈ సందర్భంగా నర్మదా నది పుష్కరాల ప్రాముఖ్యతలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...


శ్రీశైలం ఆలయంలో ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధం

శ్రీశైలం ఆలయంలో ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధం పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైలంలో ఆలయ పరిధిలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌ నిషేధం విధించారు. దుకాణదారులు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌, ప్లాస్టిక్‌ కవర్లను విక్రయించకూడదని ఆలయ ఈవో డి.పెద్దిరాజు ఆదేశాలు జారీ చేశారు.  ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కాగితం, జూట్‌ సంచులు వినియోగించాలని సూచించారు.  శ్రీశైల మహా...


చిన్న సబ్బు ముక్కతో బొద్దింకలను తరిమి కొట్టొచ్చు.. ఎలాగో తెలుసా?

బొద్దింకలను ఇంట్లో నుంచి సమూలంగా నిర్మూలించాలి. చాలా మంది ఈ బొద్దింకలను వదిలించుకోవడం కోసం మార్కెట్లో లభించే కెమికల్స్ తో ఉండే స్ప్రేలను వాడుతూ ఉంటారు. అయితే... వాటి వల్ల బొద్దింకలు తగ్గినట్లు తగ్గి.. మళ్లీ ఎక్కువగా వచ్చేస్తూనే ఉంటాయి మనం మన వంట గదిని తరచూ శుభ్రం చేసుకుంటూనే ఉంటాం. అయితే... మనం ఎంత శుభ్రం చేసినా కూడా ఇంట్లో బొద్దింకలు వస్తూనే ఉంటాయి. ఒక్కటి పుట్టుకొస్తే చాలు.. రెండు, మూడు రోజుల్లోగా అవి వందలుగా, మందలుగా పెరిగిపోతాయి. ఒక్కసారి...


ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే అబ్బాయిలు చాలా రొమాంటిక్..!

జోతిష్యశాస్త్రం ప్రకారం, ఎవరు రొమాంటిక్ గా ఉంటారో తెలుసుకోవచ్చట. అబ్బాయిల పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి.. వారు రొమాంటిక్ అవునో కాదో తెలుసుకోవచ్చట. తమ లైఫ్ లోకి వచ్చే అబ్బాయి చాలా రొమాంటిక్ గా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే.. ఎవరు రొమాంటిక్, ఎవరు అన్ రొమాంటిక్ అనే విషయం తెలుసుకోవడం చాలా కష్టమైన విషయమనే చెప్పాలి. కానీ జోతిష్యశాస్త్రం ప్రకారం, ఎవరు రొమాంటిక్ గా ఉంటారో తెలుసుకోవచ్చట. అబ్బాయిల పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి.. వారు...


సాంబార్​ ఎక్కడ పుట్టింది.. మొదట ఎవరు తయారు చేశారో తెలుసా

సాంబార్​ ఎక్కడ పుట్టింది.. మొదట ఎవరు తయారు చేశారో తెలుసా దక్షిణాది వంటకాలలో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న వాటిలో సాంబార్ ఒకటి. తెలుగు  వారి భోజనాలలో సాంబార్ కు ప్రత్యేక స్థానం ఉంది. సాంబార్ ఆవిష్కరణ వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.  దక్షిణ భారతదేశంలో తొలిసారి సాంబారు ఎక్కడ తయారు చేశారు.. ఎవరి కోసం .. ఎవరు తయారు చేశారు..  దీని వెనుక ఉన్న చరిత్ర ఏమి...


White Sesame Seeds Benefits: తెల్ల నువ్వులు తీసుకుంటే ఏమవుతుంది? కలిగే ప్రయోజనాలు ఇవే..!

White Sesame Seeds: మనలో ప్రతిరోజు ఉపయోగించే ఆహార పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో తెల్ల నువ్వులు ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటుంది.


12ఏళ్ల తర్వాత... ఈ రాశులవారికి మహర్దశ మొదలైంది..!

గురు గ్రహం వృషభంలోకి అడుగుపెట్టడం వల్ల... ఐదు రాశులవారికి మంచి జరగనుంది. మంచి అంటే మామూలు మంచి కాదు.. వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. పుష్కరకాలం తర్వాత... అంటే దాదాప 12ఏళ్ల తర్వాత.... ఐదు రాశులవారికి మహర్దశ మొదలైంది. గురు గ్రహం మే1వ తేదీన మేష రాశి నుంచి వృషభ రాశిలోకి అడుగుపెట్టాడు. దాదాపు సంవత్సరం పాటు అంటే వచ్చే ఏడాది మే 14 వరకు వృషభ రాశిలోనే ఉంటాడు. అయితే... గురు గ్రహం వృషభంలోకి అడుగుపెట్టడం వల్ల... ఐదు రాశులవారికి మంచి జరగనుంది. మంచి అంటే...


Zodiac signs: ఈ ఐదు రాశుల వారు బెస్ట్ లవర్స్.. వీరి ప్రేమ ఎంతో మధురం, అపురూపం..

ప్రేమకు ఎంతో శక్తి ఉంది. ఈ బంధం జంటల మధ్య అనురాగాన్ని పంచుతుంది. అందుకే కొందరు ప్రేమలో లీనమైపోతారు. అంకితభావంతో భాగస్వాములపై అచంచలమైన ప్రేమను కురిపిస్తారు. భావోద్వేగాన్ని అద్భుతంగా పండిస్తారు. దయ, కరుణతో మెలుగుతారు. వీరు ఓ అద్భుతమైన ప్రేమికులుగా (Passionate lovers) గుర్తింపు పొందుతారు. వీరు భాగస్వాములకు ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. ప్రేమ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు. ఇలాంటి లక్షణాలు ఉన్న రాశులు ఏవో చూద్దాం. మేషంప్రేమ వ్యవహారాల్లో మేషరాశి వారు చాలా ధైర్యవంతులు. ప్రేమలో ఎలాంటి సమస్యలు ఎదురైనా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. రొమాంటిక్ రిలేషన్‌లో వీరు ప్రత్యేక చొరవ తీసుకుంటారు. భాగస్వామితో తమ కోరికలు వెల్లడించడానికి ఏమాత్రం వెనుకాడరు. రొమాంటిక్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తారు. ప్రేమ కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడతారు. ప్రేమలో భావోద్వేగభరితంగా ఉంటారు. ప్రేమించేవారికి తోడునీడగా ఉంటారు. కష్టసమయాల్లో సపోర్ట్‌గా నిలుస్తారు. భాగస్వాములతో సన్నిహితంగా మెలుగుతారు. రొమాంటిక్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తారు. వృశ్చికంవృశ్చిరాశిపై ప్లూటో గ్రహం ప్రభావం ఉంటుంది. దాని ప్రభావంతో ప్రేమలో భావోద్వేగంగా వ్యహరిస్తుంటారు. శారీరకంగా, మానసికంగా ఉద్వేగభరితమైన ప్రేమికులకు గుర్తింపు పొందారు. భాగస్వాములతో సాన్నిహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. జీవితాన్ని వారికే అంకితం చేస్తారు. లైఫ్‌ పార్ట్నర్ వ్యక్తిగత విషయాలపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు. వారి ప్రేమ కోసం తపిస్తుంటారు. అన్ని వేళలా ఆప్యాయత, అనురాగం పంచుతారు. ప్రేమ జీవితాన్ని మనసారా ఆస్వాదిస్తారు. మీనంవీరు ప్రేమ కలల్లో విహరిస్తుంటారు. డీప్, రహస్యమైన బంధం కోసం అన్వేషిస్తుంటారు. తమ ప్రేమ విషయాలను బహిర్గతం చేయడానికి ఇష్టపడరు. ప్రేమలో భావోద్వేగాన్ని బాగా పడిస్తారు. ప్రేమికులను తమ కోసం పరితపించేలా చేయడంలో మంచి నైపుణ్యం ఉంటుంది. క్రియేటివిటీగా ఆలోచిస్తూ ప్రేమ జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. భాగస్వాములతో రొమాంటిక్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు. కలిసి షాపింగ్ చేయడం ఆస్వాదిస్తారు. ఏకాంతంగా గడుపుతూ ప్రేమలో మునిగితేలుతారు. ఒకరికొకరు తమపై ఇష్టాన్ని పెంచుకుంటారు. సింహంసింహరాశి వారు సహజంగానే ప్రేమపై ఆసక్తి చూపుతారు. ప్రేమకు సంబంధించిన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ప్రేమించే వ్యక్తుల పట్ల దయ, కరుణతో వ్యవహరిస్తుంటారు. తద్వారా ఉద్వేగభరిత ప్రేమికులుగా గుర్తింపు పొందుతారు. ప్రేమలో తమ భాగస్వాములను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా భావిస్తారు. లవ్ లైఫ్‌ను బాగా ఆస్వాదిస్తారు. ప్రేమలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా భాగస్వాములను విడిచిపెట్టరు. చివరి వరకు వారి వెంట నడుస్తారు. కష్టనష్టాలను కలిసి ఎదుర్కొంటారు. కర్కాటకంకర్కాటకం అధిపతి చంద్రుడు. ఇది లోతైన భావోద్వేగానికి సంకేతం. అందుకే కర్కాటక రాశివారు తాము ప్రేమించే వ్యక్తుల పట్ల అత్యంత శ్రద్ధ తీసుకుంటారు. అన్ని రకాలుగా రక్షణ కల్పిస్తారు. ప్రేమించిన వారికి ఏదైనా ఇబ్బంది తలెత్తితే, తమ సొంత సమస్యగా భావిస్తారు. భాగస్వాములు సుఖ, సంతోషాల కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. వారి ఆకాంక్షలను నెరవేర్చడమే పరమావధిగా భావిస్తారు. ప్రేమ పట్ల లోతైన దృక్పథం కలిగి ఉంటారు. అందుకే వారు ఉద్వేగభరితమైన ప్రేమికులుగా గుర్తింపు పొందుతారు. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


Varuthini Ekadashi 2024 ఈసారి వరూథిని ఏకాదశి ఎప్పుడొచ్చింది... పూజా విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి...

Varuthini Ekadashi 2024 తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది ఛైత్ర మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని వరూథిని ఏకాదశి అంటారు. ఈసారి ఈ ఏకాదశి ఎప్పుడొచ్చింది.. దీని ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


మామిడి ఆకులతో ఆశ్చర్యకర లాభాలు.. మీకు తెలుసా?

మామిడి కాయలతోనే కాదు మామిడి ఆకులతోనూ ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. అవేంటో తెలుసుకుందాం.


మీలో హుషారు తగ్గిందా.. ఈ సమ్మర్ ఫ్రూట్ ఇలాగే తినాలట !

అసలే ఎండాకాలం. సూర్యుడి ప్రతాపం ధాటికి ఎండలు విపరీతం కాగా సామాన్య ప్రజానీకం నుండి ప్రతి ఒక్కరూ ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం 10 దాటగానే వేడిగాలులు పలకరిస్తున్న క్రమంలో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీనితో శరీరాన్ని వేడి నుండి ఉపశమనం కలిగించేందుకు, అలాగే వడదెబ్బ బారి నుండి రక్షింపబడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ప్రజలు ఎంచుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా సమ్మర్ లో వచ్చేటటువంటి ఫ్రూట్స్ ని తినేందుకు అమిత ఆసక్తి చూపుతారు. అయితే ప్రకృతి వరప్రసాదంగా పేరుగాంచిన తాటి ముంజలు తింటే చాలు.. ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు వైద్యులు. ఎండాకాలంలో మాత్రమే వచ్చేటటువంటి ఈ తాటి ముంజలను తినడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం తాటి ముంజలు తింటే చాలు శరీరంలోని వేడి స్థాయిని తగ్గించే అవకాశం ఉంది. అందుకే తాటి ముంజలను చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రుచి చూస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ వంటి నగరాలలో డజన్ తాటి ముంజలు రూ.120 నుండి రూ. 180ల వరకు ధర పలుకుతున్నాయి. కాగా తాటి ముంజలు తింటే శరీరంలో కాల్షియం శాతం పెరుగుతుందట. ఇది ఇలా ఉంటే తాటి ముంజల పైన ఉండే పొట్టును తీసివేసి తినడం అందరూ సర్వసాధారణంగా చేస్తుంటారు. కానీ అసలు విషయం ఆ ముంజ పై ఉండే పొట్టులోనే ఉందని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే లేత తాటి ముంజను పొట్టుతో సహా తింటే చాలు, శరీరానికి మరింత చలువదనం తో పాటు, అన్ని రకాలుగా శారీరకంగా హుషారు ఉంటారట. వేడి ప్రభావం శరీరంపై అంతగా చూపే ఆస్కారం కూడ ఉండదని వైద్యులు తెలుపుతున్నారు. మరి మీరు తాటి ముంజల పొట్టును పడేస్తున్నారా.. ఆగండి.. ఇన్ని ప్రయోజనాలు కలిగిస్తున్న పొట్టుతో సహా ముంజల రుచి చూసేయండి మరి !


రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి?

బాదం పప్పులు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేసత్ాయి. వీటిని తినడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలు అందుతాయి. అయితే ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు ఎన్ని బాదం పప్పులను తినాలో తెలుసా? బాదం గింజలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బాదం పప్పుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఇ, రాగి, మాంగనీస్,భాస్వరం పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా బరువు...


పెళ్లి కాకుండానే ఆ పని చేస్తున్నాము, ఇంటికి రాగానే డోర్ ఓపెన్ చేస్తాడు... పచ్చిగా చెప్పేసిన బిగ్ బాస్ కీర్తి!

బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ చేసిన కామెంట్స్ ఒకింత సంచలనం రేపుతున్నాయి. పెళ్ళికి ముందే కాబోయేవాడితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నానని ఆమె ఓపెన్ చెప్పింది. అలా చేయడం తప్పేమి కాదంటుంది. సీరియల్ నటి కీర్తి భట్ బిగ్ బాస్ వేదికగా పాపులారిటీ తెచ్చుకుంది. సీజన్ 6లో పాల్గొన్న అమ్మడు ఫైనల్ కి వెళ్ళింది. స్ట్రాంగ్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకుంది. టాస్క్ లలో సత్తా చాటింది. కీర్తి భట్ ఒక దశలో టైటిల్ ఫేవరెట్ గా ప్రచారం దక్కించుకుంది. కీర్తి భట్ గత ఏడాది...


Friday Remedies: శుక్రవారంరోజున ఈ పనులు అస్సలు చేయోద్దు.. లక్ష్మీదేవికి కోపం వస్తుందంట..

Friday Remedies: శుక్రవారంరోజున ఈ పనులు అస్సలు చేయోద్దు.. లక్ష్మీదేవికి కోపం వస్తుందంట..


ఇక్కడికి హాట్ హాట్‌గా వెళ్లి... కూల్ కూల్‌గా వచ్చేస్తున్నారు... కారణమేంటో తెలుసా?

మీరు హాట్.. హాట్ గా ఉన్నారా.. ఇక్కడికి వెళితే చాలు మీరు కూల్ కూల్.. గా రావాల్సిందే. ఇంతకు ఎక్కడికి వెళ్ళాలి.. ఏమిటి ఈ కూల్ కూల్ అనే కదా మీ సంకోచం. అయితే పూర్తి వివరాలు మీ లోకల్18 లో ..రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి గత వారం రోజులుగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి. ఉదయం 10 దాటితే చాలు.. ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇది ఇలా ఉంటే అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ తరుణంలో ఎండల నుండి ఉపశమనం పొందేందుకు వ్యాపారులు కూడా వినూత్న ఆలోచనలు చేస్తున్నారని చెప్పవచ్చు. ఇందులో భాగంగా కరీంనగర్ పట్టణంలోని జ్యోతి నగర్ భారత్ పెట్రోల్ బంక్ నిర్వాహకులు వాహనదారుల కోసం వినూత్నంగా ఆలోచించి ప్రజలకు వేడిగాలుల నుండి విముక్తి కలిగిస్తున్నారు. కరీంనగర్ కు చెందిన శివ భారత్ పెట్రోల్ బంక్ ను కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ పెట్రోల్ బంక్ వద్దకు వాహనదారులు అధికంగా వస్తుంటారు. అయితే ఈ పెట్రోల్ బంక్ వద్దకు వాహనదారులు అధికంగా వస్తుంటారు. అయితే ఈ సమ్మర్ లో ఎండ తాకిడి అధికం కాగా, వేడిగాలుల నుండి వాహనదారులకు ఉపశమనం కలిగించేందుకు, తన పెట్రోల్ బంక్ చుట్టూ వాటర్ స్పింక్లర్లను అమర్చారు. ఈ స్పింక్లర్ల ద్వారా నీటి తుంపర్లు నలుమూలల చిమ్ముతూ పెట్రోల్ బంక్ పరిసర ప్రాంతాన్ని అంతా చల్లగా ఉంచుతున్నాయి. దీనితో పెట్రోల్ కోసం వచ్చిన వాహన దారులు కాస్తంత రిలాక్స్ అవుతున్నారనే చెప్పవచ్చు. ప్రధానంగా సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వాహనదారులైతే ఇక అక్కడే కొంత విశ్రాంతి తీసుకుంటున్న పరిస్థితి. ఈ చిన్న ఐడియా ద్వారా ఇక్కడ వ్యాపారం జోరుగా సాగుతుంది. ఈ సందర్బంగా లోకల్18 తో పెట్రోల్ బంక్ యజమాని శివ మాట్లాడుతూ..తాను కొంచెం కస్టమర్స్ కోసం వినూత్నగా ఆలోచించి ఈ స్పింక్లర్లు పెట్రోల్ బంక్ టాప్ పైన ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎండ తాకిడికి కస్టమర్లకు కొంచెం ఉపశమనం కలుగుతుందని , 5 నిమిషాలు ఉండే కస్టమర్.. 10 నిమిషాల తర్వాత బయలుదేరుతున్నారని తెలిపారు. ఈ స్పింక్లర్ల కు రోజుకు 1000 లీటర్ల వరకు నీటిని వాడుతున్నామన్నారు. ఈ స్పింక్లర్ల ఏర్పాటుకు రూ.70000 ఖర్చయిందని, విపరీతమైన ఎండలకు తమ కస్టమర్లు పడుతున్న ఇబ్బందులకు కొంతమేర చెక్ పెట్టినట్లయిందన్నారు. కస్టమర్ కూడా మాట్లాడుతూ ఫస్ట్ నేను ఏదో కరోనా మందు అనుకున్నా కానీ.. ఇక్కడికి వచ్చాక తెలిసింది అసలు కథ అన్నారు. వాటర్ స్పింక్లర్లని ఏర్పాటు చేయడం మంచి కాన్సెప్ట్ అంటూ కితాబిచ్చారు. మీరు కూడా ఈ పెట్రోల్ బంక్ కి వెళ్ళి కూల్ కూల్ గా వచ్చేసేయండి మరి..


Red Foods 10 Benefits: ఈ ఎరుపురంగు ఆహారాలు తింటే మీకు స్ట్రోక్‌ రాకుండా కాపాడతాయి..

Red Foods 10 Benefits: ఎర్రని పండ్లు కూరగాయలు రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. టమాటా, స్ట్రాబెరీ, రెడ్ బెల్‌పెప్పర్ వంటి ఆహారాల్లో విటమిన్స్, మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ లో పుష్కలంగా ఉంటాయి.


చాణక్య నీతి ప్రకారం ఈ లక్షణాలు ఉన్నవారు ఎప్పటికైనా ధనవంతులౌతారు..!

మన ప్రణాళికలను ఎప్పుడైతే ఇతరులకు షేర్ చేస్తామో... అప్పుడే మన పనుల్లో అడ్డంకులు మొదలౌతాయి. అడ్డంకి సృష్టించేవారు మన పక్కనే ఉంటారు. కాబట్టి.. చేసే పనులను రహస్యంగా ఉంచాలి. కష్టపడనిదే ఏదీ సొంతం కాదు. కష్టపడకుండా ఏది మనకు దక్కినా అది ఎక్కువ కాలం నిలవదు. అదే శ్రమించి సాధించుకున్నది అయితే.. కలకలం నీ వెంటే ఉంటుంది. ఈ సంగతి పక్కన పెడితే.. చాణక్య నీతి ప్రకారం... మీలో కనుక ఈ కింది లక్షణాలు ఉంటే.. మీరు కచ్చితంగా జీవితంలో ఏదో ఒక సమయంలో ధనవంతులు అవుతారట. మరి...


సీక్రెట్స్ ఆఫ్ ది నియాండర్తల్స్: 75 వేల ఏళ్లనాటి మహిళ ముఖాన్ని శాస్త్రవేత్తలు మళ్లీ ఎలా సృష్టించారంటే....

నియాండర్తల్స్...మన నుంచి విడిపోయిన మరో మానవజాతి. 40వేల ఏళ్ళ కిందట అంతరించిపోయిన ఈ జాతి గురించి పరిశోధనలు సాగుతున్నాయి. ఈ క్రమంలో 75వేల ఏళ్ల నాటి నియాండర్తల్స్ మహిళ పుర్రె ఆధారంగా ఆమె రూపాన్ని శాస్త్రవేత్తలు పునర్ నిర్మించారు. నియాండర్తల్స్ మన తోబుట్టువులే. మరి ఈ 75వేల ఏళ్ళనాటి తోబుట్టువు మనకు ఏం చెబుతున్నారు?


నాజూకు నడుము, ఊరిస్తున్న సొగసు.. ఈ బ్యూటీ అందాలకు ఎవ్వరైనా పడిపోవాల్సిందే..!

గ్లామర్ తలపులు తెరవడంతో అస్సలు వెకడుగేయదు శ్రద్ద దాస్. వెండితెరపై అయినా, కెమెరా ముందైనా పరువాల ప్రదర్శన చేయడంలో ఆమె తర్వాతే ఎవరైనా. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. నాజూకు నడుము చూపిస్తూ కుర్రకారును మైకం తెప్పించింది. తన లేలేత గ్లామర్ హైలైట్ చేస్తూ ఫోటో షూట్ చేసింది శ్రద్ద దాస్. దీంతో ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పిక్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ సొగసు చూడతరమా అంటూ రొమాంటిక్ కామెంట్లు పెడుతున్నారు. పైట చాటు అందాలు బయట పెడుతూ కెమెరా ముందు రొమాంటిక్ ఫోజులిస్తూ కుర్రకారులో సెగలు పుట్టిస్తుండటం అమ్మడి హ్యాబీ. తాజాగా వదిలిన ఫొటోల్లో పరువాల పొంగులతో పరేషాన్ చేసేసింది. ఈ పిక్స్ చూసి యూత్ మైమరచిపోతున్నారు. ఎవరేమనుకున్నా నా శరీరం నా ఇష్టం అన్నట్లుగా కెమెరా ముందు రచ్చ చేస్తోంది శ్రద్దా దాస్. అందాల ఆరబోతలో తనను మించిన వాళ్లు ఎవరూ లేన్నట్లుగా బాడీలోని ప్రతి అణువు చూపిస్తూ కొంటె చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. దీంతో సోషల్ మీడియాలో అమ్మడి హవా నడుస్తోంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా దాస్.. వెండితెరకు తన గ్లామర్ అద్ది పాపులర్ అయింది. కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకోనప్పటికీ అందాల భామగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది. ఆ తర్వాత ఆమె చేసిన ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకుల్లో భారీ డిమాండ్ చేకూరింది. దీంతో ఈ అమ్మడు గ్లామర్‌నే నమ్మకుంది. అయిన సరైన అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి అందని ద్రాక్ష అనే చెప్పాలి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది శ్రద్దా దాస్. సోషల్ మీడియాలో శ్రద్ద చేస్తున్న హంగామాకు ఆమె ఫాలోయింగ్ పెరగడంతో పాటు దర్శకనిర్మాతల చూపు ఆమెపై పడుతోంది. ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు రెడీగా ఉన్న శ్రద్దా దాస్.. ప్రస్తుతం అవకాశాల వేటలో ఉంది. గత కొంతకాలంగా అందాలు ఆరబోయడంలో సరికొత్త దారులు వెతుకుతూ నెట్టింట రచ్చ చేస్తోంది శ్రద్ద దాస్. దీంతో యూత్ అంతా ఆమె సోషల్ మీడియా వాల్ పై ఓ కన్నేసి ఉంచుతున్నారు.


Astrology: కుజ సంచారంతో ఈ రాశుల వారికీ కుబేర ధన యోగం.. పట్టిందల్లా బంగారమే..

Astrology: గ్రహాలు నిరంతరం పరిభ్రమణం చేస్తుంటాయి. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికీ అనుకోని లాభాలు కలిగితే.. మరికొందరికీ తీవ్ర పరిణామాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. తాజాగా కుజుడు రాశిమార్పు వల్ల రాబోయే నెల రోజుల్లో ఈ రాశుల వారికీ అనుకోని ధనలాభాలు కలగనున్నాయి.


Horoscope: మే 3 రాశిఫలాలు. ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు...!

జ్యోతిష్య పండితులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు చెబుతుంటారు. అనేక ఇతర అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని ఏ రాశి వారికి ఎలాంటి రోజు వారీగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. 2024 మే 3వ తేదీ, శుక్రవారం నాటి దిన ఫలాలు ఏయే రాశికి ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేష రాశి (Aries): వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆదాయం పెరగడానికి సంబంధించి కొత్త ప్రయత్నాలు చేస్తారు. తోబుట్టువులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. వ్యాపారాల్లో లాభాలపరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. వృషభం (Taurus): కుటుంబ వ్యవహారాలను చాలావరకు చక్కబెడతారు. కొద్ది వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. కానీ, ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. శత్రు, రోగ, రుణ బాధలు బాగా తగ్గి ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన ఆశించినంతగా బాగా పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. మీ పనితీరుతో, ప్రతిభతో అధికారులను ఆకట్టుకుంటారు. మిథునం (Gemini): వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు బాగా రాణిస్తాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఆహార, విహా రాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. విదేశాల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. మిత్రులకు సహాయం చేస్తారు. కర్కాటక రాశి (Cancer): కొందరు ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల మీద శ్రద్ధ పెంచుతారు. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి శుభవార్త వింటారు. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. సంతానం నుంచి ఆశించిన మంచి వార్తలు వింటారు. జీవిత భాగస్వామికి కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. సింహం (Leo): ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెట్టడంలో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. వ్యక్తిగత సమ స్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. బంధుమిత్రులు మీ సలహాలు, సూచనలకు విలువ నిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. కొందరు సహో ద్యోగులతో అకారణ శత్రుత్వం ఏర్పడే అవకాశముంది. ప్రయాణాల్లో ప్రమాదాలు ఎదురు కావచ్చు. కన్య రాశి (Virgo): అన్ని విధాలుగానూ సంపాదన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు వృద్ధి చెందే అవకా శముంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. కొందరు మిత్రుల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే సూచ నలున్నాయి. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రతిభా పాటవాలకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. తుల రాశి (Libra): ఉద్యోగంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. డాక్టర్లకు, లాయర్లకు, ఇతర వృత్తులవారికి బాగా డిమాండ్ ఏర్పడుతుంది. క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగు తాయి. సోదర వర్గంతో సమస్యలు పరిష‌్కరించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. అదనపు సంపాదన ప్రయత్నాలు కూడా సత్ఫలితాలనిస్తాయి. కొత్త నిర్ణయాలకు సమయం అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి (Scorpio): వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగి పోతాయి. వృత్తి జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహపరుస్తాయి. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కాస్తంత ఆందోళన కలిగిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ధనస్సు రాశి (Sagittarius): వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. కొత్త బాధ్యతలను చేపడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటు ఉండదు. సమాజంలో మాట చెల్లుబాటు అవుతుంది. కొత్త ప్రయత్నా లను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. మకర రాశి (Capricorn): మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు హ్యాపీగా సాగి పోతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత వృద్ధి చెందుతుంది. చదువుల్లో పిల్లలు పురోగతి సాధి స్తారు. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. కుంభ రాశి (Aquarius): ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. వృత్తి జీవితం బిజీగా గడిచిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యక్తిగత సమస్య లను పరిష్కరించుకుంటారు. ఇతరులతో, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దిగి ఇబ్బందిపడే సూచనలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభి స్తాయి. మీన రాశి (Pisces): వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. వాతావరణం బాగా అనుకూలంగా మారు తుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారే అవకాశం ఉంది. వ్యాపారాల్లో అప్రయత్నంగా లాభాలు పెరుగుతాయి. మనసులోకి కోరికలు నెరవేరుతాయి. కష్టార్జితం పెరిగే అవకాశం ఉన్న ప్పటికీ వృథా ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.


టమాటా నారుమడి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

టమాటా నారుమడి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. టమాటా ..  ఈ పంట గతేడాది పండించిన వారు కోటీశ్వరులయ్యారు. ఈరైతులు టమాటా సాగుపై దృష్టి సారించారని తెలుస్తోంది. అయితే టమాటా నారు మడి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. రైతులు ఏ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. . టమాటను అధికంగా కూరగాయగానే కాకుండా సూపుగాను, జ్యూసుగాను, కెచప్, ప్యూరీ, పేస్...


పాలలో ఖర్చూరాలను నానబెట్టి తింటే ఏమౌతుందో తెలుసా?

చాలా మందికి ఉదయాన్నే పాలను తాగే అలవాటు ఉంటుంది. అయితే ప్రతి రోజూ ఉదయం పాలలో నానబెట్టిన ఖర్చూరాలను తింటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తహీనత చాలా మందికి రక్తహీనత సమస్య ఉంటుంది. ముఖ్యంగా మగవారి కంటే ఆడవారే రక్తహీనత సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. అయితే ఈ రక్తహీనత ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం ఖర్జూరాలను పాలలో నానబెట్టి తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడతారు. ఇది శరీరంలో రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. ఒంట్లో...


Empty Stomach: ఖాళీ పొట్టతో జ్యూసులు తాగకూడదట, ఎందుకో తెలుసుకోండి

Empty Stomach: వేసవిలో చల్ల చల్లని జ్యూసులు తాగేందుకు ఎంతో మంది ఇష్టపడతారు. అయితే ఖాళీ పొట్టతో మాత్రం జ్యూసులు తాగకూడదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అలా ఎందుకు చెబుతున్నారో తెలుసుకోండి.


‘నా గదిలో భూతాలు ఉన్నాయి’ అంటూ చిన్నారి కేకలు, ఏంటా అని చూస్తే..

మూడేళ్ల బాలిక సేలర్ క్లాస్ తన బెడ్‌రూమ్‌లో మాన్‌స్టర్స్ ఉన్నాయంటూ తరుచూ తన తల్లిదండ్రులకు చెబుతోంది. పాప ఎక్కువగా ఊహించుకుంటూ ఇలా భయపడుతోందని తొలుత వారు పెద్దగా పట్టించుకోలేదు.


30లలో టీనేజ్‌ లుక్‌ కోసం సింపుల్ చిట్కాలు!

ఇక్కడ చర్మాన్ని అందంగా, ఆకర్షణీయంగా ఉంచే చిట్కాల గురించి వివరించాం. ఈ టిప్స్‌ ఫాలో అయితే చర్మంపై ఉన్న ముడతలు తగ్గుతాయి. నిత్య యవ్వనంగా ఉండేందుకు అవకాశం లభిస్తుంది.


Pre Wedding Diet : పెళ్లికి ఒక వారం ముందు నివారించాల్సిన కొన్ని విషయాలు

Pre Wedding Diet : పెళ్లి సమయానికి అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. కానీ దానికి తగ్గట్టుగా డైట్ పాటించాలి. అప్పుడే బాగుంటారు.


మే 7న శనీశ్వర జయంతి.. శని దేవుని అనుగ్రహం కోసం ఈ పనులు తప్పక చేయాల్సిందే!

శని భగవానుడి జన్మదినాన్ని సూచించే పవిత్రమైన రోజును శని జయంతిగా పేర్కొంటారు. ఆయన ఆశీర్వాదం, రక్షణను కోరుకునే భక్తులకు ముఖ్యమైన దినం. ఇది సాధారణంగా మే లేదా జూన్‌లో వచ్చే హిందూ నెల జ్యేష్ఠలో అమావాస్య (అమావాస్య రోజు) నాడు వస్తుంది. ఈ సంవత్సరం శని జయంతి 2024 మే 7న, మంగళవారం రాబోతోంది.ఒకరు చేసిన కర్మల ఆధారంగా శని దేవుడు న్యాయాన్ని అందిస్తాడని నమ్ముతారు. అడ్డంకులు, కష్టాలు, దురదృష్టాల నుంచి రక్షణ కోసం శని భగవంతుని అనుగ్రహం కోసం భక్తులు పూజిస్తారు....


Jupiter and Venus Conjunction 2024: గురు, శుక్ర గ్రహాల కలయిక.. ఈ రాశువారికి లాభాలే లాభాలు!

Jupiter and Venus Conjunction 2024: గురు, శుక్ర గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశులవారికి ఈ సమయంలో అనేక ధన లాభాలు కలుగుతాయి. అలాగే వీరికి విపరీతమైన ధన లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు ఎలాంటి పనుల్లోనైన విజయాలు సాధిస్తారు.


మిగిలిపోయిన మజ్జిగతో ఏమేమి చేయొచ్చు?

ఎండాకాలంలో మజ్జిగను రోజూ తాగుతుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మజ్జిగ మిగిలిపోతుంటుంది. అయితే చాలా మంది ఇలా మిగిలిపోయిన మజ్జిగను తాగడానికి ఇష్టపడరు. ఇంకేముంది దీన్ని పారేస్తుంటారు. కానీ మిగిలిపోయిన మజ్జిగతో మీరు ఎన్నో ప్రయోగాలు చేయొచ్చు. దీనితో మీరు టేస్టీ టేస్టీ వంటలు తయారుచేయొచ్చు. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఆకలి తగ్గి దాహం బాగా పెరుగుతుంది. ఎందుకంటే సూర్యరశ్మి కారణంగా గొంతు మరింత పొడిబారుతుంది. అలాగే చెమట వల్ల శరీరంలో వాటర్ కంటెంట్ బాగా...


మహిళలకు బెస్ట్ 4 ఎక్సర్‌సైజ్‌లు.. మొండి కొవ్వు కూడా మంచులా కరిగిపోవాల్సిందే..

బరువు పెరిగినంత ఈజీగా బరువు తగ్గలేరు. అందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. తినే ఆహారం నుంచి శారీరక శ్రమ వరకు చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తిగా హెల్తీ లైఫ్‌స్టైల్ అలవర్చుకోవాలి. ముఖ్యంగా థర్టీస్ ఏజ్ గ్రూప్ మహిళలు హెల్తీ వెయిట్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలి. వీరు రోజూ 5 రకాల వర్కవుట్స్ చేస్తే ఫ్యాట్ బర్న్ అవుతుంది, చూడటానికి నాజూగ్గా కనిపిస్తారు. 30ల్లో ఉన్న మహిళలు డైలీ ప్రాక్టీస్ చేయాల్సిన 5 వర్కౌట్స్ ఏవో పరిశీలిద్దాం.* స్ట్రెన్త్...


Shukra gochar in May 2024: సొంత రాశిలోకి వెళ్లబోతున్న శుక్రుడు.. ఈ 3 రాశులకు లాటరీ తగలడం పక్కా..

venus transit 2024 in May: ఈ నెల మధ్యలో శుక్రుడు ప్రస్తుతం ఉన్న రాశిని విడిచిపెట్టి తన సొంతరాశిలోకి వెళ్లబోతున్నాడు. శుక్రుడు యెుక్క ఈ కదలికలో మార్పు కారణంగా మూడు రాశులవారికి లాటరీ తగలనుంది. ఆ లక్కీ రాశులు ఏంటో తెలుసా?


టమాటా నార్లు ఎండిపోతున్నాయా.. అయితే టిప్స్ పాటించండి..

వ్యవసాయం చేసే ప్రతి రైతన్న పంటలు చేసి, మంచి లాభాలు అర్జించాలని తపన పడుతుంటారు. అదే విధంగా పోటీ పడి మరీ పంటలు సాగు చేస్తుంటారు. సీజన్లో పంటలు వేసి మంచి లాభాలు పొందాలని కొన్ని నెలలు మునుపే భూమిని గుల్ల చేసి సారం చేస్తారు. ప్రత్యేకించి ధీమాగా ఆ నెలలో సాగు చేస్తే కచ్చితంగా మార్కెట్లో ధరలు ఆకాశాన్ని అంటుతాయని సాగు చేస్తారు. ఇలా ధీమాతో చేసే పంట టమోటా. ఇదే క్రమంలోనే చిత్తూరు జిల్లాలో కొన్ని వేల ఎకరాలు టమోటా సాగు చేశారు.. ఈ టమోటా సాగు కూడా విడతల రూపంలో...


Gujarat Day 2024 Recipe: వేసవి వేడి నుంచి ఉపశమనాన్ని ఇచ్చే చల్లచల్లని స్పైసీ గుజరాతీ స్పెషల్ డ్రింక్..

Gujarat Day 2024 Recipe: మే 2 న గుజరాతీ డే ను సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కువశాతం గుజరాతీలు హోం ఫుడ్‌ కే ప్రాధాన్యత ఇస్తారు. అనేక రకాల స్వీట్లు ఇతర ఆహారపదార్థాలు వారు ఎక్కువ శాతం ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకుంటారు.


వేసవిలో కోడిగుడ్లు ఎందుకు తినాలో తెలుసా?

వేసవి కాలంలో కోడిగుడ్లు తినడం చాలా మంచిది. అది ఎందుకోసమే తెలుసుకుందాం.


చాణక్య నీతి : ఇంట్లో చెడుకాలం మొదలైందనడానికి ఇదే సంకేతం.. జాగ్రత్త!

చాలా మంది జీవితంలో చాణక్యుడి నీతిని పాటిస్తారు. ఈ పోస్ట్‌లో మీరు ఆయన చెప్పిన విషయాలను, చెడు శకునాన్ని సూచించే కొన్ని ముందు జాగ్రత్తలను చూడవచ్చు. ఇంట్లో వచ్చే ఆర్థిక సంక్షోభాన్ని కొన్ని సంకేతాల ద్వారా కనిపెట్టవచ్చు అంటారు. చాణక్య నీతిలో ఈ లక్షణాలు ఏమిటో చూద్దాం. చాణక్యుడు మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పాడు. అతను తన నీతిలో దీని గురించి చాలా రాశాడు. జీవితంలో మన లక్ష్యాలను సాధించడానికి అతని నైతికత మనకు స్ఫూర్తినిస్తుంది. అందుకే చాలా మంది చాణక్యుడి మార్గాన్ని అనుసరిస్తున్నారు. మన జీవితంలో చెడుకాలం మొదలైందని మనం ఎలా గుర్తించగలమో చాణక్యుడి ఏం చెప్పాడో చూద్దాం. ఎండిపోయిన తులసి మొక్క :సాధారణంగా చాలా మంది తమ ఇళ్లలో తులసి మొక్కను ఉంచుకుంటారు. అయితే మీ ఇంట్లో ఉండే తులసి మొక్క మీ చెడు కాలాన్ని తెలియజేస్తుందని చాణక్యుడు చెప్పాడు. అంటే ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. కాబట్టి తులసి మొక్క వాడిపోతుంటే అది మీకు చెడు కాలం అని గుర్తుంచుకోండి. రోజువారీ గొడవలు :మీ ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదని చాణక్యుడు అంటాడు. మీ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందని, చెడు కాలం ప్రారంభమవుతుందని చెబుతారు. పగిలిన గాజు:ఇంట్లో పగిలిన గాజు చెడ్డ శకునాన్ని సూచిస్తుంది. చాణక్యుడు చెప్పిన ప్రకారం, ఇంట్లో గాజు పగిలిపోతే ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందని నమ్ముతారు. పూజ లేని ఇల్లు:చాణక్యుడి నీతి ప్రకారం, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కోసం సాధారణ పూజ చాలా అవసరం. రోజూ ఇంట్లో పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని చెబుతారు. మురికి పూజ గది కూడా చెడ్డ శకునమే అని అంటారు. పెద్దలను అగౌరవపరచడం:చాణక్యుడి ప్రకారం, పెద్దలను గౌరవించని ఇంట్లో లక్ష్మి నివసించదని చెబుతారు. అంతేకాదు ఆనందం ఇంట్లో ఉండదు, రాదు. అందుకే పెద్దలను గౌరవించాలని ఎప్పుడూ చెబుతుంటారు. Disclaimer : ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


పుట్టినప్పటి నుంచి డబ్బులు ఆకర్షించే రాశులు ఇవే.. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసుకోండి..!

ఎంత కష్టపడినా కొందరికి డబ్బు ఆగదు. చాలా మందికి ఉన్న ఆందోళన ఇదే. ఎంత కష్టపడి సంపాదిస్తున్నా డబ్బు మాత్రం నిలవట్లేదని చెపుతుంటారు. ఇక ఆర్థిక పరిస్థితి మెరుగు పరుచుకోవాలని ఎంతో మందికి ఉంటుంది. అయితే కుదరక ఇబ్బంది పడుతుంటారు.. అయితే వారి రాశి కూడా దీనికి కారణం కావచ్చు అంటున్నారు జ్యోతిష్కులు.. అయితే గ్రహ వ్యవస్థ మారుతున్న కొద్దీ వారి జీవితం మారిపోతుందని అంటున్నారు. పుట్టినప్పటి నుండి డబ్బును అయస్కాంతంగా ఆకర్షించే రాశిచక్ర గుర్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. వీరు అనుకుంటే కోటీశ్వరులు కాగలరు.. అంతేకాదు కొద్ది పాటి ప్రయత్నాలతో వీరు భారీగా డబ్బు సంపాదించగలరని చెపుతున్నారు. మేషరాశి : మీరు అన్ని విషయాల్లో పట్టుదలగా ఉంటారు. ఎల్లప్పుడూ డబ్బు మీద కన్ను కలిగి ఉంటారు. మీరు ఉత్తమమైనది తప్ప మరేమీ కోరుకోరు. లక్ష్యాలను సాధించడానికి మీరు ఎంతటికైనా వెళ్తారు. మీరు కోరుకున్న జీవితాన్ని పొందడానికి చాలా కష్టపడ్డారు. కాబట్టి మీరు త్వరగా డబ్బు ఆదా చేయడానికి కట్టుబడి ఉంటారు. ప్రయత్నాలన్నీ డబ్బు వైపు మళ్లాయి కాబట్టి ఎక్కువ డబ్బు వస్తుంది. వృషభ రాశి : ఈ రాశి వారు తలపెట్టిన కార్యం సఫలం అయ్యేంత వరకు వదలరు. మీరు ఎల్లప్పుడూ మీ స్వంత ఆలోచనలను వినరు. ఎల్లప్పుడూ ఆవిష్కరణలకు సిద్ధంగా ఉంటారు, మీరు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. దీని వలన మీరు అపరిమితమైన సంపదను పొందుతారు. దిగజారిపోయినా వీరి శ్రమ డబ్బును ఆకర్షిస్తుంది. తులారాశి : తులారాశి వారు ఎక్కువ శ్రమ పడుతుంటారు. అంతేకాదు తులారాశి వారు ఎల్లప్పుడూ డబ్బుపై ఎక్కువ దృష్టి పెడతారు. వీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కువ ఖర్చు చేయకుండా పొదుపు చేస్తుంటారు. వీరి శ్రద్ధగల స్వభావం ఆదాయాన్ని పెంచుతుంది. అది తమని సౌకర్యవంతమైన పరిస్థితికి తీసుకువస్తుంది. జీవితంలో కోట్లు సంపాదించేలా చేస్తుంది. కన్య రాశి: కన్యరాశి వారు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తుంటారు. మీరు ఎల్లప్పుడూ తమకు ప్రియమైన వారికి సహాయంగా ఉంటారు. మీరు ఎల్లప్పుడూ స్వీయ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తుంటారు. ఏదైనా దాని విలువను గ్రహించి.. దాన్ని పొందేందుకు వెళ్లే వ్యక్తుల్లో వీరూ ఉంటారు. గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్‌లో ప్రచురించబడిన నమ్మకం ఆధారంగా వ్రాయబడింది. న్యూస్ 18 దీనిని ధృవీకరించ లేదు.


Tomato Pulao: టేస్టీ టమాటా పులావ్... దీన్ని చేయడం చాలా సింపుల్

Tomato Pulao: చాలామందికి టమాటా పులావ్ పేరు చెబితేనే నోరూరిపోతుంది. కానీ దీన్ని సరిగ్గా వండడం వచ్చిన వారి సంఖ్య తక్కువే. టమాట పులావ్ రెసిపీ చాలా సులువు. దీన్ని వండుకుంటే కర్రీలు అవసరం లేదు.


Money Plant: మీ ఇంట్లో మనీ ప్లాంట్ లేదా? ఈ విషయం తెలిస్తే ఇల్లంతా మొక్కలతో నింపేస్తారు

ఇంట్లో మంచి ఆహ్లాదకరమైన వాతవరణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇంటి పరిసరాల్లో చెట్లను పెంపకం చేస్తుంటాము. ఇంటి పరిసరాలు ఎక్కువగా పూల మొక్కలు, స్థలం ఉన్నవారు అయితే పెద్ద చెట్లను పెంచడానికి ఇష్టపడుతారు. కానీ ఇది పల్లెల్లో మాత్రమే సాధ్యపడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంటి పరిసరాల్లో చెట్లను పెంచుకునేంత స్థలం ఉండదు. మరి ఉన్నంత స్థలంలో మంచి ఆక్సిజన్‌ని అలాగే ఆహ్లాదాన్ని పంచే చెట్లను మనం పెంచుకునే అవకాశం ఉంది.ఈరోజుల్లో చాల మంది ఇంట్లో మంచి ఆక్సిజన్...


Washing Fruits: పండ్లపై ఉన్న కనిపించని పురుగుమందులను ఇలా సులువుగా తొలగించండి, వాటితో క్యాన్సర్ వచ్చే ప్రమాదం

Washing Fruits: ఇప్పుడు అన్ని కూరగాయలను, పండ్లను పెస్టిసైడ్స్ వేసి పండిస్తున్నారు. వాటిని తినే ముందు క్రిమిసంహారక మందులను తొలగించాలి. అందుకోసం ఇంట్లోనే ఇలా చేయండి.


Rasi Phalalu 2-5-2024: వారి డిప్లమేటిక్‌ స్కిల్స్‌ వర్కవుట్ అవుతాయి

Rasi Phalalu:జ్యోతిష్య పండితులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు చెబుతుంటారు. అనేక ఇతర అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని ఏ రాశి వారికి ఎలాంటి రోజు వారీగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. 2024 మే 2వ తేదీ, గురువారం నాటి దిన ఫలాలు ఏయే రాశికి ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):ఈ రోజు, ఆత్మపరిశీలన, మీ ఆసక్తులను కనుగొనడంపై దృష్టి పెట్టండి. వ్యక్తిగత వృద్ధికి అవకాశం కనిపించవచ్చు. మీ కమిట్‌మెంట్‌, కృషికి గుర్తింపు లభిస్తుంది. కృతజ్ఞతను తెలియజేయడం, కేర్‌ చూపడం ద్వారా కుటుంబ సంబంధాలను బలోపేతం చేయండి. రిఫ్రెష్ కావడానిఇక విహారయాత్ర ప్లాన్‌ చేయండి. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు ఆశాజనకంగా కనిపిస్తాయి. గత లోపాల నుంచి నేర్చుకోండి. నిరంతర శక్తి కోసం ఫిజికల్‌ యాక్టివిటీస్‌లో పాల్గొనండి. అదృష్ట రంగు: ఎరుపు, అదృష్‌ట సంఖ్య: 49, అదృష్ట చిహ్నం: జెండా. వృషభం (Taurus):ఈ రోజు, నిజమైన ఆనందాన్ని కలిగించే కార్యకలాపాల్లో పాల్గొనండి. ఉద్యోగ పనితీరును ఆప్టిమైజ్ చేయడానికి ఫోకస్‌, స్ట్రక్చర్‌ మెయింటైన్‌ చేయండి. విజయం సాధించడంలో స్థిరత్వం కీలకం అవుతుంది. నాణ్యమైన సమయం గడపడం, కృతజ్ఞతను వ్యక్తం చేయడం ద్వారా కుటుంబ సంబంధాలను మరింతగా పెంచుకోండి. కొత్త ఆలోచనలు పొందడానికి ట్రిప్‌ ప్లాన్ చేయండి. ఆర్థికంగా, దీర్ఘకాలిక పెట్టుబడులు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. సెల్ఫ్‌ కేర్‌ ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించండి. అదృష్ట రంగు: గ్రీన్‌, అదృష్ట సంఖ్య: 26, అదృష్ట చిహ్నం: ఫుట్‌బాల్ మైదానం. మిథునం (Gemini):కొత్త అంశాలు నేర్చుకోండి, మీ పరిధిని విస్తృతం చేసుకోండి. మీ కమ్యూనికేషన్ సామర్థ్యాలు ఈరోజు అందరి దృష్టిని ఆకర్షించవచ్చు. అర్ధవంతమైన చర్చల కోసం బంధువులతో కనెక్ట్ అవ్వండి. కొత్త ప్రదేశానికి ప్రయాణించడం వల్ల లాభదాయకంగా ఉండవచ్చు. ఆర్థిక విషయాల కోసం, సలహాను వెతకండి, తాజా ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్లు అన్వేషించండి. మానసిక వ్యాయామాలు స్పష్టతను అందించగలవు. అదృష్ట రంగు: పసుపు, అదృష్ట సంఖ్య: 35, అదృష్ట చిహ్నం: పాత వాకింగ్ స్టిక్. కర్కాటకం (Cancer):ఈ రోజు మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. మీ మనసు చేసే సూచనలు కీలక నిర్ణయాలకు మార్గనిర్దేశం చేయగలవు. మీ ప్రియమైన వారికి సానుభూతితో కూడిన సపోర్ట్‌ అందించండి. అంతర్గత శాంతి కోసం ప్రకృతిలో సమయం గడపండి. ఈరోజు ఆర్థికంగా జాగ్రత్త వహించండి, ప్రధాన నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదించండి. విశ్రాంతి, భావోద్వేగ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. అదృష్ట రంగు: వెండి, అదృష్ట సంఖ్య: 72, అదృష్ట చిహ్నం: మర్రి చెట్టు. సింహం (Leo):ఈ రోజు, మిమ్మల్ని మీరు స్వేచ్ఛగా ఎక్స్‌ప్రెస్‌ చేయండి. మీ కంఫర్ట్ జోన్‌ నుంచి బయటికి రండి. మీ లీడర్‌షిప్‌కి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆనందాన్ని పంచండి. రిఫ్రెష్‌ కావడానికి ఒక లైవ్లీ ట్రిప్‌ ప్లాన్‌ చేయండి. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు సాధించవచ్చు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే చర్యలు ప్రయోజనకరంగా ఉంటాయి. అదృష్ట రంగు: బంగారం, అదృష్ట సంఖ్య: 11, అదృష్ట చిహ్నం: లష్ గార్డెన్. కన్య (Virgo):బెటర్‌మెంట్‌ని స్వీకరించండి, రియలిస్టిక్‌ గోల్స్‌ నిర్దేశించుకోండి. వర్క్‌లో డీటైల్స్‌పై ఫోకస్‌ చేయడం కీలకం. ఓపెన్‌ డిస్కషన్‌లు కుటుంబ సంబంధాలను బలపరుస్తాయి. ప్రశాంతమైన విహారయాత్ర మీరు రిఫ్రెష్‌మెంట్‌ అందిస్తుంది. ఆర్థిక స్థిరత్వం కోసం బడ్జెట్ మెయింటైన్‌ చేయండి, తెలివిగా పెట్టబడులు పెట్టండి. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి, మంచి అలవాట్లను అనుసరించండి. అదృష్ట రంగు: నేవీ బ్లూ, అదృష్ట నంబర్: 33, అదృష్ట చిహ్నం: కాపర్ బాటిల్. తుల (Libra):అంతర్గత సమతుల్యతను కోరుకుంటారు, శాంతిని ప్రేరేపించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ డిప్లమేటిక్‌ స్కిల్స్‌ ద్వారా ఆఫీసు వివాదాలను పరిష్కరించగలరు. కుటుంబ అవగాహనను ప్రోత్సహించండి. రిఫ్రెష్‌మెంట్ కోసం కల్చరల్ రిచ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేయండి. కొలాబరేటివ్‌ ఎఫర్ట్స్‌ ఆర్థిక లాభాలకు దారితీయవచ్చు. బ్యాలెన్స్‌ని ప్రోత్సహించే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వండి. అదృష్ట రంగు: పాస్టెల్ పింక్, అదృష్ట సంఖ్య: 17, అదృష్ట చిహ్నం: స్కేల్స్. వృశ్చికం (Scorpio):ఈ రోజు, సెల్ఫ్‌-అవేర్‌నెస్‌, భావోద్వేగ అన్వేషణ కీలకం. వర్క్‌ సమస్యలను మీ పట్టుదలతో అధిగమిస్తార. దయ ద్వారా కుటుంబ సంబంధాలను బలోపేతం చేయండి. మీ ఆత్మను బలపరచడానికి ఛాలెంజింగ్‌ అడ్వెంచర్‌ ట్రిప్‌ ప్లాన్ చేయండి. దీర్ఘకాలిక పెట్టుబడులు స్థిరంగా కనిపిస్తాయి. భావోద్వేగ ఆరోగ్యం కీలకం. అదృష్ట రంగు: మెరూన్, అదృష్ట సంఖ్య: 8, అదృష్ట చిహ్నం: విదూషకుడు. ధనస్సు (Sagittarius):ఈరోజు మీ పాజిటివ్‌ వైబ్స్‌, ఇతరులకు స్ఫూర్తినిస్తాయి. సంబంధాలను బలోపేతం చేయడానికి కుటుంబంతో సమయం గడపండి. ప్రయాణం కొత్త ఎనర్జీని తీసుకొస్తుంది. ఆర్థిక విషయాలలో మీ మనసు చేసే సూచనలు విశ్వసించండి. ఆర్థిక అభివృద్ధికి సమయం ఆసన్నమైంది. మీ మానసిక స్థితిని పెంచే శారీరక కార్యకలాపాలు ప్రయోజనకరంగా ఉంటాయి. అదృష్ట రంగు: ఊదా, అదృష్ట సంఖ్య: 24, అదృష్ట చిహ్నం: నదీ తీర ప్రాంతాలు. మకరం (Capricorn):సాధించగల లక్ష్యాల కోసం శ్రద్ధగా పని చేయండి. మీ అంకితభావం హైలైట్ కావచ్చు. ఫ్యామిలీ సపోర్ట్‌ అందించండి, అది విలువైనదిగా ఉంటుంది. ట్రిప్‌ మీకు జీవితంలో అవసరమైన బ్యాలెన్స్‌ను తీసుకొస్తుంది. ఆర్థిక స్థిరత్వం కోసం ఆర్థిక క్రమశిక్షణ కొనసాగించండి. ఆరోగ్యాన్ని ప్రోత్సహించే కార్యకలాపాలలో పాల్గొనండి. అదృష్ట రంగు: గ్రే, అదృష్ట సంఖ్య: 10, అదృష్ట చిహ్నం: పవిత్ర స్థలాన్ని సందర్శించండి. కుంభం (Aquarius):మీ వ్యక్తిత్వాన్ని సెలబ్రేట్‌ చేసుకోండి, నావెల్‌ థాట్స్‌ని స్వాగతించండి. వినూత్న ఆలోచనలు ఫలితాలు అందిస్తాయి. మీ కుటుంబాన్ని గౌరవించండి, సపోర్ట్‌ ఇవ్వండి. బంధుమిత్రులతో కలిసి చేసే యాత్ర ఉత్తేజాన్నిస్తుంది. మీ విలువలకు సరిపోయే ఆర్థిక అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వండి. మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. అదృష్ట రంగు: ఎలక్ట్రిక్ బ్లూ, అదృష్ట సంఖ్య: 15, అదృష్ట చిహ్నం: బంతి పువ్వు. మీనం (Pisces):భావోద్వేగ, ఆధ్యాత్మిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ క్రియేటివ్‌ స్కిల్స్‌కి వర్క్‌లో తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబం పట్ల చూపించే కరుణ, బంధాలను బలపరుస్తుంది. నిర్మలమైన డెస్టినేషన్‌లు సందర్శించండి, మీరు కోరుకునే ప్రశాంతతను అందిస్తుంది. ఆర్థిక విషయాల కోసం, మీ దృఢత్వాన్ని విశ్వసించండి. మానసిక, భావోద్వేగ శ్రేయస్సుపై దృష్టి పెట్టండి. అదృష్ట రంగు: సీ గ్రీన్, అదృష్ట సంఖ్య: 20, అదృష్ట చిహ్నం: లాంప్‌షేడ్. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


ముఖంపై నల్ల మచ్చలు పోవాలంటే ఏం చేయాలి?

ఆడవారికి ఈ చర్మ సమస్య ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ముఖంపై ఉన్న నల్ల మచ్చలను పోగొట్టేందుకు ఎన్నో రకాల క్రీములను వాడుతుంటారు. అయినా అవి అస్సలు తగ్గవు. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ముఖంపై ఒక్క నల్ల మచ్చ కూడా లేకుండా చేయొచ్చు. అదెలాగంటే? ఆడవారు అందం విషయంలో అస్సలు తగ్గరు. అందంగా కనిపించేందుకు, ముఖం నీట్ గా కనిపించేందుకు మార్కెట్ లో దొరికే రకరకాల క్రీములను వాడుతుంటారు. ముఖ్యంగా ముఖంపై ఉండే తెల్ల, నల్ల మచ్చలను పోగొట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు....


Panchangam Today: నేటి పంచాంగం... ఉదయం ఏ పనులు పెట్టుకోవద్దు..!

నేడు 2024 శుక్రవారం, మే 2, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, చైత్ర మాసం, బహుళపక్షం, మౌడ్యకాలం. ఇవాళ 5 గంటల 38 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 37 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి కృష్ణ దశమి రాత్రి 11 గంట 22 నిమిషాల వరకూ ఉంది. తర్వాత ఏకాదశి.వారం: బృగువాసరెనక్షత్రం: శతబిష రాత్రి 12 గంటల 3 నిమిషాల వరకూ ఉంది. తర్వాత పూర్వభద్ర.యోగం: బ్రహ్మ మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల వరకూ ఉంది. తర్వాత ఐంద్ర. కరణం: వణిజ, మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషాల వరకూ ఉంది. తర్వాత భద్ర రాత్రి 11 గంటల 22 నిమిషాల వరకూ ఉంది. తర్వాత బవ. అమృతకాలం సాయంత్రం 5 గంటల 22 నిమిషాల నుంచి 6 గంటల 51 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 27 నిమిషాల నుంచి 9 గంటల 57 నిమిషాల వరకు ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం ఉదయం 10 గంటల 30 నుంచి 12 గంటల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం ఉదయం 8 గంటల 25 నిమిషాల నుంచి 9 గంటల 16 నిమిషాల వరకూ ఉంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషాల నుంచి 1 గంట 29 నిమిషాల వరకు ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Turmeric Hair Benefits: పసుపు మన జుట్టుకు ఒక వరం..ఈ 5 ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..

Turmeric Hair Benefits: పసుపు మన వంట గదిలో కచ్చితంగా ఉండే వస్తువు దీంట్లో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. దీని వంటల్లో వాడుతాం పసుపు మన ముఖానికి గ్లోయింగ్ అందిస్తుంది. అంతేకాదు ఇది బెటర్ డైజెషన్ కూడా తోడ్పడుతుంది