PREGNANCY DIET TIPS: ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఈ పదార్థాలకు దూరంగా ఉండాలి...!

Foods To Avoid During Pregnancy: గర్భం అనేది ఒక స్త్రీ జీవితంలో చాలా అందమైన అనుభవం. కానీ అదే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కూడా. ఎందుకంటే ఈ సమయంలో ఒకరే కాకుండా, కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. గర్భధారణ సమయంలో ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే శరీరానికి అవసరమైన పోషకాలు ఎక్కువగా అవసరం అవుతాయి. అంతేకాకుండా స్త్రీలు తమ ఆహారంలో పలు జాగ్రత్త పాటించాల్సి కూడా ఉంటుంది. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని ఆహారపదార్థాలను తీసుకోకుండా ఉండాల్సి ఉంటుంది. ఆ పదార్దాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

  

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఇవి అస్సలు తినకూడదు:

గర్భధారణ సమయంలో స్వార్డ్‌ఫిష్, మాకరెల్, కింగ్ మాకరెల్, షార్క్, టైల్‌ఫిష్ వంటి అధిక మెర్క్యురీ కలిగిన చేపలను తినడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. వీటిని అతిగా తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. అలాగే పచ్చి లేదా తక్కువగా ఉడికించిన మాంసం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇందులో 

 లిస్టెరియా, టాక్సోప్లాజ్మా వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల తల్లి, బిడ్డలకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు కలుగుతాయి. 

 పచ్చి గుడ్లులో సాల్మొనెల్లా బ్యాక్టీరియా కారణంగా కూడా ఆహార విషప్రక్రియకు కారణమవుతుంది. దీని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ పదార్థాలతో పాటు మీరు అన్‌పాశ్చరైజ్ చేసిన పాలు, చీజ్‌లను కూడా తినకుండా ఉండాలి. వీటిలో కూడా లిస్టెరియా అనే బ్యాక్టీరియా ఉండవచ్చు. కాబట్టి వీటిని తీసుకోవడం మంచిది కాదు. 

అధిక మోతాదులో విటిమిన్‌ ఎ తీసుకోవడం వల్ల లివర్ సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. గర్భధారణ సమయంలో ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం.

కాఫీ, టీ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఇందులోని కెఫిన్ గర్భం దాల్చిన మహిళలకు గర్భం పొందడంలో ఇబ్బంది కలిగిస్తుంది. అంతేకాకుండా తక్కువ బరువున్న పిల్లలకు దారితీస్తుంది. మద్యం సేవించడం వల్ల పిండానికి తీవ్రమైన నష్టం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్‌కు ఈ సమయంలో దూరంగా ఉండటం చాలా మంచిది. 

వీటికి బదులుగా మీరు గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందులో పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, లీన్ ప్రోటీన్, డైరీ ఉత్పత్తులు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన బిడ్డ కలుగుతుంది. కాబట్టి మీరు     అనారోగ్యకరమైన పదార్థాలను తీసుకోకపోవడం చాలా మంచిది. 

గమనిక: 

ఈ సమాచారం సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. మీకు ఏవైనా ప్రశ్నలు లేదా ఆందోళనలు ఉంటే, మీ వైద్యుడితో మాట్లాడండి. వైద్య సలహా కోసం దీన్ని ప్రత్యామ్నాయంగా ఉపయోగించకండి. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించండి.

Also Read: PM Modi To Host Dinner Party: ఢిల్లీ పోలీసులకు ప్రధాని మోదీ డిన్నర్ పార్టీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

2024-04-19T09:13:24Z dg43tfdfdgfd